• search
  • Live TV
కుప్పం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

lockdown: భర్త డ్రైవర్, బండి బాగా తోలాడు, ప్రియుడు ఇంకా బాగాతోలాడు, సినిమా స్ట్రైల్లో స్కెచ్ !

|

బెంగళూరు: ఇంటికి వచ్చి వెలుతున్న భర్త స్నేహితుడితో భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంటున్న భార్య అతనితో ఎంజాయ్ చేసింది. చుట్టుపక్కల నివాసం ఉంటున్న వాళ్లు భర్తకు విషయం చెప్పడంతో అతను భార్యను, స్నేహితుడిని తీవ్రస్థాయిలో హెచ్చరించాడు. తన ప్రియుడితో తాను సంతోషంగా ఉండటానికి భర్త అడ్డుగా ఉన్నాడని భార్య పగ పెంచుకుంది. ప్రియుడితో కలిసి పక్కాప్లాన్ తో సినిమా స్టైల్ లో భర్తను హత్య చేయించింది. తరువాత ఏమీ తెలియని అమయకురాలిగా నటించింది. అయితే చేసిన పాపం ఊరికేపోదు అనే లెక్కలో ప్రియుడితో కలిసి జల్సా చేస్తున్న భార్య అసలు బండారం మొత్తం బయటకు రావడంతో అందర్నీ అరెస్టు చేసి జైలుకు పంపించారు.

Lockdown: కాలేజ్ అమ్మాయిలతో హైటెక్ వ్యభిచారం, డ్రగ్స్, బీర్లు, బిరియానీలు, బ్లాక్ మెయిల్ !

కుప్పంలో దంపతులకు 13 ఏళ్లు తేడా

కుప్పంలో దంపతులకు 13 ఏళ్లు తేడా

పుదుచ్చేరిలోని కాటేరి కుప్పంలో కందస్వామి (41), భువనేశ్వరి (28) దంపతులు నివాసం ఉంటున్నారు. కందస్వామి, భువనేశ్వరి దంపతులకు 7, 4 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు కుమారులు ఉన్నారు. కందస్వామి, భువనేశ్వరిల మద్య వయసులో 13 ఏళ్లు తేడా ఉంది. తన కంటే 13 ఏళ్లు ఎక్కువ వయసున్న వ్యక్తితో పెళ్లి జరిపించారని భువనేశ్వరి ఎప్పుడు ఆమె తల్లిదండ్రులతో గొడవపడేది.

లింగారెడ్డి ప్రియుడు

లింగారెడ్డి ప్రియుడు

కందస్వామి ప్రైవేట్ స్కూల్ లో వ్యాన్ డ్రైవర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. లింగారెడ్డి గ్రామానికి చెందిన అజిత్ కుమార్ (24) కారు డ్రైవర్. కందస్వామి, అజిత్ కుమార్ ఇద్దరు స్నేహితులు. అప్పుడప్పుడు అజిత్ కుమార్ తన స్నేహితుడు కందస్వామి ఇంటికి వచ్చి వెళ్లేవాడు. ఆ సమయంలో కందస్వామి భార్య భువనేశ్వరితో అజిత్ కుమార్ కు పరిచయం అయ్యింది. తరువాత అజిత్ కుమార్, భువనేశ్వరి శారీరకంగా దగ్గర కావడంతో వారిద్దరు అక్రమ సంబంధం కొనసాగిస్తున్నా

స్కూల్లో భర్త, ఇంట్లో ప్రియుడు !

స్కూల్లో భర్త, ఇంట్లో ప్రియుడు !

స్కూల్ వ్యాన్ డ్రైవర్ అయిన కందస్వామి ఎప్పుడు డ్యూటీకి వెలుతాడు, ఇంటికి ఎన్ని గంటలకు తిరిగి వస్తాడు అనే విషయం భార్య భువనేశ్వరితో పాటు ఆమె ప్రియుడు అజిత్ కుమార్ కు బాగా తెలుసు. భర్త కందస్వామి బయటకు వెళ్లిన వెంటనే భువనేశ్వరి ప్రియుడు అజిత్ కుమార్ ను ఇంటికి పిలిపించుకుని అతనితో ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టింది.

