వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2014లో ఏ పార్టీ బలం ఎంత? బీజేపీ నిలబెట్టుకుంటుందా, కాంగ్రెస్ సత్తా చాటుతుందా?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా షెడ్యూల్ ప్రకటించారు. షెడ్యూల్ ప్రకటన నేపథ్యంలో దేశమంతా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని బీజేపీ ధీమాగా ఉండగా, కూటమితో కలిసి తాము గెలుస్తామని కాంగ్రెస్ భావిస్తోంది.

2014 ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షాలతో వెళ్లినప్పటికీ ఆ పార్టీ ఒంటరిగానే మెజార్టీ కంటే పది స్థానాలు ఎక్కువగా గెలిచింది. అయినప్పటికీ మిత్రధర్మాన్ని పాటించి ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. శివసేన, టీడీపీ వంటి పార్టీలకు కేబినెట్లో చోటు కల్పించింది. ఆ తర్వాత టీడీపీ వంటి పార్టీలు బీజేపీకి దూరం జరిగాయి.

Lok Sabha Elections dates announced: How many seats did BJP and Congress won in 2014

ఇప్పుడు బీజేపీ గతంలో కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందా, తక్కువ గెలుచుకుంటుందా, ఒంటరిగా అన్ని సీట్లు సాధిస్తుందా లేక పొత్తు అవసరం ఏర్పడుతుందా అనే చర్చ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే ఎంతమేర పుంజుకుంటుందనేది చూడాల్సి ఉంది.

2014లో ఏ పార్టీ బలం ఎంత ఉందంటే.. బీజేపీ 282, కాంగ్రెస్‌ 44, తృణమూల్‌ కాంగ్రెస్‌ 34, అన్నాడీఎంకే 37​​​, బీజేడీ 20, శివసేన 18, టీడీపీ 16​​​​, టీఆర్ఎస్ 11, వైసీపీ 8, సీపీఎం 9, ఎన్సీపీ 6, ఎస్పీ 5, ఎల్జేపీ 6, ఏఏపీ 4, అకాలీదళ్‌ 4, ఆర్జేడీ 4, జమ్ము కాశ్మీర్‌ పీడీపీ 3, ఆలిండియా యునైటెడ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ 3, ఆర్‌ఎల్‌ఎస్పీ 3, ఇండిపెండెంట్లు 3, ఐఎన్‌ఎల్‌డీ 2, జేడీ(ఎస్‌) 2, జేఎంఎం 2, ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్ 2, జనతాదళ్ (యు) 2, అప్నా దళ్‌ 2, సీపీఐ 1, కేరళ కాంగ్రెస్‌ (ఎం) 1, నేషనల్‌ పీపుల్స్‌ 1, ఆర్‌ఎస్పీ 1, మజ్లిస్ 1, ఆలిండియా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ 1, నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ 1, పీఎంకే 1, ఎస్డీఎఫ్‌ 1, స్వాభిమాన్‌ పక్ష 1 స్థానంలో గెలిచింది.

English summary
BJP had won 282 seats in the 2014 general election, giving them a simple majority in the lower house of Parliament. The BJP-led National Democratic Alliance (NDA) had won 336 seats out of 543.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X