వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోక్‌సభ ఎన్నికలు 2019: దేశవ్యాప్తంగా ముగిసిన ఎన్నికలు..చివరి విడతలో పోలింగ్ ప్రశాంతం

|
Google Oneindia TeluguNews

దేశంలో 2019 సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. వెస్ట్‌బెంగాల్‌లో ఒకటి రెండు చోట్ల తప్ప మిగతా చోట్ల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 59 నియోజకవర్గాలకు చివరి దశలో పోలింగ్ జరిగింది.పోలింగ్‌ మొత్తం ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగాయి. హిమాచల్ ప్రదేశ్‌, పంజాబ్‌లోని అన్ని పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరిగింది. కేంద్రపాలిత ప్రాంతం ఛండీగఢ్‌కు కూడా జరిగింది. ఇక బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లోని కొన్ని స్థానాలకు పోలింగ్ జరిగింది.

ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేయనున్న వారణాసిలో పోలింగ్ జరుగుతుంది. ఈ 59 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభం అయిన పోలింగ్... సాయంత్రం 6 గంటలకు ముగిసింది. అయితే సున్నితమైన ప్రాంతాలు నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. ఇందులో బీహార్, ఉత్తర్ ప్రదేశ్‌, జార్ఖండ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ముందుగానే అంటే నాలుగు గంటలకే పోలింగ్ ముగిసింది. ఇక ఏడవ విడత పోలింగ్ ముగియడంతో దేశవ్యాప్తంగా 2019 సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. అన్ని విడతలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు మే 23న వెలువడనున్నాయి.

Lok sabha elections 2019: Final Phase polling Live updates

Newest First Oldest First
5:46 PM, 19 May

న్యూఢిల్లీ

దేశవ్యాప్తంగా 542 పార్లమెంటు స్థానాలకు ముగిసిన పోలింగ్:ఎన్నికల సంఘం
5:44 PM, 19 May

హిమాచల్ ప్రదేశ్

మండి నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్
5:39 PM, 19 May

బెంగాల్

బీజేపీ కార్యకర్తలు సీఆర్‌పీఎఫ్ బలగాలు నరకాన్ని చూపించాయి. ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటి ఎన్నికలు చూడలేదన్న దీదీ
5:37 PM, 19 May

జార్ఖండ్

జార్ఖండ్‌లోని సమస్యాత్మక ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్. ఈవీఎంలను భద్రపరుస్తున్న పోలింగ్ అధికారులు
5:19 PM, 19 May

న్యూఢిల్లీ

సోనియాతో ముగిసిన చంద్రబాబు భేటీ
5:18 PM, 19 May

సాయంత్రం 5 గంటలకు నమోదైన పోలింగ్ శాతం

సాయంత్రం 5 గంటలకు నమోదైన పోలింగ్ శాతం బీహార్- 46.75% ; చండీగఢ్ - 51.18% ; హిమాచల్ ప్రదేశ్ - 57.43% ; మధ్యప్రదేశ్ - 59.75% ; పంజాబ్ - 50.49; ఉత్తర్ ప్రదేశ్ - 47.21% ; వెస్ట్ బెంగాల్ - 64.87% ; జార్ఖండ్ - 66.64%
4:24 PM, 19 May

హిమాచల్ ప్రదేశ్

కిన్నౌర్ నియోజకవర్గంలోని కల్పలో ఓటుహక్కు వినియోగించుకున్న స్వతంత్ర భారత్‌ తొలి ఓటరు శ్యాం సరన్ నేగీ .ఈయన వయస్సు 102 ఏళ్లు
4:13 PM, 19 May

బీహార్

ఓ పోలింగ్ కేంద్రం వద్ద రిగ్గింగ్ చేస్తుండగా అడ్డుకున్న పోలీసులపై రాళ్లతో దాడి చేసిన దుండగులు. అయితే పోలింగ్‌కు అంతరాయం కలగలేదని చెప్పిన అధికారులు
3:12 PM, 19 May

హిమాచల్ ప్రదేశ్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న పోలింగ్ స్టేషన్.తాషీగంగ్ పోలింగ్ కేంద్రం మండి నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇది సముద్రమట్టానికి 15,256 ఎత్తులో ఉంది
3:10 PM, 19 May

బీహార్

పాలిగంజ్‌లో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం. పోలింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసిన అధికారులు
1:39 PM, 19 May

వారణాసి

వారణాసిలో ఓటు హక్కు వినియోగించుకున్న బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి
12:59 PM, 19 May

న్యూఢిల్లీ

సాయంత్రం 6:30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రకటించాలి: ఎన్నికల సంఘం
12:20 PM, 19 May

వివిధ రాష్ట్రాల్లో 12 గంటలకు నమోదైన పోలింగ్ శాతం

బీహార్- 18.90% ; చండీగఢ్ - 22.30% ; హిమాచల్ ప్రదేశ్ - 27.62% ; మధ్యప్రదేశ్ - 29.48 % ; పంజాబ్ - 23.45% ; ఉత్తర్ ప్రదేశ్ - 23.16 % ; వెస్ట్ బెంగాల్ - 32.15% ; జార్ఖండ్ - 31.39%
12:18 PM, 19 May

