• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాలికలపై లైంగికదాడికి పాల్పడితే మరణశిక్షే: లోక్‌సభలో బిల్లుకు ఆమోదం

|
  లోక్‌సభలో బిల్లుకు ఆమోదం తెలిపిన ప్రతిపక్షాలు

  న్యూఢిల్లీ: లైంగిక దాడులకు పాల్పడే వారికి కఠిన శిక్షలకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ ఆమోదించింది. పన్నెండేళ్లలోపు బాలికలపై అత్యాచారాలకు పాల్పడే దోషులకు మరణదండన విధించడం సహా- లైంగిక నేరాల శిక్షలను కఠినతరం చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు సోమవారం లోక్‌సభ ఆమోదం లభించింది.

  ఏప్రిల్‌లో జారీ చేసిన అత్యవసరాదేశం స్థానంలో దీనిని సోమవారం సభలో ప్రవేశపెట్టారు. బిల్లు మూజువాణి తీర్మానంతో ఆమోదం పొందింది. చట్టాన్ని రూపొందించడానికి ఆర్డినెన్సు మార్గాన్ని ఎంచుకోవడంపై కొన్ని విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయితే ఆ మేరకు అవి ప్రతిపాదించిన సవరణలను సభ తిరస్కరించింది.

  Lok Sabha passes Bill to provide death to child rape convicts

  రెండు గంటలపాటు జరిగిన చర్చకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్‌ రిజిజు సమాధానమిచ్చారు. మైనర్‌ బాలికలపై అత్యాచారాలు జరిగినప్పుడు శిక్షలకు ప్రత్యేకంగా నిబంధనలు లేకపోవడంతో ప్రభుత్వం ఆ మేరకు మార్పుల్ని ప్రతిపాదించిందన్నారు. నూతన నిబంధనలకు విస్తృత ప్రచారం కల్పించాలని ఉప సభాపతి ఎం.తంబిదురై సూచించారు.

  '12 ఏళ్లలోపు బాలికలపై రేప్‌నకు పాల్పడిన వారికి కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష, యావజ్జీవ కారాగారం లేదా మరణ శిక్ష, 16 ఏళ్లలోపు బాలికలపై రేప్‌ నిందితులకు కనీసం 20 ఏళ్ల నుంచి బతికినంత కాలం జైలు శిక్ష. 16 ఏళ్లలోపు బాలికలపై గ్యాంగ్‌రేప్‌ నిందితులకు జీవితాంతం జైలు. మహిళలపై లైంగికదాడికి పాల్పడిన వారికి కనీసం పదేళ్ల కఠిన కారాగారం నుంచి జీవితకాల జైలు శిక్ష అమలవుతుంది' అని కేంద్రమంత్రి చెప్పారు. ఈ కేసుల్లో దర్యాప్తు, విచారణ వేగంగా పూర్తయ్యేందుకు కూడా నిబంధనలున్నాయి. అత్యాచార కేసులన్నిటినీ రెండు నెలల్లోపే దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉంటుంది.

  కాగా, ఏఐఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్‌ ఒవైసీ ఈ బిల్లును వ్యతిరేకించారు. కఠినమైన చట్టం ఉండాల్సిందేననీ, ప్రతిపాదిత శాసనం మాత్రం భారత్‌ను సౌదీ అరేబియా, ఇరాన్‌ల చెంతన నిలబెడుతుందనీ చెప్పారు. బాలికలనే కాకుండా మైనర్‌ బాలురనూ దృష్టిలో పెట్టుకొని మార్పులు చేయాలని ఎన్‌సీపీ సభ్యురాలు సుప్రియా సూలే సూచించారు.

  ఇది ఇలావుంటే, మూకహత్యల కేసుల్లో దోషులకు మరణశిక్ష విధించేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రభుత్వం త్వరలో తీసుకురానుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ అహిర్‌ వెల్లడించారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  A crucial bill seeking to provide death penalty to those convicted of raping girls below the age of 12 years was passed by the Lok Sabha today.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more