వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుమలత కులం నాయుడు, గౌడ కాదు, సోనియా గాంధీని అడుగుతారా, ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలోని మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బహుబాష నటి, స్యాండిల్ వుడ్ రెబల్ స్టార్ అంబరీష్ సతీమణిని మానిసికంగా హింసించడానికి జేడీఎస్ నాయకులు అనేక విదాలుగా సిద్దం అయ్యారు. అసలు సుమలతది ఏ జాతి, ఆమె గౌడను (అంబరీష్) పెళ్లి చేసుకున్నంత మాత్రానా గౌడ్తి అయిపోతుందా అంటూ మండ్య లోక్ సభ సిట్టింగ్ ఎంపీ శివరామేగౌడ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

<strong>అయ్యో: కర్ణాటకకు కాదు కర్ణాటాటా, కాంగ్రెస్ కు టాటా చెప్పండి, జేడీఎస్ విలీనం అయ్యిందా, బీజేపీ!</strong>అయ్యో: కర్ణాటకకు కాదు కర్ణాటాటా, కాంగ్రెస్ కు టాటా చెప్పండి, జేడీఎస్ విలీనం అయ్యిందా, బీజేపీ!

సుమలతను అడిగిన మాట సోనియా గాంధీని అడుగుతారా, ఒక ఆడపడుచును ఇలా వేదింపులకు గురి చేస్తారా అంటూ అంబరీష్ అభిమానులు మండిపడుతున్నారు. మీకు దమ్ముంటే సుమలతను అడిగిన ప్రశ్నను మీ మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీకి చెందిన యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీని ప్రశ్నించండి అంటున్నారు అంబరీష్ అభిమానులు.

 సుమలత కులం

సుమలత కులం

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు ఎక్కడి నుంచి అయినా ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అవకాశం ఉంది. మండ్య లోక్ సభ ఎన్నికల్లో సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల మద్దతుతో పోటీ చేస్తున్నారు. మండ్య లోక్ సభ నియోజక వర్గంలో సుమలత స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చెయ్యడంతో జేడీఎస్ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు సుమలత కులం ఏమిటి అంటూ కొత్త వివాదం తెరమీదకు తెచ్చారు.

యుపీఏ అధ్యక్షురాలు

యుపీఏ అధ్యక్షురాలు

మండ్య సిట్టింగ్ ఎంపీ శివరామేగౌడ నిఖిల్ కుమారస్వామికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్బంగా శివరామేగౌడ మాట్లాడుతూ సుమలత ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో జన్మించారని అన్నారు. సుమలత నాయుడు కులానికి చెందిన మహిళ అని, కేవలం అంబరీష్ ను పెళ్లి చేసుకున్నంత మాత్రానా ఆమె గౌడ కులంలోకి ఎలా వస్తారు అని ప్రశ్నించారు. సుమలతను అడుగుతున్న ప్రశ్నను యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీని అడుగుతారా అంటూ అంబరీష్ అభిమానులు ఎంపీ శిరామేగౌడ మీద మండిపడుతున్నారు.

 సుమలతది నాయుడు కులం

సుమలతది నాయుడు కులం

రెబల్ స్టార్ అంబరీష్ గౌడ, ఈ విషయం మండ్య ప్రజలు అందరికీ తెలుసు. అయితే అంబరీష్ ను వివాహం చేసుకున్న సుమలతను తాము గౌడ్తి అని ఎలా అంగీకరించడానికి సాధ్యం అవుతుంది అంటూ జేడీఎస్ ఎంపీ శివరామేగౌడ ప్రశ్నించారు. గౌడను పెళ్లి చేసుకున్న సుమలత ఎప్పటికి గౌడ్తి కాలేదని, ఆమె కులం నాయుడు అని శివరామేగౌడ అన్నారు. బెంగళూరు నగరం, నగర శివార్లలో నాయకుడు కులస్లులు ఎక్కువగా ఉన్నారని, ఇప్పుడు మండ్యలో రాజకీయాలు చెయ్యడానికి వచ్చారని, తాము అంగీకరించమని ఎంపీ శివరామేగౌడ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

గౌడ కోడలు కాలేదు

గౌడ కోడలు కాలేదు

రెబల్ స్టార్ అంబరీష్ తండ్రి హుచ్చేగౌడ. సుమలత ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో తాను అంబరీష్ భార్య, హుచ్చేగౌడ కోడలు, తనను గెలిపించాలి అని ప్రచారం చేస్తున్నారు. సుమలతను హుచ్చేగౌడ కోడలుగా ఎలా ఊహిస్తామని ఎంపీ శివరామేగౌడ ప్రశ్నించారు. భర్తను పెళ్లి చేసుకున్న తరువాత మహిళకు ఆయన ఇంటి పేరు వర్తిస్తుంది అనే కనీస జ్ఞానం శివరామేగౌడకు లేదా అని అంబరీష్ అభిమానులు, మండ్య మహిళలు మండిపడుతున్నారు.

మాజీ ప్రధాని, సీఎం మౌనం

మాజీ ప్రధాని, సీఎం మౌనం

మండ్య లోక్ సభ నియోజక వర్గం ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు జాతి రాజకీయాలు తెరమీదకు వచ్చాయి. సుమలతను కించపరిచే విదంగా బహిరంగంగా మాట్లాడిన ఎంపీ శివరామేగౌడ వ్యాఖ్యలను మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ఖండించలేదు. మండ్యలో ఇప్పుడు నీ కులం ఏది అంటూ పోటీ చేస్తున్న అభ్యర్థులను ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద సుమలత ఆంధ్రప్రదేశ్ మహిళ, ఆమె జాతి నాయుడు అంటూ మండ్యలో జేడీఎస్ నాయకులు ప్రచారం చేస్తూ విమర్శలపాలైనారు.

English summary
Loksabha elections 2019: Mandya JDS sitting MP Shivarame Gowda pulled independent candidate Sumalatha caste. He said, though she is married Gowda, she is not Gowdthi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X