చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lockdownmk: కరోనా కాలంలో పెళ్లిళ్లు జరిపించిన ప్రతిపక్ష నాయకుడు, మాస్క్ లు, మంత్రాలు, హార్బర్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తమిళనాడులో సోమవారం మద్యాహ్నం 3 గంటల వరకు 7, 204 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. చెన్నై నగరంలో 3, 300కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. తమిళనాడు ప్రభుత్వం నిర్లక్షం వలనే రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయని ఇన్ని రోజులు ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసిన ఆ రాష్ట్ర శాసన సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎం.కే. స్టాలిన్ ఇంత కాలం ఇంటికే పరిమితం అయ్యారు. అయితే సోమవారం ఒక్కసారిగా ఎంకే. స్టాలిన్ ప్రజల ముందు ప్రత్యక్షం అయ్యారు. మాస్క్ లు వేసుకుని మంత్రాలు చదివించి ఉచిత వివాహాలు జరిపించారు. పేదలకు, వైద్య సిబ్బంది, నాయి బ్రాహ్మాణులు, పురావస్తుశాఖ సిబ్బందికి సహాయం చేశారు. ఇదే సమయంలో మరోసారి పళనిస్వామి ప్రభుత్వం మీద ఎంకే. స్టాలిన్ విమర్శలు గుప్పించారు.

100 మంది అమ్మాయిలు, ఆంటీలకు వల, కామాంధుడు, నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్, పాపం లేడీ డాక్టర్!100 మంది అమ్మాయిలు, ఆంటీలకు వల, కామాంధుడు, నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్, పాపం లేడీ డాక్టర్!

పెళ్లిళ్లు చేసిన ప్రతిపక్ష నాయకుడు

పెళ్లిళ్లు చేసిన ప్రతిపక్ష నాయకుడు

తమిళనాడు శాసన సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎంకే. స్టాలిన్ సోమవారం చెన్నైలోని హార్బర్ ప్రాంతంలో ఉచిత వివాహాల శుభకార్యక్రమానికి హాజరైనారు. డీఎంకే పార్టీ చెన్నై తూర్పు విభాగం జిల్లా కార్యదర్శి శేఖర్ బాబు ఆధ్వర్యంలో చెన్నై హార్బర్ లో జరిగిన ఉచిత వివాహాల శుభకార్యానికి ఎంకే. స్టాలిన్ ముఖ్య అథితిగా హాజరైనారు.

కరోనా నియమాలతో పెళ్లి

కరోనా నియమాలతో పెళ్లి

కరోనా వైరస్ సందర్బంగా విధించిన లాక్ డౌన్ నియమాలతో ఉచిత వివాహాలు జరిపించారు. వధూవరులతో పాటు వారి తల్లిదండ్రులు మాత్రమే ఈ వివాహాల శుభకార్యానికి హాజరైయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. డీఎంకే నాయకుడు ఎంకే. స్టాలిన్ తో పాటు నవవధూవరులు, వారి కుటుంబ సభ్యులు అందరూ మాస్కులు వేసుకుని కరోనా వైరస్ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

రక్తదానం, నిత్యవసర వస్తువులు

రక్తదానం, నిత్యవసర వస్తువులు

చెన్నైలోని రాజా అన్నామలై హాల్ లో జరిగిన కార్యక్రమానికి ఎంకే. స్టాలిన్ హాజరైనారు. పురావస్తు శాఖకు చెందిన శాస్త్రవేత్తలు, సిబ్బందికి ఎంకే. స్టాలిన్ ఆధ్వర్యంలో బియ్యం, నిత్యవసర వస్తులు సరఫరా చేశారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న సమయంలో రోగులను ఆదుకోవడానికి డీఎంకే కార్యకర్తలు రక్తదాన శిభిరం ఏర్పాటు చేసి రక్తదానం చేశారు. రక్తదానం చేసిన 126 మంది వాలింటర్లను ఎంకే. స్టాలిన్ అభినందించారు.

Recommended Video

Lockdown : APSRTC Services Are Ready,Ticket Charges Are Likely To High
1, 060 మందికి సహాయం

1, 060 మందికి సహాయం

వీవీ నగర్ బ్లాక్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమాంలో ఎంకే. స్టాలిన్ పాల్గొన్నారు. 160 మంది నాయిబ్రాహ్మాణులు (హెయిర్ కటింగ్ షాప్)కు 15 రకాల నిత్యవసర వస్తువులు పంపిణి చేశారు. ఎంకే. స్టాలిన్ సొంత నియోజక వర్గంలో 900 మంది లారీ క్లీనర్లకు బియ్యం, దుప్పట్లు, భోజనం చెయ్యడానికి ప్లేట్లు, నీళ్లు తాగడానికి గ్లాస్ లు పంపిణి చేశారు. చెన్నైలో కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపిస్తున్న సమయంలో ఇంత కాలం ఇంటికే పరిమితం అయిన ప్రతిపక్ష నాయకుడు ఎంకే. స్టాలిన్ ఒక్కసారిగా ప్రజల ముందు ప్రత్యక్షం అయ్యి ఒకే రోజు వివిద కార్యక్రమాల్లో పాల్గోన్నారు.

English summary
Coronavirus Lockdownmk: DMK party leader MK stalin, who organaized a free marriage for 3 couples in Chennai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X