• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లోక్‌సభ ఎన్నికలు 2019: ముగిసిన రెండో దశ పోలింగ్,95 నియోజకవర్గాల్లో ఎన్నికల పరిణామాల అప్‌డేట్స్

|

దేశవ్యాప్తంగా రెండో విడత పోలింగ్‌ ముగిసింది. మొత్తం 11 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 1611 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. అక్కడక్కడ చెదురు ముదురు ఘటనలు తప్ప మిగతా చోట్ల అంతా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. బెంగాల్‌లోని రాయ్‌గంజ్ నియోజకవర్గంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. కొందరు అల్లరి మూకలు పోలింగ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. మరోవైపు రాయ్‌గంజ్ సీపీఎం అభ్యర్థి వాహనాన్ని టీఎంసీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఇక ఇండిపెండెంట్ అభ్యర్థిగా మాండ్య నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న సుమలత అంబరీష్ వర్గీయులు జేడీఎస్ అభ్యర్థి నిఖిల్ గౌడ వర్గీయుల మధ్య వాగ్వాదం జరగడంతో పోలింగ్‌ కొంత సేపు నిలిచిపోయింది.

లోక్‌సభ ఎన్నికలు 2019:  ముగిసిన రెండో దశ పోలింగ్..ఈవీఎంలలో నిక్షిప్తమైన  అభ్యర్థుల భవితవ్యం

అస్సోం, బీహార్, చత్తీస్‌గఢ్, జమ్ముకశ్మీర్, కర్నాటక, మహారాష్ట్ర, మణిపూర్, ఒడిషా, పుదుచ్చేరి, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌లలో కొన్ని లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ ముగిసింది . ఇక తమిళనాడులోని 39 స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరిగింది. వేలూరులో ఎన్నిక రద్దుకాగా త్రిపుర తూర్పు స్థానం శాంత్రభద్రతల కారణంగా వాయిదా వేసింది ఎన్నికల సంఘం. అస్సోంలో 5 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. కరీంగంజ్, సిల్చార్, అటానమస్ డిస్ట్రిక్ట్, మంగళడోయ్,నవగాంగ్ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇక బీహార్‌లో ఐదు స్థానాలకు పోలింగ్ జరిగింది. (కృష్ణగంజ్, కతిహార్, పూర్ణియా, భగల్‌పూర్, బంకా), మావోయిస్టు ప్రభావిత రాష్ట్రం చత్తీస్‌ఘడ్‌‌లో 3 స్థానాలు(రాజ్‌నంద్ గావ్, మహాసముంద్, కంకేర్)లకు పోలింగ్ ముగిసింది. మరో సున్నితమైన రాష్ట్రం జమ్ముకశ్మీర్‌లో రెండు స్థానాలు శ్రీనగర్, ఉదంపూర్ పార్లమెంటరీ స్థానాలకు పోలింగ్ పూర్తయ్యింది.

