వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోక్‌సభ ఎన్నికలు 2019 : మూడో విడత పోలింగ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు అప్ డేట్స్

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశంలో మూడో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు క్యూలైన్లలో నిల్చున్నారు. తొలి రెండు దశల్లో ఇప్పటికే 70శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. ఇక మంగళవారం జరగనున్న మూడో దశ పోలింగ్‌లో మొత్తం 13 రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 116 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మూడో దశ ఎన్నికల్లో మొత్తం 1600 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

ఇదిలా ఉంటే ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో మొత్తం 26 సీట్లకు ఒకేసారి ఎన్నిక జరగనుంది. కేరళలోని మొత్తం 20 సీట్లకు కూడా మూడో దశలోనే ఎన్నిక జరగనుంది. అయితే కేరళ నుంచి బీజేపీకి ఒక్క ఎంపీ సీటు కూడా రాని నేపథ్యంలో ఈ సారి అక్కడ ఖాతా తెరుస్తుందనే విశ్వాసం కమలనాథులు వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి గుజరాత్‌లో గాంధీనగర్ నుంచి ఆరుసార్లు గెలిచిన ఎల్‌కే అద్వానీకి కాకుండా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీజే చావడా అమిత్ షాకు ప్రత్యర్థిగా పోటీలో ఉన్నారు.

Loksabha elections 2019: Third phase election live updates

కేరళలో వాయనాడ్ స్థానం నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ బరిలో ఉన్నారు.ఇక్కడ బీజేపీ మిత్రపక్షం భారత్ ధర్మ జనసేన పార్టీ నుంచి తుషార్ వేలపల్లి పోటీలో ఉన్నారు. ఎర్నాకులం నుంచి శశిథరూర్ పోటీ చేస్తున్నారు. ఇక జమ్ము కశ్మీర్ లో అనంతనాగ్ నుంచి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ పోటీలో ఉన్నారు. ఉత్తర్ ప్రదేశ్‌‌లో సమాజ్ వాదీ పార్టీ నుంచి ములాయం సింగ్ పోటీచేస్తున్నారు. రాంపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా జయప్రద నిలుస్తుండగా... ఆమె ప్రత్యర్థి సిట్టింగ్ ఎంపీ అజాంఖాన్ బరిలో ఉంటారు.

Newest First Oldest First
6:41 PM, 23 Apr

ఢిల్లీ

నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి, సింగర్ హన్స్ రాజ్ సింగ్
6:39 PM, 23 Apr

ఢిల్లీ

ప్రధాని మోదీ ఎన్నికల నిబంధనలను యధేచ్చగా ఉల్లంఘించారని సీఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ బృందం
6:38 PM, 23 Apr

అసోం

అసోంలో ఓటింగ్ ముగియడంతో ఈవీఎం, వీవీ ప్యాట్లకు సీల్ వేస్తున్న దృశ్యం
6:10 PM, 23 Apr

