వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలింగ్ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన సమాహారం

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పండగ ప్రారంభమైంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటుగా తొలి దశ ఎన్నికల్లో మొత్తం 20 రాష్ట్రాల్లో అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఏపీ, తెలంగాణ సహా అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బిహార్, ఛత్తీస్ గఢ్, జమ్మూకాశ్మీర్, లక్షద్వీప్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయా, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, సిక్కిం, త్రిపుర, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే పోలింగ్ సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ భద్రత కట్టుదిట్టం చేసింది ఎన్నికల సంఘం. 20 రాష్ట్రాల్లో 91 లోక్‌సభ స్థానాలకు తొలిదశలో పోలింగ్ జరగనుంది. ఏపీతో పాటుగా ఒడిషా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఇక పోలింగ్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు లైవ్ అప్‌డేట్స్ అందిస్తుంది వన్ ఇండియా తెలుగు.

Election updates Live: Polling in 20 states begins

Newest First Oldest First
8:52 PM, 11 Apr

న్యూఢిల్లీ

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో 6, 5 అరుణాచల్ ప్రదేశ్, బీహార్‌లో ఒకటి, మణిపూర్‌లో రెండు, పశ్చిమ బెంగాల్‌లో ఒకటి చొప్పున ఈవీఎంలు ధ్వంసానికి గురయ్యాయని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.
8:49 PM, 11 Apr

పశ్చిమబెంగాల్

పశ్చిమబెంగాల్ 2 సీట్లకు సంబంధించి 81 శాతం పోలింగ్ నమోదైంది
8:49 PM, 11 Apr

అసోం

అసోం 5 సీట్లకు సంబంధించి 68 శాతం పోలింగ్ నమోదైంది
8:48 PM, 11 Apr

త్రిపుర

త్రిపుర ఒక్క స్థానానికి జరిగిన పోలింగ్‌కు సంబంధించి 81.8 శాతం ఓటింగ్ నమోదైంది
8:47 PM, 11 Apr

మణిపూర్

మణిపూర్ ఒక్క స్థానానికి జరిగిన పోలింగ్‌కు 78.2 శాతం ఓటింగ్ నమోదైంది.
8:46 PM, 11 Apr

నాగాలాండ్

నాగాలాండ్ ఒక్క స్థానానికి 78 శాతం పోలింగ్ నమోదైనట్టు ఈసీ వర్గాలు పేర్కొన్నాయి.
8:46 PM, 11 Apr

మిజోరం

మిజోరం ఒక్క స్థానంలో 60 శాతం పోలింగ్ రికార్డైంది
8:45 PM, 11 Apr

సిక్కిం

సిక్కింలో ఒక స్థానానికి 69 శాతం ఓటింగ్ జరిగింది
8:45 PM, 11 Apr

ఉత్తరప్రదేశ్

ఉత్తరప్రదేశ్ 8 సీట్లకు 63.69 శాతం పోలింగ్ జరిగింది
8:44 PM, 11 Apr

ఒడిశా

ఒడిశా 4 స్థానాలకు 68 శాతం పోలింగ్ జరిగింది
8:43 PM, 11 Apr

మేఘాలయ

మేఘాలయ 2 సీట్లకు 67.16 శాతం పోలింగ్ నమోదైంది
8:43 PM, 11 Apr

మహారాష్ట్ర

మహారాష్ట్ర 7 స్థానాలకు 56 శాతం ఓటింగ్ జరిగింది
8:42 PM, 11 Apr

లక్షద్దీప్

లక్షద్వీప్ ఒక్క స్థానానికి జరిగిన పోలింగ్‌కు 66 శాతం ఓటింగ్ రికార్డైంది
8:41 PM, 11 Apr

బీహార్

బీహార్ 4 స్థానాలకు 50 శాతం పోలింగ్ నమోదైంది
8:40 PM, 11 Apr

అరుణాచల్ ప్రదేశ్

అరుణాచల్ ప్రదేశ్ 2 స్థానాలకు జరిగిన పోలింగ్‌కు 66 శాతం ఓటింగ్ నమోదైంది
7:37 PM, 11 Apr

తెలంగాణలో ఓవరాల్ గా 61శాతం పోలింగ్ నమోదు.. -రజత్ కుమార్
7:35 PM, 11 Apr

తెలంగాణ ఎన్నికల సరళిపై వివరాలు మీడియాకు అందిస్తున్న ఎన్నికల అదికార రజత్ కుమార్..
5:00 PM, 11 Apr

మొత్తంగా పోలింగ్ 60శాతం దాటే అవకాశం ఉందన్న ఈసీ
5:00 PM, 11 Apr

తెలంగాణ

తెలంగాణలో ముగిసిన పోలింగ్..మధ్యాహ్నం 3 గంటల సమయానికి 48శాతం పోలింగ్ నమోదు
4:30 PM, 11 Apr

తెలంగాణ

తెలంగాణలో 13 సమస్యాత్మక ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్
2:37 PM, 11 Apr

మహారాష్ట్ర

నాగ్‌పూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రపంచంలోనే అతి చిన్న మరుగుజ్జు మహిళ జ్యోతి ఆమ్గే
2:30 PM, 11 Apr

తెలంగాణ

నానక్‌రామ్ గూడాలో ఓటు హక్కు వినియోగించుకున్న అక్కినేని నాగచైతన్య దంపతులు
1:48 PM, 11 Apr

ఉత్తర్ ప్రదేశ్

రాయ్‌బరేలీలో నామినేషన్ దాఖలు చేసే ముందు రాహుల్ గాంధీ,ప్రియాంకా గాంధీలతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ.తొలిసారిగా ఇలా పూజలు నిర్వహించడం విశేషం
12:24 PM, 11 Apr

ఉత్తర్ ప్రదేశ్

అమేథీకి నామినేషన్ ఫైల్ చేసేముందు భర్తతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ
12:22 PM, 11 Apr

వివిధ రాష్ట్రాల్లో ఉదయం 11 గంటలకు నమోదైన పోలింగ్ శాతం: నాగాలాండ్ 41% , మేఘాలయా 27%, అరుణాచల్ ప్రదేశ్ 27.48%, తెలంగాణ 22.84%,మిజోరాం 29.8% ,పశ్చిమ బెంగాల్ 38.08%, మణిపూర్ 35.03%
11:59 AM, 11 Apr

తెలంగాణ

హైదరాబాదులో ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి
11:32 AM, 11 Apr

తెలంగాణ

హైదరాబాద్ నందినగర్‌లో సతీసమేతంగా వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
11:21 AM, 11 Apr

తెలంగాణ

చింతమడకలో సతీసమేతంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం కేసీఆర్
11:16 AM, 11 Apr

తెలంగాణ

ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంత గ్రామం చింతమడకకు చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్
11:08 AM, 11 Apr

ఢిల్లీ

తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లకు సూచనలు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన చిన్న వీడియో
READ MORE

English summary
India is all set for its election festival. A few moments from now India will go for voting. In the first phase voting will take place for 91 loksabha constituencies. Totally 20 states will participate in voting in the first phse. AndhraPradesh, Sikkim, Odisha and Arunachal Pradesh will also be voting for their state assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X