Newest First Oldest First
8:17 PM, 18 Apr
పశ్చిమ బెంగాల్
సాయంత్రం 5 గంటల వరకు అయిన పోలింగ్ శాతం : 76.07%
8:16 PM, 18 Apr
కర్ణాటక
సాయంత్రం 5 గంటల వరకు అయిన పోలింగ్ శాతం : 64.84%
8:15 PM, 18 Apr
బీహార్
సాయంత్రం 5 గంటల వరకు అయిన పోలింగ్ శాతం : 58.14%
8:14 PM, 18 Apr
అస్సాం
సాయంత్రం 5 గంటల వరకు అయిన పోలింగ్ శాతం : 73.32%
8:13 PM, 18 Apr
పుదుచ్చేరి
సాయంత్రం 5 గంటల వరకు అయిన పోలింగ్ శాతం : 78.00%
8:12 PM, 18 Apr
మణిపూర్
సాయంత్రం 5 గంటల వరకు అయిన పోలింగ్ శాతం : 74.69%
8:12 PM, 18 Apr
ఛత్తీస్‌గఢ్
సాయంత్రం 5 గంటల వరకు అయిన పోలింగ్ శాతం : 71.00%
8:11 PM, 18 Apr
మహాష్ట్ర
సాయంత్రం 5 గంటల వరకు అయిన పోలింగ్ శాతం : 55.37%
8:10 PM, 18 Apr
జమ్మూ అండ్ కాశ్మీర్
సాయంత్రం 5 గంటల వరకు అయిన పోలింగ్ శాతం : 43.37%
8:05 PM, 18 Apr
తమిళనాడు
సాయంత్రం 5 గంటల వరకు అయిన పోలింగ్ శాతం 63.16%
7:51 PM, 18 Apr
రెండో దశ పోలింగ్ ముగిసినట్టు ప్రకటించిన సెంట్రల్ ఈసీ
7:50 PM, 18 Apr
జైలు సంఘటనలు గుర్తుచేసుకుని కన్నీరు పెట్టిన సాద్వి ప్రగ్యా
6:12 PM, 18 Apr
ముగిసిన రెండో దశ పోలింగ్..ఈవీఎంలలో నిక్షిప్తమైన 1611 మంది అభ్యర్థుల భవితవ్యం
5:17 PM, 18 Apr
కర్నాటక
కర్నాటకలో ఓటు హక్కు వినియోగించుకున్న 107 ఏళ్ల పద్మా అవార్డు గ్రహీత సాలుమరద తిమ్మక్క
4:39 PM, 18 Apr
ఆయారాష్ట్రాల్లో 3 గంటలకు పోలింగ్ శాతం
యూపీ:50.39% కర్నాటక: 49% తమిళనాడు:47.57% బెంగాల్: 60%
4:34 PM, 18 Apr
ఉత్తర్ ప్రదేశ్
అజాంగఢ్ పార్లమెంటు స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్
4:33 PM, 18 Apr
కర్నాటక
కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రయాణించిన హెలికాఫ్టర్‌లో తనిఖీలు నిర్వహించిన ఎన్నికల సంఘం అధికారులు
4:31 PM, 18 Apr
చత్తీస్‌గఢ్
రాజ్‌నందన్‌గావ్ పార్లమెంటు పరిధిలో ఓటు హక్కు వినియోగించుకున్న చత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్
4:29 PM, 18 Apr
పశ్చిమ బెంగాల్
డండం ప్రాంతంలో ప్రచారం నిర్వహించిన మరో బంగ్లాదేశీ నటుడు గాజీ అబ్దుల్ నూర్...వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలన్న కేంద్రహోంశాఖ వర్గాలు
3:15 PM, 18 Apr
పశ్చిమ బెంగాల్
గుంపును చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు
3:14 PM, 18 Apr
పశ్చిమ బెంగాల్
బెంగాల్‌లో కొనసాగుతూన్నహింసాత్మక సంఘటనలు: డార్జిలింగ్‌లో పెట్రోబాంబులు విసిరిన దుండగులు
2:50 PM, 18 Apr
ఉత్తర్ ప్రదేశ్
పోలింగ్ బూతులోకి పార్టీ గుర్తుతో వెళ్లిన బీజేపీ బులంద్ షహర్ సిట్టింగ్ ఎంపీ భోలా సింగ్..గృహ నిర్భంధం చేసిన ఎన్నికల సంఘం
2:47 PM, 18 Apr
కర్నాటక
మాండ్యలో స్వతంత్ర అభ్యర్థి సుమలత అంబరీష్ జేడీఎస్ అభ్యర్థి నిఖిల్ గౌడ వర్గీయుల మధ్య వాగ్వాదం..కాసేపు నిలిచిపోయిన పోలింగ్
1:47 PM, 18 Apr
ఉత్తర్ ప్రదేశ్
తమకు సరైన వ్యవసాయ సదుపాయాలు కల్పించలేదని పేర్కొంటూ పోలింగ్‌ను బహిష్కరించిన మంగోలికాలా గ్రామస్తులు.ఇప్పటి వరకు ఒక్క ఓటు కూడా పోల్ అవలేదని చెప్పని ఎన్నికల సిబ్బంది
1:41 PM, 18 Apr
ఢిల్లీ
బీజేపీ నేత ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు చేదు అనుభవం, మీడియా సమావేశంలో జీవీఎల్‌పై చెప్పులు విసిరిన విలేఖరి
12:42 PM, 18 Apr
పశ్చిమ బెంగాల్
రాయిగంజ్ సీపీఎం అభ్యర్థి మొహ్మద్ సలీం వాహనంను ధ్వంసం చేసిన ప్రత్యర్థులు.టీఎంసీ కార్యకర్తలే తన వాహనంను ధ్వంసం చేశారని ఆరోపించిన సలీం
12:40 PM, 18 Apr
ఉత్తర్ ప్రదేశ్
సుల్తాన్ పూర్ లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ నాయకురాలు మేనకా గాంధీ
12:35 PM, 18 Apr
కర్నాటక
మైసూరులో ఓటు హక్కు వినియోగించుకున్న కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆయన కుమారుడు యతీంద్ర
11:58 AM, 18 Apr
ఉత్తర్ ప్రదేశ్
లక్నో పార్లమెంట్ స్థానానికి సమాజ్‌వాదీ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేసిన శత్రుఘ్నసింహ భార్య పూనం సింగ్. రాజ్‌నాథ్ సింగ్ పై పోటీ చేయనున్న పూనం సింగ్
11:49 AM, 18 Apr
జమ్ముకశ్మీర్
శ్రీనగర్ లోక్‌సభ నియోజకవర్గంలోని మున్షిబాగ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ఎన్సీ అధినేత ఫరూక్ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా
READ MORE

English summary
In the second phase of polling in the ongoing Lok Sabha election 2019, 12 states and Union Territories (UTs) will witness voting on 18 April. Candidates in 95 parliamentary constituencies will be in the fray in the second phase.Tamil nadu's Vellore constituency polling got canelled while Tripura East election got postponed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X