• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లోక్‌సభ ఎన్నికలు 2019: నాలుగో విడత ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన అప్‌డేట్స్

|

దేశవ్యాప్తంగా నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే మూడు విడతల పోలింగ్ పూర్తయ్యింది. మూడువిడతలకు సంబంధించిన ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇక నాలుగో విడతలో మొత్తం 8 రాష్ట్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 71 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. బిహార్-5, జార్ఖండ్-5, మధ్యప్రదేశ్-6, మహారాష్ట్ర-17, ఒడిశా-6, రాజస్థాన్-13, ఉత్తర్ ప్రదేశ్-13, పశ్చిమ బెంగాల్-8 స్థానాల్లో పోలింగ్ కొనసాగబోతోంది. వాటితో పాటు జమ్మూకాశ్మీర్ లోని అనంతనాగ్ లోక్ సభ స్థానానికి కూడా సోమవారమే పోలింగ్ జరగనుంది.

Loksabha Elections 2019: Fourth phase live updates

నాలుగో విడత పోలింగ్‌లో మొత్తం 72 స్థానాలకు పోలింగ్ జరగనుండగా అందులో 44 సీట్లు బీజేపీ అంటిపెట్టుకుంది. శివసేన-9, బిజూ జనతాదళ్-6, తృణమూల్ కాంగ్రెస్-6, కాంగ్రెస్-3, లోక్ జనశక్తి పార్టీ-2, సమాజ్ వాది పార్టీ, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీకి చెందిన ఎంపీలో ఒక్కో స్థానంలో కొనసాగుతున్నారు. 12 కోట్ల 79 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోబోతున్నారు. 961 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ తొమ్మిది రాష్ట్రాల్లో మొత్తం లక్షా 40 వేల పోలింగ్ కేంద్రాలను కేంద్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. పోలింగ్ సజావుగా సాగడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

నాలుగో విడత పోలింగ్‌లో కొన్ని చోట్ల స్టార్ వార్ జరగనుంది. ప్రముఖ సినీ నటి ఊర్మిళా మతోండ్కర్ (కాంగ్రెస్), జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం మాజీ నాయకుడు కన్నయ్య కుమార్ (సీపీఐ), ప్రియా దత్ (కాంగ్రెస్), ఉత్తర్ ప్రదేశ్ మాజీ ము్ఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్, (సమాజ్ వాది పార్టీ), మిలింద్ దేవరా (కాంగ్రెస్)లతో పాటు కేంద్రమంత్రులు గిరిరాజ్ సింగ్, సుభాష్ భామ్రే, ఎస్ఎస్ అహ్లువాలియా, బాబుల్ సుప్రియో వంటి నేతల భవితవ్యం నాలుగో దశ పోలింగ్ సందర్భంగా తేలిపోనుంది. బిహార్ లోని బేగుసరాయ్ నుంచి కన్నయ్యకుమార్, ముంబై నార్త్ సీటు నుంచి ఊర్మిళా మతోండ్కర్ పోటీ చేస్తున్నారు.

