వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వదళ బొమ్మాళీ .. కన్నంలో దాక్కున్నా పట్టేస్తాం .. ఫ్రాడ్ చేసిన సొమ్ము కక్కాల్సిందే

|
Google Oneindia TeluguNews

లండన్ : లండన్ వీధుల్లో దర్జాగా తిరుగుతున్న నీరవ్ మోదీని వెలుగులోకి తీసుకొచ్చింది అక్కడి మీడియా. మీసం పెంచి, మాసిన గడ్డం, జుట్టు పెంచుకొని నీడలా వెంటాడింది. జాకెట్ వేసుకొని తనను ఎవరూ గుర్తుపట్టారనుకొని వీధుల్లో విహరిస్తున్నాడు. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగి .. తనను ఎవరూ చూడలేదని అనుకుంటోంది. అచ్చం నీరవ్ కూడా అలానే వ్యవహరించాడు. పంజాబ్ నేషనల్ బ్యాంకు కన్షార్షియం నుంచి 13 వేల కోట్ల లోన్ తీసుకొని దొడ్డిదారిన పారిపోయాడు. లండన్ లో విలాసవంతమైన భవనంలో కూనుకుతీస్తు తనను ఎవరూ చూడలేదనుకుంటున్నాడు.

వదళ బొమ్మాళీ ..

వదళ బొమ్మాళీ ..

లండన్ చట్టాలు నీరవ్ మోదీని కాపాడిన అక్కడి మీడియా మాత్రం ప్రశ్నల వర్షం కురిపించింది.. ఎంత చురుగ్గా ఉంటుందో నీరవ్ వెలుగులోకి తీసుకొచ్చిన ఘటనే సజీవ సాక్ష్యం. వీధుల్లో తిరుగుతున్న నీరవ్ ను .. రిపోర్టర్ పసిగట్టాడు. భారత్ లో బ్యాంకులకు టోకరా పెట్టి వచ్చాడని .. ఇంటర్వ్యూ చేసేందుకు ప్రయత్నం చేశాడు. ఫొటోలు తీసి, వీడియో తీసి నీరవ్ బండారాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. ఓ ఆర్థిక నేరస్తుడిని నడిరోడ్డు మీద ప్రశ్నల వర్షం కురిపించడంతో నీరవ్ మోదీ నీళ్లు నములాల్సిన పరిస్థితి వచ్చింది.

ఎప్పుడెళ్తావ్ .. నో కామెంట్స్ ..

ఎప్పుడెళ్తావ్ .. నో కామెంట్స్ ..

నీరవ్ ను గుర్తించిన రిపోర్టర్ .. భారత్ తిరిగి ఎప్పుడెళ్తావని ప్రశ్నించాడు. అందుకు నో కామెంట్ అని బదులిచ్చాడు. చిరునవ్వి వెళ్లేందుకు ప్రయత్నించగా .. రుణం ఎంత తీసుకున్నావ్, ఏం చేశావ్ .. ఎప్పుడు రుణం చెల్లిస్తావు. కోర్టులను అడ్డుపెట్టుకుని ఇక్కడ తలదాచుకుంటున్నావా .. అని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశాడు. ప్రతి ప్రశ్నకు నో కామెంట్ అని చెప్పి తన తెలివిని చూపించాడు నీరవ్ మోదీ. తర్వాత చిరునవ్వి .. అక్కడినుంచి మెల్లగా జారుకున్నాడు.

నీరవ్ మోదీ జాకెట్ ఖరీదు ఎంతో తెలుసా ? అక్షరాల 9 లక్షలునీరవ్ మోదీ జాకెట్ ఖరీదు ఎంతో తెలుసా ? అక్షరాల 9 లక్షలు

రిపోర్టర్ కు ప్రశంసలు

లండన్ రిపోర్టర్ ను నెటిజన్లు కొనియాడుతున్నారు. తమ దేశంలోని బ్యాంకుల నుంచి వేల కోట్లు తీసుకొని .. పారిపోయిన ఆర్థిక నేరస్థుడిని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సోదరా హ్యాట్సాప్ అంటున్నారు. జర్నలిజం అంటే ఏదో బ్రేకింగ్ చేసం కాకుండా .. ఆర్థిక నేరస్తుడి కొత్త వేషాన్ని ప్రపంచానికి చూపావని కొనియాడుతున్నారు. ఈ ఇంటర్వ్యూ చేసే సమయంలో మీరు చూపిన తెగువ, ధైర్య సాహసాలు ఇతర ప్రతినిధులకు ఆదర్శనీయమని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

అక్కడ ఓకే .. మరి ఇక్కడో ...

అక్కడ ఓకే .. మరి ఇక్కడో ...

లండన్ గల్లీలో నీరవ్ మోదీని అక్కడి రిపోర్టర్ తన ప్రశ్నలతో ఊతికి ఆరేశాడు. అసలే లండన్ .. దేశం కానీ దేశానికి వచ్చి తలదాచుకున్న నీరవ్ .. కిక్కురుమనకుండా మిన్నకుండి .. చిరునవ్వునే సమాధానంగా భావించాలని చెప్పి తుర్రుమన్నాడు. మరి మన మీడియా ప్రతినిధుల విధుల నిర్వహణ ఎలా ఉంటుందనే చర్చ కూడా సోషల్ మీడియాలో సాగుతోంది. బ్రేకింగ్ కోసం లేనిది ఉన్నట్టుగా .. ఉన్నది లేనట్టుగా చూపిస్తారని తప్పుపడుతున్నారు.

English summary
A reporter who identified Nirav, questioned when will go to India. He replied no comment. Trying to go to smile .. how much did you get out of debt, what to do .. when you pay a loan. Stressing the courts, he said that he is going to be here. Nirvay Modi has shown his intelligence that he is not aware of every question. Then the smile was shouting slowly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X