వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవిశ్వాసంపై చర్చ లేకుండానే లోకసభ నిరవధిక వాయిదా, వైసీపీ ఎంపీల రాజీనామా!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. లోకసభను స్పీకర్ సుమిత్రా మహాజన్ శుక్రవారం నిరవధిక వాయిదా వేశారు. శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు సభ ప్రారంభమైంది.

Recommended Video

లోక్‌సభ లో అనూహ్య పరిణామాలు, అవిశ్వాసం నోటీసు పరిగణలోకి తీసుకోలేము

అవిశ్వాస తీర్మానంపై చర్చించాలని విపక్షాలు నినాదాలు చేయగా, మరోవైపు అన్నాడీఎంకే సభ్యులు కావేరీ బోర్డు కోసం ఆందోళనలు నిర్వహించారు. ఎంపీలు పలువురు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో స్పీకర్ లోకసభను నిరవధిక వాయిదా వేశారు.

Lok Sabha adjourned sine die, YSRCP MPs to resign

హోదా నిరవధిక వాయిదా!

ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తూ, కేంద్రంపై టీడీపీ, వైసీపీలు 13సార్లు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చాయి. కానీ విపక్షాల ఆందోళన కారణంగా సభ పదేపదే వాయిదా పడింది. ఈ రోజు ఏకంగా నిరవధిక వాయిదా పడింది. చివరి రోజు అవిశ్వాసం అంశాన్ని కూడా స్పీకర్ ప్రస్తావించలేదు. మరోవైపు రాజ్యసభ కూడా నిరవధిక వాయిదా పడింది. ఉభయసభలు నిరవదిక వాయిదాపడ్డాయి. సభ వాయిదా పడిన తర్వాత కూడా టీడీపీ ఎంపీలు సభలో ఉండి నిరసన తెలుపుతున్నారు.

వైసీపీ ఎంపీల రాజీనామా

లోకసభ నిరవధిక వాయిదా పడటంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తున్నారు. వారు ముందే స్పీకర్ ఫార్మాట్లో తమ రాజీనామా పత్రాలను వెంట తెచ్చుకున్నారు. స్పీకర్‌కు రాజీనామాలు సమర్పిస్తారు.

English summary
"This Sabha is for a platform the raise issues for the welfare of the people. I understand that MPs have several issues they want to raise but they should keep in mind that the country has a variety of issues which need to be focused on," said Speaker Sumitra Mahajan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X