London love: మాట్రిమోని ఎఫెక్ట్, మిల్క్ ట్యాంకర్ లా ఉంది, అబ్బా అనుకుంటే, రూ. 5 లక్షలు బొక్క!
బెంగళూరు/ హుబ్బళి/ లండన్: పెళ్లి చేసుకోవాలని ఆ యువకుడు ఉర్రూతలు ఊగుతున్నాడు. భారతదేశంలో పిల్లను చేసుకుంటే కట్నం తక్కువ వస్తుంది ? అని అనుకున్నాడో ఏమో విదేశాల్లో ఉన్న యువతిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. మాట్రిమోని వెబ్ సైట్ లో పరిచయం అయిన అమ్మాయి మీద మనసు పారేసుకున్నాడు. తాను లండన్ లో ఉన్నానని, భారత్ వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఆ యువతి ప్రతిరోజు గంటలు గంటలు మనోడితో చాటింగ్ చెయ్యడంతో కుర్రాడు గాల్లో తేలిపోయాడు. అంతే లండన్ నుంచి నీకు లక్షల రూపాయల విలువైన బహుమతి పంపిస్తున్నానని ఆమె చెప్పింది. లండన్ నుంచి అతని మిల్క్ ట్యాంకర్ పంపించే గిఫ్ట్ తీసుకోవడానికి మనోడు లక్షల రూపాయలు తగలేశాడు. తీరా ఏం జరిగిందో తెలుసుకున్న పోలీసులు లండన్ లడ్డూ కోసం ఆశపడిన కుర్రాడిని చూసి జాలిపడుతున్నారు.
Video viral: 150 మందిలో రేప్ సీన్, ఎడిటింగ్ లో ఎగిరింది, నెట్ లో ఫర్ సేల్, నటి ఆత్మహత్యాయత్నం !

పెళ్లి చేసుకోవాలని ఆశ
కర్ణాటకలోని హుబ్బళి- దారవాడ ట్విన్ సిటీలో ప్రమోద్ కులకర్ణి అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొంతకాలం నుంచి ప్రమోద్ పెళ్లి చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంటర్నెట్ ఫ్రీ అంటూ మాట్రిమోని వెబ్ సైట్లలో అమ్మాయిల కోసం వేట ప్రారంభించాడు. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోవాలని కలలుకన్నాడు.

కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి
ప్రమోద్ తాను లోకల్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కట్నకానుకలు తక్కువగా వస్తాయి అనుకున్నాడో ఏమో విదేశాల్లో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని గత ఏడాది నుంచి ప్రయత్నాలు చేస్తున్నాడు. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అంటూ ప్రమోద్ మాట్రిమోని వెబ్ సైట్లలో అమ్మాయిల కోసం తెగ వెతికేశాడు. ఇదే సమయంలో గ్రహాలు అనుకూలించకపోవడంతో ఓ అమ్మాయి ప్రమోద్ కు పరిచయం అయ్యింది.

లండన్ మిల్క్ ట్యాంకర్
తాను లండన్ లో ఉన్నాను, నీ ఫోటోలు చూశాను, నువ్వునాకు నచ్చావ్ అంటూ ఓ అమ్మాయి ప్రమోద్ కు మాయమాటలు చెప్పింది. ఇదే సమయంలో లక్కీగా తనకు లండన్ అమ్మాయి చిక్కిందని ప్రమోద్ మురిసిపోయాడు. ఓ సందర్బంలో లండన్ అమ్మాయి లావుగా, బొద్దుగా, బుట్టబొమ్మలాగా ఉన్న కొన్ని ఫోటోలను ప్రమోద్ కు పంపించింది. అబ్బా నాకు లండన్ మిల్క్ ట్యాంకర్ చిక్కింది అంటూ ప్రమోద్ ఎగిరి గంతేశాడు.

గిఫ్ట్ అదిరిపోతుంది డార్లింగ్
కొంతకాలం నుంచి ప్రమోద్, లండన్ యువతి సోషల్ మీడియాలో గంటలు గంటలు చాటింగ్ చేసుకుంటూ, ఫోన్లలో మాట్లాడుకుంటూ కాలం గడిపేశారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయారు. ఓ రోజు తాను లండన్ నుంచి ఖరీదైన అదిరిపోయే గిఫ్ట్ పంపిస్తున్నానని, నువ్వు దానిని జాగ్రతగా దాచుకోవాలని, పెళ్లికి ముందు తాను ఇచ్చే బహుమతి ఇదే అంటూ లండన్ అమ్మాయి ప్రమోద్ కు చెప్పింది.

సార్ మీ గిఫ్ట్ తీసుకోండి
ఓ రోజు ఓ వ్యక్తి ప్రమోద్ కు ఫోన్ చేశాడు. సార్ మీకు లండన్ నుంచి ఓ పార్శిల్ వచ్చింది. ఆ పార్శిల్ మీరు తీసుకోవాలంటే ట్యాక్స్ చెల్లించాలి అని చెప్పాడు. ప్రియురాలు పంపించిన గిఫ్ట్ ఎలాగైనా తీసుకోవాలని భావించిన ప్రమోద్ ఆ వ్యక్తి చెప్పిన బ్యాంక్ అకౌంట్ లకు విడతలు విడతలుగా నాలుగు సార్లు ఆన్ లైన్ ద్వారా రూ. 5, 15, 549 జమ చేశాడు.

ఓరి పిచ్చోడా...... లండన్ నుంచి నీకు ?
తాను రూ. 5 లక్షలకు పైగా డబ్బులు జమ చేసినా ఇంత వరకు లండన్ గిఫ్ట్ రాలేదని, అసలు ఏం జరిగింది ? అంటూ ప్రమోద్ కు అనుమానం మొదలైయ్యింది. డబ్బులు చెల్లించి ఎన్ని రోజులైనా గిఫ్ట్ రాకపోవడంతో మోసం జరిగిందని ఆలస్యంగా గుర్తించిన ప్రమోద్ హుబ్బళి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఓరి పిచ్చోడా... కరోనా కాలంలో నీకు ఎన్ని కష్టాలు వచ్చాయిరా ? అంటూ ప్రమోద్ మీద జాలి చూపించిన పోలీసులు లండన్ అమ్మాయి ఆచూకి కోసం ఆరా తీస్తున్నారు. మొత్తం మీద లండన్ నుంచి మిల్క్ ట్యాంకర్ వస్తుందని ఊహించిన ప్రమోద్ కు రూ. 5 లక్షలు బోక్క పడటమే కాకుండా కనీసం పాల ప్యాకెట్ కూడా రాలేదని తెలుసుకున్న ప్రజలు నవ్వుకుంటున్నారు.