భార్య దెబ్బకు రచ్చరచ్చ

భార్య దెబ్బకు రచ్చరచ్చ

భర్త కందస్వామి లేని సమయంలో భువనేశ్వరి ఇంటికి ఆమె ప్రియుడు అజిత్ కుమార్ వచ్చి వెలుతున్న విషయం చుట్టుపక్కల వారికి తెలిసిపోయింది. ఈ విషయంపై స్థానికులు చాలా కాలం ఓపికపట్టారు. చివరికి కందస్వామికి నీ భార్య భువనేశ్వరి ఏం చేస్తుందో నీకు తెలుసా ? ఇక్కడ అందరూ సంసారాలు చేసే వారే కాపురం ఉంటున్నారని, నీ భార్యను పద్దతి మార్చుకోమని నువ్వు చెబుతావా ? లేక మమ్మల్నే పోలీసులకు చెప్పమంటావా ? అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ప్రియుడితో జల్సాలకు బ్రేక్, హత్యకు ప్లాన్

ప్రియుడితో జల్సాలకు బ్రేక్, హత్యకు ప్లాన్

చుట్టుపక్కల వారు విషయం చెప్పడంతో కందస్వామి భార్య భువనేశ్వరితో పాటు స్నేహితుడు అజిత్ కుమార్ ను తీవ్రస్థాయిలో హెచ్చరించాడు. తన ఇంటికి ఇక ముందు నువ్వు రాకూడదని అజిత్ కుమార్ కు కందస్వామి వార్నింగ్ ఇచ్చాడు. ప్రియుడితో జల్సాలు చెయ్యడానికి భర్త కందస్వామి అడ్డుగా ఉన్నాడని, ఎలాగైనా అతని పీడ వదిలించుకోవాలని భువనేశ్వరి ప్రియుడు అజిత్ కుమార్ తో కలిసి ప్లాన్ వేసింది.

సినిమా స్టైల్లో భర్తను చంపాలి

సినిమా స్టైల్లో భర్తను చంపాలి

కందస్వామిని నువ్వు చంపినా, లేదా నేను చంపినా ఇద్దరు జైలుకు వెలుతామని, మన చేతులకు మట్టి అంటకుండా అతన్ని హత్య చేయించాలని భువనేశ్వరి, ఆమె ప్రియుడు అజిత్ కుమార్ ప్లాన్ వేశారు. అజిత్ కుమార్ స్నేహితుడు ప్రవీణ్ కుమార్ కు విషయం చెప్పారు. కారు డ్రైవర్ అయిన ప్రవీణ్ కుమార్ కందస్వాని హత్య చెయ్యడానికి అంగీకరించాడు. కందస్వామి ఒంటరిగా బయటకు వెళ్లిన సమయంలో అతన్ని కారుతో ఢీకొని చంపేయాలని భువనేశ్వరి, అజిత్ కుమార్, ప్రవీణ్ కుమార్ పక్కాప్లాన్ వేశారు.

 నా భర్త బయలుదేరాడు, రెఢీగా ఉండండి

నా భర్త బయలుదేరాడు, రెఢీగా ఉండండి

మార్చి 14వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో కందస్వామి బైక్ లో బయలుదేరాడు. తన భర్త కందస్వామి బైక్ లో బయలుదేరాడని భువనేశ్వరి ప్రియుడు అజిత్ కుమార్ కు సమాచారం ఇచ్చింది. ఆ సమయంలో అజిత్ కుమార్ స్నేహితుడు ప్రవీణ్ కుమార్ ఇండిగో కారు తీసుకుని అతన్ని వెంబడించాడు. మార్గం మద్యలో కందస్వామితో పాటు వెనుక మరో బైక్ లో వెలుతున్న అమాయకుడు రవిచంద్రన్ అనే వ్యక్తి బైక్ ను ప్రవీణ్ కుమార్ కారుతో ఢీకొని వెళ్లిపోయాడు. తీవ్రగాయాలైన కందస్వామి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. రవిచంద్రన్ అనే వ్యక్తికి గాయాలు అయ్యాయి.

 భర్త చస్తే జల్సాలు చేసింది. బుక్కైపోయింది

భర్త చస్తే జల్సాలు చేసింది. బుక్కైపోయింది

కందస్వామి ప్రమాదంలో చనిపోలేదని, అతన్ని భువనేశ్వరినే హత్య చేయించి ఉంటుందని అతని కుటుంబ సభ్యులకు మొదటి నుంచి అనుమానం ఉంది. భర్త చనిపోయాడు అనే భాదతో ఉన్నట్లు నటించిన భువనేశ్వరి నిత్యం ప్రియుడు అజిత్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడటం, వారానికి రెండుమూడు సార్లు అతనితో తిరిగి జల్సాలు చెయ్యడం మొదలు పెట్టింది. పోలీసులకు అనుమానం వచ్చి భువనేశ్వరి, అజిత్ కుమార్ ఫోన్లు ట్రేస్ చేశారు. కందస్వామిని పక్కాప్లాన్ తో హత్య చేశారని గుర్తించిన పోలీసులు భువనేశ్వరి, ఆమె ప్రియుడు అజిత్ కుమార్, కందస్వామిని కారుతో ఢీకొట్టి హత్య చేసిన ప్రవీణ్ కుమార్ ను అరెస్టు చేసి బెండ్ తీసి జైలుకు పంపించారు.

English summary
lockdown: wife killed her husband for illegal affair in Katteri kuppam in Puducherry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X