వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మానవత్వానికి సంబంధించినది: ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోకసభ ఆమోదం

|
Google Oneindia TeluguNews

Recommended Video

Triple talaq bill passed in Lok Sabha, Video

న్యూఢిల్లీ: ముస్లీం మహిళలకు తీవ్ర చేటు కలిగిస్తున్న ట్రిపుల్ తలాక్ బిల్లుకు గురువారం లోకసభ ఆమోదం తెలిపింది. దీనిపై చర్చ జరిగింది. చర్చ అనంతరం మూజువాణి ఓటుతో ఈ బిల్లును లోకసభ ఆమోదించింది.

ఈ బిల్లుపై మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సహా విపక్షాలు చేసిన సవరణల ప్రతిపాదనలు వీగిపోయాయి. అసదుద్దీన్ పది ప్రతిపాదనలకు మద్దతు తెలపగా, వ్యతిరేకంగా 241 మంది ఓటు వేశారు. సుప్రీం ఆదేశాల మేరకు కేంద్రం ట్రిపుల్ తలాక్ బిల్లును రూపొందించింది.

Lok Sabha passes Triple Talaq bill, ball now in Rajya Sabha

అసదుద్దీన్‌తో పాటు బీజేపీ ఎంపి హరి, కాంగ్రెస్ ఎంహి సుష్మితా దేవ్, సీపీఎం సభ్యులు సంపత్ ఇచ్చిన సవరణలపై ఓటింగ్ నిర్వహించారు. సవరణలు అన్నీ వీగిపోయాయి.

దీనిపై కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ మాట్లాడారు. ముస్లీం మహిళల కోసమే ఈ బిల్లును తీసుకు వచ్చినట్లు చెప్పారు. ముస్లీం మహిళల హక్కుల కోసం అందరు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఇది రాజకీయాలకు సంబంధించింది కాదని, మానవత్వానికి సంబంధించింది అన్నారు. కాగా, ఈ బిల్లుకు ఇక రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉంది. రాజ్యసభలో బీజేపీకి సొంతగా బలం లేదు. ఇతర పార్టీలపై ఆధారపడాలి.

English summary
The Lok Sabha on Thursday passed the triple talaq bill without any amendments with voice vote. The bill now goes to Rajya Sabha. The bill has been passed after division in Lok Sabha. The voting took place on the amendments which were moved by the Opposition members. All amendments suggested were defeated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X