వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్పీకర్ కూతురు సివిల్ సర్వీసెస్‌కు -నాన్న నిబద్ధత చూసి దేశం కోసమన్న అంజలి

|
Google Oneindia TeluguNews

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చిన్న కుమార్తె అంజలి బిర్లా ప్రతిష్టాత్మక యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సీ) పరీక్షల్లో రాణించి సివిల్‌ సర్వీసెస్‌‌కు ఎంపికయ్యారు. యూపీఎస్‌సీ తాజాగా విడుదల చేసిన రిజర్వ్‌ లిస్ట్‌ 89 మంది అభ్యర్థుల్లో ఒకరిగా అంజలి నిలిచారు. రామ్‌జాస్‌ కాలేజీ నుండి ఆమె పొలిటికల్‌ సైన్స్‌(ఆనర్స్‌)ను పూర్తిచేసింది. 2019లో తన మొట్టమొదటి ప్రయత్నంలోనే ఆమె సివిల్స్‌కు ఎంపికైంది.

తండ్రి అక్రమ సంబంధంతో కూతుళ్ల విరక్తి -భర్తను రూ.1.5కోట్లకు అమ్మేసిన భార్య -ప్రేయసికి షాక్తండ్రి అక్రమ సంబంధంతో కూతుళ్ల విరక్తి -భర్తను రూ.1.5కోట్లకు అమ్మేసిన భార్య -ప్రేయసికి షాక్

సివిల్స్ కు ఎంపిక కావడంపై అంజలి బిర్లా భావోద్వేగానికి గురయ్యారు. సివిల్స్‌కు ఎంపికవడం ఎంతో సంతోషంగా ఉందని, సివిల్‌ సర్వీసెస్‌లో చేరాలనేది తన కల అన్నారు. దేశ ప్రజల పట్ల తన తండ్రి నిబద్ధతను ఎప్పుడూ చూస్తున్నందున సమాజం కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో సివిల్‌ సర్వీసుల్లో చేరాలనుకున్నట్లు చెప్పారు.

 Lok Sabha Speaker Om Birlas daughter Anjali cracks UPSC in first attempt

సివిల్స్‌ సాధించేందుకు చార్డర్డ్‌ అకౌంటెంట్‌ అయిన తన సోదరి ఆకాంక్ష ఎంతగానో సహకరించినట్లు తెలిపారు. ఈ విజయం తన అక్కకే అంకితమన్నారు. అంజలి బిర్లా సివిల్స్ సాధించిన సందర్భంగా దేశ రాజకీయ ప్రముఖులంతా ఆమెకు అభినందనలు తెలిపారు. కాగా,

2019 సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షా ఫలితాలను 2020 ఆగస్టు 4న ప్రకటించారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌తో పాటు గ్రూప్‌ ఏ, గ్రూప్‌ బి వంటి కేంద్ర సర్వీసుల నియామకం కోసం మొత్తం 927 పోస్టులకు యూపీఎస్‌సీ నోటిఫికేషన్‌ వెలువరించింది. మెరిట్‌ క్రమంలో తొలుత 829 మంది అభ్యర్థుల ఎంపికను ప్రకటించింది. రిజర్వ్‌ జాబితా నుండి వివిధ సివిల్‌ సర్వీసుల కోసం అంజలితో సహా 89 మంది అభ్యర్థులను తాజాగా ప్రకటించింది.

English summary
Lok Sabha Speaker Om Birla's daughter Anjali Birla has cleared the Civil Services Exam (CSE) conducted by the Union Public Service Commission (UPSC). Anjali, who studied political science (honours) from Ramjas College in New Delhi, was one among the 89 candidates who were recommended by the UPSC this year. She cleared the competitive exam in her first attempt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X