మధ్యాహ్నం 12 గంటల సమయానికి పోలింగ్ శాతం

మధ్యాహ్నం 12 గంటల సమయానికి దేశవ్యాప్తంగా నమోదైన పోలింగ్ శాతం 25.47%
12:16 PM, 19 May

ఢిల్లీలో చంద్రబాబు బిజీ బిజీ

సాయంత్రం సోనియా గాంధీతో చంద్రబాబు సమావేశం, పొత్తులు, ఫలితాలపై చర్చించే అవకాశం
12:12 PM, 19 May

బీహార్

నలంద జిల్లా రాజ్‌గిర్ మండలంలోని చందోరా గ్రామంలో ఓటింగ్‌ బహిష్కరించిన ఓటర్లు. రోడ్లు వేస్తేనే ఓటు వేస్తామంటూ భీష్మించుకు కూర్చొన్న గ్రామస్తులు
12:10 PM, 19 May

పంజాబ్

అమృత్‌సర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ దంపతులు
11:53 AM, 19 May

న్యూఢిల్లీ

మోడీ కేదార్‌నాథ్ పర్యటనపై ఈసీకి ఫిర్యాదు చేసిన తృణమూల్ కాంగ్రెస్
11:51 AM, 19 May

పశ్చిమ బెంగాల్

మోడీ పర్యటనను పెద్ద ఎత్తున్న టీవీ ఛానెళ్లు ప్రసారం చేస్తున్నాయి. ఓటర్లు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది: టీఎంసీ
11:51 AM, 19 May

పశ్చిమ బెంగాల్

ప్రధాని మోడీ కేదార్‌నాథ్ యాత్రతో కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు: టీఎంసీ
11:43 AM, 19 May

మధ్యప్రదేశ్

ఇండోర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్
11:39 AM, 19 May

ఉదయం 11:30 గంటలకు నమోదైన పోలింగ్ శాతం

ఉదయం 11:30 గంటల సమయానికి దేశవ్యాప్తంగా నమోదైన పోలింగ్ శాతం 24.78%
11:27 AM, 19 May

పశ్చిమ బెంగాల్

బెంగాల్‌లో జాదవ్‌పూర్ నియోజకవర్గంలో టీఎంసీ మహిళలు ముసుగు ధరించి దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపించిన అభ్యర్థి అనుపమ హజారే
10:28 AM, 19 May

హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్
10:27 AM, 19 May

పంజాబ్

ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ నేత ఆనంద్‌పూర్ సాహిబ్ నియోజకవర్గ అభ్యర్థి మనీష్ తివారీ
10:26 AM, 19 May

చండీగఢ్

ఓటు హక్కు వినియోగించుకున్న చంఢీగఢ్‌ కాంగ్రెస్ అభ్యర్థి పవన్ కుమార్ బన్స్‌ల్
10:02 AM, 19 May

ఆంధ్రప్రదేశ్

చంద్రగిరిలో ప్రశాంతంగా కొనసాగుతోన్న రీపోలింగ్; సోలింగ్ సెంటర్ల వద్ద బారులు తీరిన ఓటర్లు, ఎండను కూడా లెక్క చేయకుండా ఓటు వేసేందుకు క్యూలైన్లలో నిలబడ్డ ఓటర్లు
9:37 AM, 19 May

మధ్యప్రదేశ్

ఇండోర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న బీజేపీ నేత కైలాష్ విజయ్ వర్గియా
9:33 AM, 19 May

తుది దశలో ఉదయం 9గం. వరకు నమోదైన పోలింగ్ శాతాలు బీహార్ - 10.65%, హిమాచల్ ప్రదేశ్ - 0.87%, మధ్యప్రదేశ్ -7.16%, పంజాబ్-4.64%, ఉత్తర్‌ప్రదేశ్ -5.97%, బెంగాల్ - 10.54, జార్ఖండ్ -13.19%, చండీగఢ్ -10.40%
9:01 AM, 19 May

బీహార్

పాట్నాలోని ఉమెన్స్ కాలేజీలో ఓటు వేసిన కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్
READ MORE

English summary
The seventh and final phase of voting in the Lok Sabha Election 2019 is set to take place on Sunday, 19 May, in 59 constituencies across seven states and one Union Territory.All parliamentary constituencies in Himachal Pradesh and Punjab, along with the Union Territory of Chandigarh, will vote in the final phase of the polls.In Bihar, Jharkhand, Madhya Pradesh, Uttar Pradesh and West Bengal, voting will take place in a few Lok Sabha constituencies. The Varanasi Lok Sabha seat, from where Prime Minister Narendra Modi is seeking to be re-elected, is one of the key seats that will vote in Phase 7.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X