వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నవంబర్ నుండి కొత్త టైంటేబుల్: రైళ్ళ స్పీడ్‌ పెంపు

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రైల్వేశాఖ రైళ్ళ రాకపోకల టైమ్ టేబుళ్ళను మార్చనుంది. నవంబర్ నుండి కొత్త టైమ్ టేబుల్ ప్రకారం రైళ్ళు నడిపేలా రైల్వే శాఖ చర్యలను తీసుకోనుంది.సుమారు 500 రైళ్ళ టైమ్ టేబుళ్ళను మార్చనున్నారు. అంతేకాదు రైళ్ళ స్పీడ్‌ను పెంచనున్నారు.

నవంబర్ నుండి కొత్త టైమ్ టేబుళ్ళ ఆధారంగా రైళ్ళు నడవనున్నట్టు రైల్వే శాఖాధికారులు ప్రకటించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ నుండి ఈ నెల ఆరంభంలో వచ్చిన సూచన మేరకు రైల్వేశాఖ కొత్త టైమ్ టేబుల్ తయారు చేయనుంది.

Long distance trains to run quicker from next month

15 నిమిషాల నుండి రెండు గంటల వరకు ప్రముఖ రైళ్ళ సమయం తగ్గే అవకాశం ఉందని రైల్వే శాఖాధికారులు ప్రకటించారు.ప్రతి రైల్వే డివిజన్‌కు రెండు నుండి నాలుగు గంటలపాటు నిర్వహణ కోసం కేటాయించనున్నారు.

అంతేకాదు ప్రస్తుతం ఉన్న నడుస్తున్న రైళ్ళు తమ గమ్యస్థానాలను గతంలో కంటే ఇంకా తక్కువ సమయంలోనే నడిచేలా రైల్వేశాఖ ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు 50 మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళను సూపర్‌ఫాస్ట్ రైళ్ళుగా మార్చనున్నారు.

ప్రస్తుతం నడుస్తున్న రైళ్ళ స్పీడ్‌ను పెంచడం ద్వారా నిర్ణీత గమ్యస్థానాలకు తక్కువ సమయంలోనే చేరుకొనేలా రైల్వేశాఖ ప్లాన్ చేస్తోంది.బోపాల్-జోథ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు 95 నిమిషాల ముందే గమ్యస్థానాన్ని చేరుకోనుంది. అంతేకాదు గౌహతి-ఇండోర్ స్పెషల్ ట్రైన్ 2,330 కి.మీ దూరాన్ని 115 నిమిషాల ముందే గమ్యస్థానానికి చేరుకొంది.

1929 కిమలో దూరాన్ని ఘాజీపూర్-బాంద్రా టెర్మినస్ ఎక్స్‌ప్రెస్ రైలు 95 నిమిషాల ముందే తన గమ్యస్థానానికి చేరుకోనుంది.రైల్వే శాఖ ట్రాక్, మౌళికవసతులను అప్‌గ్రేడ్ చేయనున్నారు. అంతేకాదు ఆటోమెటిక్ సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. స్పీడ్ పరిమితులపై రైల్వే శాఖ సమీక్షించనుంది.

English summary
The Indian Railways will soon cut short the running time of over 500 long distance trains by up to two hours, a senior railway official said today.The new timings will be updated in the November timetable of the railways, he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X