వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ ఒత్తిడి టైంలోను..: భారత్‌లో ఎఫ్ 16 యుద్ధ విమానాల తయారీ

అత్యాధునిక ఎఫ్ 16 యుద్ధ విమానాలను సంయుక్తంగా భారత్‌లో తయారు చేసేందుకు టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ (టిఏఎస్ఎల్), అమెరికన్ ఏరో స్పేస్ దిగ్గజం లాక్ హీడ్ మార్టిన్ ఒప్పందం కుదుర్చుకున్నాయి.

|
Google Oneindia TeluguNews

ప్యారిస్: అత్యాధునిక ఎఫ్ 16 యుద్ధ విమానాలను సంయుక్తంగా భారత్‌లో తయారు చేసేందుకు టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ (టిఏఎస్ఎల్), అమెరికన్ ఏరో స్పేస్ దిగ్గజం లాక్ హీడ్ మార్టిన్ ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ప్యారిస్ ఎయిర్ షో సందర్భంగా కంపెనీలు ఈ విషయాన్ని వెల్లడించాయి.

భారత ప్రభుత్వ మేకిన్ ఇండియా నినాదానికి ఊతమిచ్చేలా ఈ డీల్ ప్రకారం లాక్ హీడ్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఫోర్ట్ వర్త్‌లో ఉన్న ప్లాంటు కార్యకలాపాలను భారత్‌కు తరలించనుంది.

Lockheed Martin signs pact with Tata to make F 16 planes in India

ఈ క్రమంలో అక్కడి అమెరికన్ల ఉద్యోగుల ఉపాధికి ప్రత్యక్ష భంగం కలగకుండా చర్యలు తీసుకుంది. భారత వాయు సేనకు అవసరమయ్యే యుద్ధ విమానాల లోటును తీర్చే బిలియన్ డాలర్ల ఆర్డర్‌ను ఆ సంస్థ పొందనుంది.

భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌తో జూన్ 26న భేటీ కానున్నారు. దీనికి ముందుగా ఈ ఒప్పందం జరగడం గమనార్హం. అమెరికా కంపెనీలు స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పించాలని ట్రంప్ ఒత్తిడి తెస్తున్నారు.

ఇలాంటి సమయంలో లాక్దీద్ భారత్‌లో ఎఫ్ 16 యుద్ధ విమానాల తయారీకి అంగీకరించడం మరో విశేషం. అయితే ఈ ఒప్పందం కారణంగా భారత్‌తో పాటు అమెరికాలోను ఉద్యోగ అవకాశాలు ఉంటాయని రెండు సంస్థలు తెలిపాయి.

English summary
Lockheed Martin signed an agreement with India's Tata Advanced Systems on Monday to produce F-16 fighter planes in India, pressing ahead with a plan to shift its Fort Worth, Texas plant to win billions of dollars worth of order from the Indian military.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X