Newest First Oldest First
7:54 PM, 29 Apr
ముగిసిన నాలుగో విడత పోలింగ్, 9 రాష్ట్రాల్లోని 71 స్థానాల్లో 60.28 శాతం పోలింగ్ నమోదు
7:22 PM, 29 Apr
కోల్ కతా
బెంగాల్‌లో గతం కంటే హింసాత్మక ఘటనలు ఏం జరగలేదన్న టీఎంసీ ఎంపీ అభ్యర్థి మున్ మున్ సేన్
6:55 PM, 29 Apr
సాయంత్రం 6 గంటల వరకు 60.28 శాతం పోలింగ్ నమోదు
6:38 PM, 29 Apr
ముంబై
విలే పార్లేలోని పోలింగ్ కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకున్న బాలీవుడ్ నటులు సన్నీ డియోల్, బాబీ డియోల్
6:18 PM, 29 Apr
న్యూఢిల్లీ
వివిధ రాష్ట్రాల్లో ఇప్పటివరకు జరిగిన పోలింగ్ శాతం
6:12 PM, 29 Apr
బీహార్
అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్‌కు నోటీసులు జారీచేసిన కేంద్ర ఎన్నికల సంఘం
6:07 PM, 29 Apr
ముంబై
బాంద్రాలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటేసి వెళ్లిపోతున్న బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్, గౌరి దంపతులు
6:06 PM, 29 Apr
మంబై
జుహులోని గాంధీగ్రాం స్కూల్ పోలింగ్ కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకున్న బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, ఆయన తండ్రి సురేశ్ ఒబెరాయ్
6:05 PM, 29 Apr
న్యూఢిల్లీ
సాయంత్రం 5 గంటల వరకు ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ శాతం ఇలా ఉంది.
6:05 PM, 29 Apr
ఢిల్లీ
అసన్ సోల్ పోలింగ్ కేంద్రంలో ఏజెంట్‌ను బెదిరించిన కేంద్రమంత్రి బాబుల్ సుప్రియోపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించిన ఎన్నికల సంఘం
6:02 PM, 29 Apr
ముంబై
విల్లా థెరిసా స్కూల్‌లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ, కుటుంబసభ్యులు
2:50 PM, 29 Apr
పశ్చిమ బెంగాల్
బీర్‌భూమి నియోజకవర్గం దుబరాజ్‌పూర్ పోలింగ్ కేంద్రంలో కేంద్రబలగాలు కాల్పులకు పాల్పడి ఓటర్లను భయపెట్టే ప్రయత్నం చేశాయంటూ ఈసీకి లేఖ రాసిన తృణమూల్ కాంగ్రెస్
2:38 PM, 29 Apr
మహారాష్ట్ర
ముంబైలోని విలా పార్లేలో ఓటు హక్కు వినియోగించుకున్న బీజేపీ మథురా ఎంపీ అభ్యర్థి హేమా మాలినీ
2:35 PM, 29 Apr
మహారాష్ట్ర
ముంబైలోని జూహూ పోలింగ్ కేంద్రంలో కుటుంబ సమేతంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న బిగ్ బీ అమితాబ్ బచ్చన్
2:33 PM, 29 Apr
మహారాష్ట్ర
ముంబైలో ఓటు హక్కు వినియోగించుకున్న బాలీవుడ్ నటి కరీనా కపూర్
2:33 PM, 29 Apr
మహారాష్ట్ర
ముంబైలోని బాంద్రాలో ఓటు హక్కు వినియోగించుకున్న బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్
2:32 PM, 29 Apr
మహారాష్ట్ర
ముంబైలోని బాంద్ర పోలింగ్ స్టేషన్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుటుంబం
1:06 PM, 29 Apr
మహారాష్ట్ర
ఖర్‌లో ఓటుహక్కు వినియోగించుకున్న ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్
1:05 PM, 29 Apr
మహారాష్ట్ర
ముంబైలో ఓటు హక్కు వినియోగించుకున్న మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్ర. సంకీర్ణ ప్రభుత్వం వచ్చినప్పటికీ అభివృద్ధిని విస్మరించకూడదు: ఆనంద్ మహీంద్ర
1:00 PM, 29 Apr
బెంగాల్
భీర్ భూమ్ జిల్లాలో టీఎంసీ మహిళా కార్యకర్తల నిరసనలు. టీఎంసీ బీజేపీల మధ్య వాగ్వాదం. సర్ది చెప్పేందుకు ప్రయత్నించిన పోలీసులు
12:57 PM, 29 Apr
మహారాష్ట్ర
ముంబైలో ఓటుహక్కు వినియోగించుకున్న ప్రముఖ సాహిత్యకారుడు జావెద్ అక్తర్, ఆయన భార్య షబానా అజ్మీ
12:56 PM, 29 Apr
మహారాష్ట్ర
ముంబైలోని గాంధీనగర్ పోలింగ్ కేంద్రంలో కుటుంబసమేతంగా వచ్చి ఓటుహక్కు వినియోగించుకున్న శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే
12:07 PM, 29 Apr
జమ్ము కశ్మీర్
మేము ఓటు ఎందుకు వేయాలి ఎవరి కోసం వేయాలి అంటూ సంతృప్తి వ్యక్తం చేసిన అనంతనాగ్ ప్రజలు. అసలు ఇక్కడ అభ్యర్థి ఎవరో కూడా మాకు తెలియదంటున్న ఓటర్లు
11:36 AM, 29 Apr
ఆయా రాష్ట్రల్లో ఉదయం 11 గంటలకు నమోదైన పోలింగ్
బీహార్ - 10.76శాతం; జమ్ముకశ్మీర్ - 0.68శాతం; జార్ఖండ్ - 13.68శాతం; మధ్యప్రదేశ్ - 14.64 శాతం; మహారాష్ట్ర - 6.77శాతం; ఒడిషా - 8.48శాతం; రాజస్థాన్ - 12.54 శాతం; ఉత్తర్ ప్రదేశ్ - 12.31శాతం; పశ్చిమబెంగాల్ - 46.91శాతం
11:31 AM, 29 Apr
మహారాష్ట్ర
ముంబైలోని విలే పార్లేలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించకున్న నటీమణులు భాగ్యశ్రీ, సోనాలి బింద్రే
11:30 AM, 29 Apr
మహారాష్ట్ర
ముంబైలోని జూహు ప్రాంతంలో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖ నటులు అనుపమ్ ఖేర్
10:40 AM, 29 Apr
ఒడిషా
ఒడిషాలో ఈవీఎంలు మొరాయించడంతో నిలిచిపోయిన పోలింగ్..ఆలస్యంగా కొనసాగుతూన్న పోలింగ్
10:34 AM, 29 Apr
బెంగాల్
బెంగాల్‌లో పోలింగ్ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు ముక్తార్ నఖ్వీ అబ్బాస్,విజయ్ గోయల్
10:31 AM, 29 Apr
జార్ఖండ్
పలాము నియోజకవర్గంలోని జగోది పోలింగ్ బూతులో తొలిసారిగా జరుగుతున్న పోలింగ్. నక్సల్ ప్రభావిత ప్రాంతం జగోది
10:20 AM, 29 Apr
మహారాష్ట్ర
బాంద్రాలో సతీ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్
READ MORE

English summary
After a successful three phase polling, India is all set to go for the fourth phase polling. The polling starts at 7 am in the morning. In the fourth phase polling will take place in 9 states and for 72 loksabha constituencies. Fourth phase will witness few film stars, union minsters and JNU student leader Kanhaiya kumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X