వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Lockdown: అక్రమ సంబంధం, లాక్ డౌన్ లో జాలీరైడ్, రక్తచరిత్ర, వెంటాడి నడిరోడ్డులో ఇద్దర్నీ నరికేశారు !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ మదురై/ మేలూర్: వివాహేతర సంబంధం విషయంలో పెద్దలు ఎంత చెప్పినా పద్దతి మార్చుకోకపోవడంతో ఇద్దరు దారుణ హత్యకు గురైనారు. రామ్ గోపాల్ వర్మ రక్తచరిత్ర సినిమాలో ప్రత్యర్థులను ఎలా వెంటాడి వేటకోడవళ్లతో నరికి చంపుతారో అలా అక్రమ సంబంధం పెట్టుకున్న వారిని బైక్ ల్లో వెంటాడి వేటాడి నరికి చంపేశారు. లాక్ డౌన్ సమయంలో పొరుగు ఊర్లో ఉన్న స్నేహితుడి ఇంట్లో ఎంజాయ్ చెయ్యడానికి జాలీరైడ్ వెలుతున్న వారిని నడిరోడ్డులో దారుణంగా నరికి చంపేశారు. వివాహిత మహిళ హత్యకు గురి కావడంతో ఆమె ముగ్గురు పిల్లలు ఇప్పుడు అనాథలు అయ్యారు.

Lockdown: ప్రభుత్వ ఆఫీస్ లో బ్లాక్ కలర్ బాబాయ్, పింక్ శ్యారీ అంటీ ఏం చేశారంటే ?, వీడియో వైరల్ !Lockdown: ప్రభుత్వ ఆఫీస్ లో బ్లాక్ కలర్ బాబాయ్, పింక్ శ్యారీ అంటీ ఏం చేశారంటే ?, వీడియో వైరల్ !

ముగ్గురు పిల్లల తల్లి

ముగ్గురు పిల్లల తల్లి

తమిళనాడులోని మదురై జిల్లా మేలూర్ సమీపంలోని తెర్కుతెరు గ్రామంలో విమల్, అయమ్మాల్ (26) దంపతులు నివాసం ఉంటున్నారు. 8 ఏళ్ల క్రితం వీరికి పెళ్లి జరిగింది. విమల్, అయమ్మాల్ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వివాహం అయిన తరువాత విమల్, అయమ్మాల్ దంపతులు పిల్లలతో కలిసి సంతోషంగా ఉండేవారు.

పక్కవీధిలో యువకుడితో లింక్

పక్కవీధిలో యువకుడితో లింక్

తెర్కుతెరు గ్రామంలోనే నివాసం ఉంటున్న అయ్యవన్ కుమారుడు అన్బునాథన్ (27) అనే యువకుడితో విమల్ భార్య అయమ్మాల్ కు పరిచయం ఉంది. వీరి పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. ఇద్దరు చనువుగా తిరుగుతున్న విషయం వారి కుటుంబ సభ్యులకు తెలియడంతో మందలించారు.

జాగ్రత్తగా ఉండండి, లేదంటే ?

జాగ్రత్తగా ఉండండి, లేదంటే ?

భార్య అయమ్మాల్ అక్రమ సంబంధం తెలుసుకున్న విమల్ ఆమెను హెచ్చరించాడు. ముగ్గురు పిల్లల తల్లితో నీకు అక్రమ సంబంధం ఏమిటని గ్రామ పెద్దలు అన్బునాథన్ ను మందలించారు. అయినా అన్బునాథన్, అయమ్మాల్ వారి పద్దతి మార్చుకోలేదు. పోలాల్లో కలుసుకోవడం, ఇంట్లో ఎవరు లేని సమయంలో కలవడం మొదలుపెట్టారు. పరిస్థితి విషమించడంతో విమల్ అతని భార్య అయమ్మాల్, అన్బునాథన్ కు లాస్ట్ వార్నింగ్ ఇచ్చాడు. పద్దతి మార్చుకోకపోతే చంపేస్తానని హెచ్చరించాడు.

లాక్ డౌన్ తో బైక్ లో జాలీరైడ్

లాక్ డౌన్ తో బైక్ లో జాలీరైడ్

అన్బునాథన్ స్నేహితుడు పక్క ఊరిలోనే నివాసం ఉంటున్నాడు. మా ఇంట్లో ఎవ్వరూ లేరని, నువ్వు, నీ ప్రియురాలు వస్తే ఏకాంతంగా కలుసుకోవచ్చని అన్బునాథన్ కు ఫోన్ చేసి చెప్పాడు. పక్క ఊరికి వెళ్లి త్వరగా వచ్చేయవచ్చని భావించిన అన్బునాథన్, అయమ్మాల్ బైక్ లో జాలీరైడ్ కు బయలుదేరారు. ఆ విషయం అయమ్మాల్ భర్త విమల్ కు తెలియడంతో రగిలిపోయాడు.

వేటకోడవళ్లతో రక్తచరిత్ర

వేటకోడవళ్లతో రక్తచరిత్ర

విమల్, అతని స్నేహితులు మూడు బైక్ ల్లో బయలుదేరారు. అన్బునాథన్, అయమ్మాల్ వెలుతున్న బైక్ ను వెంబడించారు. మేలూర్ సమీపంలోని తిరువాదపూర్ ఉత్తరవీధి సమీపంలోని పెద్ద కాలువ పక్కన అన్భునాథన్ బైక్ ను ఢీకొన్నారు. ఆ సమయంలో కిందపడిపోయిన అన్బునాథన్, అయమ్మాల్ పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే విమల్, అతని స్నేహితులు వెంటాడి నడిరోడ్డులో అన్బునాథన్, అయమ్మాల్ నువేటకోడవళ్లతో దారుణంగా నరికి చంపేశారు. ఇద్దరు ప్రాణాలు పోయాయని తెలుసుకున్న తరువాత అక్కడి నుంచి అందరూ పరారైనారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సుభాష్, సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలంలో పరిశీలించారు. హత్యకు గురైన వారి వివరాలు రెండు రోజుల తరువాత తెలిసిందని, జంట హత్యల కేసులో ముగ్గురుని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని మదురై జిల్లా ఎస్పీ సుభాష్ చెప్పారు.

English summary
Lockdown: A group of miscreants allegedly murdered a 26-year-old woman and her 27-year-old paramour at Melur town in Tamil Nadu’s Madurai district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X