వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకసభలో గందరగోళం: 50 మందిని ఎలా లెక్కించాలి.. టీడీపీ-వైసీపీలకు స్పీకర్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభలు ఆరో రోజు కూడా వాయిదా పడ్డాయి. లోకసభ మంగళవారానికి వాయిదా పడింది. అవిశ్వాస తీర్మానంపై గత ఆరు రోజులుగా టీడీపీ, వైసీపీ సభ్యులు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇస్తున్నారు. సభ సజావుగా లేదంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ చర్చ చేపట్టడం లేదు.

కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

శుక్రవారం కూడా టీడీపీ నుంచి తోట నర్సింహం, వైసీపీ నుంచి వైవీ సుబ్బారావులు అవిశ్వాస తీర్మానంపై నోటీసు ఇచ్చారు. సభ ప్రారంభం కాగానే అన్నాడీఎంకే, టీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. దీంతో సభ మొదటిసారి పన్నెండు గంటలకు వాయిదా పడింది.

 Lok Sabha adjourned till Tuesday

ఆ తర్వాత సభ ప్రారంభమైనా అదే గందరగోళం. మరోవైపు అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టాలని టీడీపీ, వైసీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఏపీకి న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తు నినాదాలు చేశారు.

చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

అవిశ్వాసంపై చర్చ చేపట్టాలంటే సభ ఆర్డర్‌లో ఉండాలని, సభ్యులను లెక్కించాలంటే సభ సజావుగా సాగాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ తెలిపారు. సభ సజావుగా ఉంటేనే అవిశ్వాసంపై చర్చ చేపట్టగలమని చెప్పారు. లేదంటే అవిశ్వాసానికి యాభై మంది మద్దతు ఉందని ఎలా లెక్కించగలమన్నారు. ఆ తర్వాత సభలో మరింత గందరగోళం చెలరేగడంతో మంగళవారానికి వాయిదా వేసారు.

ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి తెలుగుదేశం, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడే కారణమని వైసీపీ ఎంపీ వరప్రసాద రావు శుక్రవారం మండిపడ్డారు. 2014లో వైసీపీ విషయంలో ప్రజలు ఎలా ఉన్నారో, ఇప్పుడు బీజేపీ పరిస్థితి అలాగే ఉండనుందన్నారు.

అవిశ్వాస తీర్మానం కోసం అన్ని పార్టీల మద్దతు కూడగట్టామని వరప్రసాద రావు అన్నారు. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపీలు అందరూ రాజీనామా చేస్తారని ఆయన చెప్పారు. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకపోవడం బాధాకరమన్నారు.

English summary
After the laying of papers amid din, Lok Sabha Speaker Sumitra Mahajan said she has received notices of no-confidence against the Council of Ministers from Y.V. Subba Reddy (YSRCP) and Thota Narasimham (TDP).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X