వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోక్ సభలో 10 మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్- స్పీకర్ పై పేపర్లు విసిరినందుకు చర్యలు

|
Google Oneindia TeluguNews

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో విపక్షాల నిరసనలు కొనసాగుతున్నాయి. వరుసగా ఏడో రోజు పార్లమెంటు ఉభయసభల్ని విపక్షాలు అడ్డుకున్నాయి. లోక్ సభ కార్యకలాపాల్ని అడ్డుకున్న పది మంది కాంగ్రెస్ ఎంపీలపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.

లోక్ సభలో స్పీకర్ పై పేపర్లు విసిరేసి నిరసన తెలియజేసిన కాంగ్రెస్ ఎంపీలపై స్పీకర్ ఓం బిర్లా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ సూచన మేరకు వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇలా వేటు పడిన వారిలో కాంగ్రెస్ ఎంపీలు మానికం టాగూర్, డీన్ కురియాకోస్, హిబీ ఎడెన్, ఎస్.జ్యోయిమణి, రవనీత్ బిట్టూ, గుర్ జీత్ ఔజిలా, టీఎన్ ప్రతాపన్, వీ వైద్యలింగం, సప్తగిరి శంకర్, ఏఎం ఆరిఫ్, దీపక్ బైజ్ ఉన్నారు. వీరందరిపై రూల్ 374 (2) కింద వేటు వేశారు.

loksabha speaker suspends 10 congress mps for throwing papers at him

Recommended Video

Pakisthani Inside Minister Rowing A Ship To ‘nowhere’ Has Set Off A Wave Of Memes

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తనపై కాంగ్రెస్ ఎంపీలు పేపర్లు విసరడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో తరచూ నిరసనలకు దిగుతున్న వారిపై చర్యలు తీసుకోవడం మినహా మరో మార్గం లేదని ఓం బిర్లా తెలిపారు. దీంతో కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటును వారు ఖరారు చేశారు. వీరిపై లోక్ సభ గడువు ముగిసేవరకూ సస్పెన్షన్ వేటు వేసే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

English summary
loksabha speaker om birla suspends 10 congress mps for disrupting house proceedings today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X