వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోక్‌సభ ఎన్నికలు 2019: ఐదో విడత పోలింగ్‌కు సంబంధించి ఉదయం నుంచి సాయంత్రం వరకు అప్‌డేట్స్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:ఐదవ విడత పోలింగ్‌ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో 51 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. ఉత్తర్ ప్రదేశ్‌లో 14 స్థానాలకు, రాజస్థాన్‌లో 12 సీట్లకు, మధ్యప్రదేశ్‌లో 7, పశ్చిమ బెంగాల్‌లో 7లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. బీహార్‌లో 5 స్థానాలకు జార్ఖండ్‌లో 4 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇక జమ్ముకశ్మీర్‌లోని లడఖ్, పుల్వామా, షోపియన్, అనంతనాగ్ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. శాంతియుతంగా పోలింగ్ జరిగేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. బెంగాల్‌లో ఘర్షణలు జరిగే అవకాశం ఉన్నందున అక్కడ కేంద్రబలగాలు మోహరించాయి.

Loksabha Elections 2019 : Fifth phase polling live updates

ఇక ఐదవ విడత పోలింగ్‌ సందర్భంగా కోటి 67 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.83 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 13వేల పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరుగుతుంది. ఇండో బంగ్లాదేశ్ సరిహద్దుల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.ఇక సమస్యాత్మక దక్షిణ కశ్మీర్‌లోని షోపియన్ అనంతనాగ్‌లలో పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో అక్కడ బందోబస్తును మరింత పటిష్టం చేశారు. జమ్ముకశ్మీర్‌లో పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. అస్సోంలో ఏడు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరుగుతుంది.

Newest First Oldest First
1:25 PM, 16 May

జమ్ముకశ్మీర్‌లో

జమ్ముకశ్మీర్‌లో పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది.
1:19 PM, 16 May

ఉత్తర్ ప్రదేశ్‌లో

ఉత్తర్ ప్రదేశ్‌లో 14 స్థానాలకు, రాజస్థాన్‌లో 12 సీట్లకు, మధ్యప్రదేశ్‌లో 7, పశ్చిమ బెంగాల్‌లో 7లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్
1:19 PM, 16 May

నీటి సమస్య తీర్చేవరకు

నీటి సమస్య తీర్చేవరకు పోలింగ్‌ను నిషేధిస్తున్నట్లు ఛత్తర్ పూర్ గ్రామ ప్రజలు నిరసన తెలిపారు
1:19 PM, 16 May

పశ్చిమ బెంగాల్‌లో

పశ్చిమ బెంగాల్‌లో మరోసారి చెలరేగిన హింస..టీఎంసీ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ..పలువురికి గాయాలు,గుంపును చెదరగొట్టిన కేంద్రబలగాలు
7:11 PM, 6 May

మధ్యప్రదేశ్

మధ్యప్రదేశ్‌లో ఈవీఎంలకు సీల్ వేస్తున్న దృశ్యం
7:08 PM, 6 May

రాజస్థాన్‌లో ముగిసిన ఐదో విడత పోలింగ్
6:30 PM, 6 May

బీహార్

సాయంత్రం 6 గంటల వరకు బీహార్ లో 57.86 పోలింగ్ నమోదు
6:25 PM, 6 May

జార్ఖండ్ 58.07
6:25 PM, 6 May

జార్ఖండ్ 58.07
6:25 PM, 6 May

పశ్చిమ బెంగాల్ 65.01
6:24 PM, 6 May

ఉత్తర ప్రదేశ్ 45.87
6:24 PM, 6 May

రాజస్థాన్ 51.99
6:24 PM, 6 May

మధ్యప్రదేశ్ 54.39
6:24 PM, 6 May

జమ్ముకశ్మీర్ 15.51
6:24 PM, 6 May

బీహార్ 48.12
6:24 PM, 6 May

ఢిల్లీ

మొత్తం 51 స్థానాల్లో 52.08 శాతం పోలింగ్
6:23 PM, 6 May

ఢిల్లీ

సాయంత్రం 5 గంటల వరకు వెల్లడైన ఓట్ల నమోదు శాతం ఇలా ఉంది
6:19 PM, 6 May

కోల్ కతా

కోల్ కతా :హుగ్లీ బీజేపీ నేత ఛటర్జీపై రాళ్లదాడి, కలెక్టర్ కార్యాలయం మందు ఛటర్జీ ఆందోళన
3:58 PM, 6 May

