వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్నాటకీయం: కాంగ్రెస్ జేడీఎస్‌ల మధ్య పూర్తయిన సీట్ల పంపకాలు..ఎవరికి ఎన్ని..?

|
Google Oneindia TeluguNews

కర్నాటకలో కాంగ్రెస్ జేడీఎస్‌ల మధ్య సీట్ల పంపకాల వ్యవహారం ముగిసింది. కర్నాటకలో 28 లోక్‌సభ స్థానాలకు గాను కాంగ్రెస్ 20 సీట్లలో తమ అభ్యర్థులను బరిలో నిలుపుతుండగా... 8 స్థానాల్లో జేడీఎస్ పోటీచేయనుంది. కేరళలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, జేడీఎస్ ప్రధాన కార్యదర్శి డానిష్ అలీల మధ్య జరిగిన సమావేశం అనంతరం సీట్ల పంపకాల విషయం ఓ కొల్లిక్కి వచ్చింది.

Lok Sabha polls: Congress, JD(S) agree on 20-8 seat sharing formula in Karnataka

ఇక కాంగ్రెస్ తూముకూరు సిట్టింగ్ స్థానాన్ని జేడీఎస్‌కు త్యాగం చేసింది. జేడీఎస్ ఉత్తర కర్నాటక, చిక్కమంగళూరు, శివమొగ్గ, హసన్, మాండ్యా , బెంగళూరు నార్త్, విజయ‌పురాలో తమ అభ్యర్థులను బరిలో నిలుపుతోంది. ఈ మధ్యే ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో జేడీఎస్ అధినేత దేవెగౌడ సీట్ల వ్యవహారంపై చర్చలు జరిపినప్పుడు తమకు 10 సీట్లు కేటాయించాలని కోరారు. కానీ బుధవారం జరిగిన చర్చల్లో జేడీఎస్‌కు 8 సీట్లు మాత్రమే కాంగ్రెస్ కేటాయించింది.

భారతీయుల డేటా చోరీకి సంబంధించి సీబీఐకి స్పందించిన ఫేస్‌బుక్,కేంబ్రిడ్జి అనలిటికాభారతీయుల డేటా చోరీకి సంబంధించి సీబీఐకి స్పందించిన ఫేస్‌బుక్,కేంబ్రిడ్జి అనలిటికా

ఇదిలా ఉంటే ఇప్పటికే మాండ్యా నుంచి ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్‌ను, హసన్ నుంచి రేవన్న తనయుడు ప్రజ్వల్‌ పేర్లను జేడీఎస్ ప్రకటించింది. అయితే వీరి పేర్లను ప్రకటించడంతో జేడీఎస్ కాంగ్రెస్ క్యాడర్‌లో విబేధాలు భగ్గుమన్నాయి. కర్నాటకలో రెండు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 18న మలిదశ పోలింగ్ ఏప్రిల్ 23వ తేదీన జరగనున్నాయి.

English summary
The Congress and JD(S) Wednesday finalised seat sharing in Karnataka for the forthcoming Lok Sabha election. Of the 28 Lok Sabha constituencies, the Congress will contest in 20 seats and the JD(S) will contest in the remaining 8 seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X