• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లోక్‌సభ ఫలితాలు 2019.. 30వ తేదీ సాయంత్రం 7 గంటలకు మోడీ ప్రమాణస్వీకారం

|

లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బంపర్ మెజార్టీతో బీజేపీ జెండా రెపరెపలాడింది. 50 ఏళ్ల తర్వాత తిరిగి కమలం పువ్వు రికార్డు క్రియేట్ చేసింది. ఇతర పార్టీల మీద ఆధారపడకుండా.. ఒక పార్టీకి బంపర్ మెజార్టీ రావడం యాభై ఏళ్లలో ఇది రెండోసారి. బీజేపీకి ఏకపక్షంగా జై కొట్టిన జనం 303 స్థానాలు కట్టబెట్టారు. మిత్రపక్షాలతో కలుపుకొంటే ఎన్డీయే బలం 354 కు చేరింది.

మోడీ, అమిత్ షా జోడితో బీజేపీకి నెంబర్ 1 విజయం దక్కింది. మొత్తానికి ప్రజా తీర్పు బీజేపీ పక్షమైంది. దాంతో కమలనాథులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. ప్రధాని మోడీని ప్రశంసిస్తూ దేశ, విదేశాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో నివసిస్తున్న బీజేపీ మద్దతుదారులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు.

Loksabha elections 2019 : Loksabha elections results live updates

Newest First Oldest First
5:46 PM, 26 May
ఢిల్లీ
30వ తేదీ సాయంత్రం 7 గంటలకు మరోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోడీ. ఆయనతో పాటు కొంతమంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
2:49 PM, 26 May
ఢిల్లీ
నరేంద్ర మోడీపై మండిపడ్డ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. 300కు పైగా గెలిచిన బీజేపీ ఎంపీల్లో ముస్లింలు ఎంతమంది ఉన్నారని ఫైర్
12:45 PM, 26 May
కర్ణాటక
మండ్యా నుంచి ఎంపీగా గెలిచిన సినీ నటి సుమలత బీజేపీ నేత ఎస్‌ఎం క‌ృష్ణను కలిశారు. అందర్ని కలిసి ధన్యవాదాలు తెలపడం తన బాధ్యత అన్నారు. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆ సమయంలో అక్కడే ఉన్నారు.
12:34 PM, 26 May
ఢిల్లీ
బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తో భేటీ అయిన వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి
12:27 PM, 26 May
చెన్నై
లోక్‌సభ ఫలితాల్లో ఎఐఎడీఎంకే విఫలమైన కారణంగా బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పళని స్వామి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన చెన్నై సెంట్రల్ ఎంపీ, డీఎంకే లీడర్ దయానిధి మారన్
12:11 PM, 26 May
ఢిల్లీ
నరేంద్ర మోడీతో భేటీ అయిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. విజయసాయిరెడ్డితో పాటు మరికొందరు నేతలు ఆయన వెంట ఉన్నారు.
11:15 AM, 26 May
ఢిల్లీ
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన నరేంద్ర మోడీ
10:38 AM, 26 May
ఢిల్లీ
లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయంపై నరేంద్ర మోడీకి ఫోన్ ద్వారా అభినందనలు తెలిపిన శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన
6:47 PM, 25 May
ఢిల్లీ
కొత్తగా ఎన్నికైన నేతలకు అభినందనలు తెలిపిన నరేంద్ర మోడీ
6:47 PM, 25 May
ఢిల్లీ
ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన అనంతరం రాజ్యాంగానికి నమస్కరిస్తున్న మోడీ
6:45 PM, 25 May
ఢిల్లీ
ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన అనంతరం మాట్లాడుతున్న మోడీ
6:28 PM, 25 May
ఢిల్లీ
బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నరేంద్ర మోడీ ఎన్నిక
6:27 PM, 25 May
న్యూఢిల్లీ
ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన అనంతరం మోదీతో మురళీ మనోహర్ జోషి ఆత్మీయ ఆలింగనం
6:26 PM, 25 May
ఢిల్లీ
ఎన్డీఏ నేతగా ఎన్నికయ్యాక అద్వానీ ఆశీస్సులు తీసుకుంటున్న నరేంద్ర మోదీ
6:26 PM, 25 May
ఢిల్లీ
ఎన్డీఏ నేతగా మోదీని ఎన్నుకున్నందున అన్ని పార్టీల నేతలకు అమిత్ షా ధన్యవాదాలు
6:26 PM, 25 May
బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నరేంద్ర మోదీ ఎన్నిక
6:26 PM, 25 May
న్యూఢిల్లీ
బాదల్ ప్రతిపాదనను బలపరిచిన ఉద్దవ్ థాకరే, నితీశ్ కుమార్
6:25 PM, 25 May
న్యూఢిల్లీ
బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా మోదీ పేరు ప్రతిపాదించిన శిరోమణి అకాళిదళ్ చీఫ్ ప్రకాశ్ సింగ్ బాదల్
6:25 PM, 25 May
న్యూఢిల్లీ
పార్లమెంటరీ పార్టీ నేత ఎంపిక కార్యక్రమానికి హాజరైన సీనియర్ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషి
6:24 PM, 25 May
న్యూఢిల్లీ
బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా మోదీ ఎంపిక
5:51 PM, 25 May
రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా .. నేను ఎందుకు సీఎంగా కొనసాగాలి : మమత బెనర్జీ
5:51 PM, 25 May
రాష్ట్రంలో కేంద్ర బలగాల జోక్యం ఏంటని ప్రశ్న, హిందు, ముస్లింల సమస్యపై ఈసీకి విన్నవించినా పట్టించుకోలేదని మమత ఫైర్
5:49 PM, 25 May
కోల్ కతా
ప్రధాని మోదీపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫైర్
5:48 PM, 25 May
ఢిల్లీ
ఎన్డీఏ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి విచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ
3:54 PM, 25 May
ఢిల్లీ
తనకు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండాలని లేదన్న రాహుల్ గాంధీ.. రాహుల్ గాంధీ నాయకత్వంలోనే కాంగ్రెస్ మెరుగుపడిందన్న నాయకులు
12:26 PM, 25 May
న్యూఢిల్లీ
సీడబ్ల్యూ సమావేశంలోొ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ రాజీనామా..?
12:16 PM, 25 May
న్యూఢిల్లీ
పార్టీ కార్యాలయంలో భేటీ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ
9:05 AM, 25 May
న్యూఢిల్లీ
నేడు ఎన్డీయే ఎంపీల సమావేశం...లోక్‌సభపక్ష నేతగా నరేంద్ర మోడీని ఎన్నుకోనున్న ఎంపీలు
8:18 AM, 25 May
పశ్చిమ బెంగాల్
పార్టీ నేతలతో భేటీ కానున్న మమతా బెనర్జీ
8:23 PM, 24 May
ఢిల్లీ
కాశి నుంచి వచ్చిన బీజేపీ శ్రేణులు.. వారణాసి నుంచి మోడీ గెలిచినట్లు ఈసీ అధికారులు ధృవీకరించిన సర్టిఫికెట్‌ను అందించారు.
READ MORE

English summary
2019 General elections came to an end on May 19th. The biggest ever elections were held in seven phases. The first Phase began on April 11th and the final phase ended on May 19th. Exit polls suggested BJP to make back to power. But from sometime now the results will be out. First the postal ballots will be counted after which VVPATS and EVMs will be counted.By 11 in the morning a clear picture might emerge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X