మహారాష్ట్ర

మహారాష్ట్రలో ఎన్నికల నిబంధనలు సడలింపు. కరువు ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయక చర్యలు చేసుకోవచ్చంటూ ఈసీ అనుమతి
3:56 PM, 6 May

జమ్మూ కశ్మీర్

అనంతనాగ్ ప్రత్యేక పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న కశ్మీరి పండిట్‌లు
3:51 PM, 6 May

జార్ఖండ్

జవహర్ విద్యామందిర్‌లో ఓటుహక్కు వినియోగించుకున్న ప్రముఖ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ
3:50 PM, 6 May

ఉత్తర్ ప్రదేశ్

లక్నోలో ఓటు హక్కు వినియోగించుకున్న సహారా అధినేత సుబ్రతో రాయ్
2:29 PM, 6 May

మధ్యాహ్నం 2 గంటలకు నమోదైన పోలింగ్ శాతం

జార్ఖండ్: 45.98శాతం;బీహార్ : 32.5 శాతం;జమ్ముకశ్మీర్ : 11.35 శాతం; మధ్యప్రదేశ్: 43.85శాతం; రాజస్థాన్: 42.73శాతం; ఉత్తర్‌ప్రదేశ్ : 35.15 శాతం;పశ్చిమబెంగాల్: 50.78శాతం
1:41 PM, 6 May

మధ్యాహ్నం 1గంటలకు నమోదైన పోలింగ్ శాతం

జార్ఖండ్: 37.24శాతం;బీహార్ : 24.49 శాతం; జమ్ముకశ్మీర్ : 6.54 శాతం;మధ్యప్రదేశ్: 31.46శాతం; రాజస్థాన్: 33.82శాతం;ఉత్తర్‌ప్రదేశ్ : 26.53శాతం; పశ్చిమబెంగాల్: 39.55శాతం
1:01 PM, 6 May

మధ్యప్రదేశ్

గదర్వారలో ఓటు హక్కు వినియోగించుకున్న నటుడు అశుతోష్ రాణా
11:39 AM, 6 May

ఉదయం 11 గంటలకు నమోదైన పోలింగ్ శాతం

జార్ఖండ్: 15.75శాతం; బీహార్ : 11.51శాతం; జమ్ముకశ్మీర్ : 1.55శాతం; మధ్యప్రదేశ్: 13.62శాతం; రాజస్థాన్: 14.37 శాతం;ఉత్తర్‌ప్రదేశ్ : 12.92శాతం; పశ్చిమబెంగాల్: 17.78శాతం
11:31 AM, 6 May

మధ్యప్రదేశ్

తన తండ్రి అంత్యక్రియలు పూర్తి చేసిన వెంటనే ఓటు హక్కు వినియోగించుకునేందుకు చత్రాపూర్ పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓ వ్యక్తి
11:26 AM, 6 May

ఉదయం 10 గంటలకు నమోదైన పోలింగ్ శాతం

బెంగాల్‌లో 17శాతం పోలింగ్ నమోదు,రాజస్థాన్‌లో 14శాతం నమోదు, జమ్ముకశ్మీర్‌లో 1.36శాతం నమోదు,బీహార్‌లో 11.01శాతం నమోదు, జార్ఖండ్‌లో 13.46శాతం నమోదు
10:57 AM, 6 May

దేశవ్యాప్తంగా కొనసాగుతూన్న పోలింగ్..ఐదవ దశలో ఇప్పటి వరకు 13శాతం పోలింగ్ నమోదు
10:56 AM, 6 May

పశ్చిమ బెంగాల్‌

పశ్చిమ బెంగాల్‌లో మరోసారి చెలరేగిన హింస..టీఎంసీ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ..పలువురికి గాయాలు,గుంపును చెదరగొట్టిన కేంద్రబలగాలు
READ MORE

English summary
51 constituencies, spread over seven states, will go to polls in this phase. Voting will take place for 14 seats in Uttar Pradesh; 12 in Rajasthan; seven each in Madhya Pradesh and West Bengal; five in Bihar and four in Jharkhand. In Jammu and Kashmir, polling will take place in Ladakh and Pulwama and Shopian districts of Anantnag constituency. Polling will take place from 7 AM till 6 PM.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X