• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

‘‘అచ్చం కాజోల్ లా.., అందుకే ప్రపోజ్ చేశా, ముందు కాదన్నా ఆ తర్వాత...’’

By Ramesh Babu
|

నాగ్‌పూర్: ఆ అమ్మాయి అతనికి అచ్చం కాజోల్ లా అనిపించింది. దీంతో ముందడుగువేసి, ఆమెకు ప్రపోజ్ చేశారు. మొదట్లో ఆమె తిరస్కరించారు. తరువాత సమ్మతి తెలపడంతో వారి వివాహం వైభవంగా జరిగింది. ఇది మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రేమకథ.

ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన తన ప్రేమకథను ముచ్చటించారు. తన భార్య అచ్చం బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ లా ఉంటుందని చెప్పారు.

చూడగానే ఇష్టపడ్డా...

చూడగానే ఇష్టపడ్డా...

బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ లా అనిపించిన అమృతను తాను చూడగానే ఇష్టపడినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పేర్కొన్నారు. నాగపూర్‌కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ చారూ రనాడె, డాక్టర్ శరత్ రనాడేల కుమార్తె అమృత రనాడే. దేవేంద్ర... అమృతను వారింట్లోనే కలుసుకున్నారు.

    Kajal Aggarwal Celebrates Her Birthday With Her 50th Film
    నేరుగా ప్రపోజ్ చేశా...

    నేరుగా ప్రపోజ్ చేశా...

    దేవేంద్రకు... బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ అంటే అమితమైన అభిమానం. దీంతో ఆయన తొలిసారిగా అమృతను కలుసుకున్నప్పుడు ‘నువ్వు నాకు అచ్చం కాజోల్ లా కనిపిస్తున్నావు. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను‘ అని నేరుగా ప్రపోజ్ చేశారు.

    మొదట్లో తిరస్కరించినా...

    మొదట్లో తిరస్కరించినా...

    మొదట్లో అమృత తన ప్రేమను తిరస్కరించినా, తరువాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ చెప్పారు. ఫలితంగా తమ వివాహం జరిగిందని అన్నారు. ఫడ్నవీస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాగపూర్‌లో వారి వివాహం జరిగింది. అమృతా ఫడ్నవీస్ క్లాసికల్ సింగర్. అంతేకాదు, యాక్సిస్ బ్యాంక్‌లో ఉన్నతోద్యోగి కూడా.

    అత్యంత వైభవంగా వివాహం...

    అత్యంత వైభవంగా వివాహం...

    దేవేంద్ర ఫడ్నవిస్, అమృతల వివాహం నాగపూర్‌లోని బొటానికల్ గార్డెన్‌లో అత్యంత వైభవంగా జరిగింది. అతిరథ మహారథులందరూ వీరి వివాహానికి హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. వారికి ప్రస్తుతం దేవిజ అనే కుమార్తె ఉంది. తన భర్త దేవేంద్ర ఫడ్నవీస్ రాజకీయంగా ఎదిగేందుకు అమృత ఎంతగానో దోహదపడ్డారు.

    English summary
    Maharashtra CM Devendra Fadnavis revealed his love story in an recent interview. He love Amruta Ranade and married her when he was a MLA. Later he became Chief Minister of Maharashtra. He told when he first saw her.. she looks like Bollywood Heronie Kagal for his eyes. So he liked her very much and went directly to her to propose. He told, First she refused and later she agreed to marry me. Now we have a daughter named Devija.. He added.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X