బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lockdown: వర్క్ ఫ్రం హోమ్, టెక్కీ మొగుడు, డాక్టర్ పెళ్లాం, అర్దరాత్రి శాడిస్టు ఏం చేశాడంటే ?!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి దేశంలోని వైద్యులు ప్రాణాలకు తెగించి శ్రమిస్తున్నారు. కరోనా వైరస్ సోకిన రోగులకు వైద్యులు, వైద్య సిబ్బంది ప్రతిరోజు 24 గంటలు సేవ చేస్తున్నారు. గర్బిణి అయిన భార్య కరోనా వైరస్ రోగులను కాపాడటంలో భాగంగా ఆసుపత్రిలో ఎక్కువ సమయం గడిపింది. వైద్యురాలి భర్త టెక్కీ. సాఫ్ట్ వేర్ కంపెనీ ఆ టెక్కీకి వర్క్ ఫ్రం హోమ్ అవకాశం ఇవ్వడంతో ఇంట్లో ఉంటున్నాడు.

భార్య తీరుపై సహనం కోల్పోయిన టెక్కీ ఆమె గర్భవతి అనికూడా చూడకుండా అర్దరాత్రి మెడపట్టి బయటకు గెంటేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఏం జరిగింది అంటూ ఆరా తీస్తే భర్త చేస్తున్న ఆరోపణలు విని షాక్ కు గురైనారు. విషయం తెలుసుకున్న స్థానికులు వీడికి కరోనా రాను అంటూ శాపనార్తాలు పెడుతున్నారు.

lockdown murder: ఫ్రెండ్ తల్లితో బెడ్ రూంలో రాసలీలలు, అడ్డంగా నరికేసి, మర్మాంగం కత్తిరించి!lockdown murder: ఫ్రెండ్ తల్లితో బెడ్ రూంలో రాసలీలలు, అడ్డంగా నరికేసి, మర్మాంగం కత్తిరించి!

బెంగళూరులో ఫ్యామిలీ

బెంగళూరులో ఫ్యామిలీ

బెంగళూరు నగరంలోని ప్రసిద్ది చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీలో టెక్కీ (సాఫ్ట్ వేర్ ఇంజనీర్)గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి, ప్రముఖ ఆసుపత్రిలో వైద్యురాలిగా పని చేస్తున్న మహిళకు వివాహం అయ్యింది. టెక్కీ భర్త, డాక్టర్ భార్య బెంగళూరులోని జయనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.

టెక్కీకి వర్క్ ఫ్రం హోమ్, భార్యకు డ్యూటి !

టెక్కీకి వర్క్ ఫ్రం హోమ్, భార్యకు డ్యూటి !

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు సాఫ్ట్ వేర్ కంపెనీ యాజమాన్యం ఉద్యోగులు అందరికి వర్క్ ఫ్రం హోమ్ అవకాశం ఇచ్చింది. టెక్కీ భర్త గత నెల రోజుల నుంచి ఇంట్లోనే ఆఫీస్ పని చేస్తున్నాడు. భార్య డాక్టర్ కావడంతో, ఆసుపత్రిలో కరోనా రోగులతో పాటు వేరే రోగులకు చికిత్స చెయ్యడానికి ఆమె ఆసుపత్రిలో డ్యూటీ చేస్తున్నారు.

గర్భిణి భార్య అని కనికరం లేకుండా !

గర్భిణి భార్య అని కనికరం లేకుండా !

టెక్కీ భార్య ప్రస్తుతం ఐదు నెలల గర్భిణి. గర్భిణి అయిన ఆమె రోగులకు సేవ చెయ్యడానికి ఆసుపత్రికి వెళ్లి వస్తున్నది. తనకు వర్క్ ఫ్రం హోమ్ సదుపాయం ఉంటే భార్య మాత్రం ఆసుపత్రి చుట్టూ తిరుగుతోందని భర్తకు తిక్కరేగిపోయింది. గురువారం రాత్రి ఇంటికి వచ్చిన భార్యతో గొడవ పెట్టుకున్నాడు. అర్దరాత్రి గర్భిణి భార్య అని కనికరం లేకుండా ఆమెను మెడపట్టుకుని ఇంటి నుంచి బయటకు గెంటేశాడు.

పోలీసులు షాక్

పోలీసులు షాక్

అర్దరాత్రి భర్త ఇంటి నుంచి బయటకు గెంటేయడం, లాక్ డౌన్ సందర్బంగా పుట్టింటితో పాటు ఎక్కడికి, ఎవ్వరి దగ్గరకు వెళ్లడానికి అవకాశం లేకపోవడంతో గర్భిణి అయిన భార్య బెంగళూరు పోలీసు కమిషనర్ కార్యాలయంలోని వనిత సహాయవాణికి ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. పోలీసులు జయనగర్ లోని ఇంటికి దగ్గరకు వెళ్లి ఏం జరిగిందని టెక్కీ భర్తను ప్రశ్నిస్తే అతను చెప్పిన సమాధానం విన్న పోలీసులు షాక్ కు గురైనారు.

తోలు తీస్తాం జాగ్రత్త!

తోలు తీస్తాం జాగ్రత్త!

నెల రోజుల నుంచి వర్క్ ఫ్రం హోమ్ అవకాశం ఇవ్వడంతో ఇంట్లోనే ఉంటున్నానని, తన భార్య ప్రతిరోజు ఆసుపత్రి, రోగులు అంటూ వెళ్లిపోతున్నది, ఇల్లు శుభ్రంగా పెట్టడం లేదని, భోజనం సక్రమంగా చెయ్యడం లేదని భర్త ఆరోపించాడు. గర్భిణి అని కనికరం లేకుండా అర్దరాత్రి భార్యను బయటకు గెంటేసిన భర్తకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి ఇలా జరిగితే తోలు తీస్తామని టెక్కీ మొగుడికి జయనగర్ పోలీసులు గట్టిగా హెచ్చరించారు.

English summary
Lockdown: A work from home, Bengaluru techie allegedly harassed an overworked pregnant doctor wife in a clear case of domestic violence in Jayanagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X