వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యడ్యూరప్ప విమర్శల్లో మిస్సైన లాజిక్..! సంఖ్యా బలంతోనే కుమారస్వామి సీఎం అయ్యారా..?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/హైదరాబాద్ : ఆడ్వాణీలా తాను రిటైర్‌ కాబోనని మాజీ ప్రధాని దేవెగౌడ చేసిన వ్యాఖ్యలను భాజపా కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప తిప్పికొట్టారు. దేవెగౌడ ప్రధాని కావాలని ఆశపడుతున్నారంటూ విమర్శించారు. కర్ణాటకలో జేడీఎస్‌ కేవలం ఏడు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది.

అయినప్పటికీ ఆ పార్టీ నేత(దేవెగౌడను ఉద్దేశిస్తూ) ప్రధానమంత్రి లేదా ప్రధాని సలహాదారు కావాలని కోరుకుంటున్నారు అని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యడ్డీ దుయ్యబట్టారు. భాజపా అగ్రనేత ఎల్‌కే ఆడ్వాణీని విమర్శిస్తూ దేవెగౌడ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

logic missed in Yedyurappas criticism.!Kumaramaswamy became CM with numerical strength.?

ఆడ్వాణీలా నేను రాజకీయాల నుంచి తప్పుకోను. పార్టీని కాపాడుకోవడం, ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం. నేను ఎన్నికల్లో పోటీ చేయబోనని మూడేళ్ల క్రితం చెప్పాను. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పోటీ చేయక తప్పట్లేదు. నాకు దేని మీదా కోరిక లేదు. ఒకవేళ రాహుల్‌ ప్రధాని అయితే నేను ఆయన పక్కనే ఉంటాను అని దేవెగౌడ వివరణ ఇచ్చారు.

ఐతే కర్ణాటకలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ గానీ, ఆ తర్వాత బీజేపి గాని అదికారానికి దూరమయ్యి, కేవలం 38సీట్లు గెలుచుకున్న కుమార స్వామి పార్టీ అదికారం చెలాయిస్తున్న విషయాన్ని యడ్యూరప్ప మర్చిపోయినట్టు ఉన్నారు. లాజీక్ ను మర్చిపోయి మ్యజిక్ ఫిగర్ గురించి మాట్లాడి అసలు అంశాన్ని పక్కనపెట్టారని కన్నడ రాష్ట్రంలో చర్చ జరుగుతోంది.

English summary
Asked about the former prime minister Deve Gowda's remark that he would retire as an advani, BJP repelled Karnataka State President Yeddyurappa. Deve Gowda was criticized for wanting to be prime minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X