కోల్ కతా

పశ్చిమ బెంగాల్ 78.94 శాతం పోలింగ్ నమోదు
6:09 PM, 23 Apr

లక్నో

ఉత్తర ప్రదేశ్ 56.36 శాతం పోలింగ్
6:09 PM, 23 Apr

త్రిపుర

త్రిపుర 71.13 శాతం పోలింగ్
6:09 PM, 23 Apr

భువనేశ్వర్

ఒడిశా 57.84 శాతం పోలింగ్
6:08 PM, 23 Apr

ముంబై

మహారాష్ట్ర 55.05 శాతం పోలింగ్ నమోదు
6:08 PM, 23 Apr

తిరువనంతపురం

కేరళ 68.62 శాతం పోలింగ్ నమోదు
6:08 PM, 23 Apr

బెంగళూరు

కర్ణాటక 60.87 శాతం పోలింగ్ నమోదు
6:07 PM, 23 Apr

శ్రీనగర్

జమ్ము కశ్మీర్ 12.46 అత్యల్ప పోలింగ్ నమోదైంది
6:07 PM, 23 Apr

గాంధీనగర్

గుజరాత్ 58.81 శాతం పోలింగ్
6:06 PM, 23 Apr

పనాజీ

గోవా 70.96 శాతం పోలింగ్
6:06 PM, 23 Apr

డామన్ డయ్యు

డామన్ డయ్యు 65.34 శాతం పోలింగ్
6:06 PM, 23 Apr

దాద్రా నగర్ హవెలి

దాద్రా నగర్ హవెలి 71.43 శాతం పోలింగ్
6:05 PM, 23 Apr

పంజాబ్

ఛత్తీస్‌ఘడ్ 64.03 శాతం పోలింగ్
6:04 PM, 23 Apr

బీహార్

బీహార్ లో బీహార్ 54.95 శాతం పోలింగ్ నమోదైంది
6:03 PM, 23 Apr

అసోం

రాష్ట్రాలవారీగా చూస్తే అసోం 74.05 శాతం పోలింగ్
6:02 PM, 23 Apr

13 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 116 నియోజకవర్గాలకు ముగిసిన పోలింగ్, 61.31 శాతం పోలింగ్ జరిగినట్టు ప్రకటించిన ఈసీ
5:56 PM, 23 Apr

తూర్పు ఢిల్లీ నుంచి నామినేషన్ దాఖలు చేసిన గౌతం గంభీర్
5:56 PM, 23 Apr

న్యూఢిల్లీ

మూడో విడత పోలింగ్ 61.31 ఓటింగ్ నమోదైనట్టు ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం
5:42 PM, 23 Apr

ఒడిశా

ఒడిశా : కేంద్రపారలో ఓటుహక్కు వినియోగించుకున్న బీజేపీ అభ్యర్థి బై జయంత్ జే పాండా
5:40 PM, 23 Apr

హుబ్లీలో ఓటు వేస్తున్న బీజేపీ నేత, కర్ణాటక మాజీ సీఎం జగదీశ్ షెట్టర్
5:38 PM, 23 Apr

ఫిలిబిత్ పోలింగ్ బూత్ పరిశీలించి మద్దతుదారులతో సెల్ఫీ దిగుతోన్న వరుణ్ గాంధీ
4:50 PM, 23 Apr

మధ్యప్రదేశ్

సాధ్వీ ప్రగ్యాకు నల్లజెండాలు చూపినందుకు ఎన్సీపీ కార్యకర్తలను చితకబాదిన బీజేపీ కార్యకర్తలు
4:45 PM, 23 Apr

సాయంత్రం 4 గంటల సమయానికి నమోదైన పోలింగ్

మహారాష్ట్ర : 44.64%, ఒడిషా : 46.44 %, త్రిపురా: 65.92 %, ఉత్తర్ ప్రదేశ్ 47.41 %, పశ్చిమ బెంగాల్ : 68.25, చత్తీస్‌గడ్: 55.29%, దాద్రా నగర్ హవేలి : 56.81% , డామన్ డయూ : 56.21 %
4:42 PM, 23 Apr

సాయంత్రం 4 గంటలకు నమోదైన పోలింగ్ శాతం

అస్సోం: 62.13 %, బీహార్: 46.94%, గోవా : 58.92 %, గుజరాత్ : 50.32%, జమ్ముకశ్మీర్: 11.22% , కర్నాటక: 50.03% , కేరళ : 55.55%
4:32 PM, 23 Apr

గుజరాత్

బరూచ్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్
4:31 PM, 23 Apr

మహారాష్ట్ర

తన పెళ్లికి కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో ఓటు హక్కు వినియోగించుకున్న శ్రద్ధ అనే కొత్త పెళ్లి కూతురు. ఓటు వేయడంతో ప్రథమ కర్తవ్యం అని చెప్పారు శ్రద్ద
3:36 PM, 23 Apr

జమ్ముకశ్మీర్

అనంతనాగ్ జిల్లా బిబేహారలో ఓటు హక్కు వినియోగించుకున్న జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ
READ MORE

English summary
The Election Commission said nearly 70 percent voter turnout was recorded in each of the two phases of the ongoing Lok Sabha polls. In the third phase on Tuesday, voters from 11 states and two Union Territories will cast ballots across 115 seats—the maximum number of Parliamentary constituencies going to vote—to choose from more than 1,600 candidates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X