వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివాదం: స్వామి నారాయణుడికి ఆర్ఎస్ఎస్ యూనిఫాం!

|
Google Oneindia TeluguNews

సూరత్‌: గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్ పట్టణంలో కొలువైన ప్రసిద్ధ స్వామి నారాయణ్ దేవాలయం ఇప్పుడు దేశంలో ప్రముఖ వార్తాంశంగా మారిపోయింది. ఆ దేవాలయంలోని స్వామినారాయణ్‌ విగ్రహానికి ఏకంగా ఆర్‌ఎస్‌ఎస్‌(రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌) యూనిఫాం వేయడం ఇందుకు కారణంగా మారింది.

ఆలయంలోని స్వామినారాయణ్‌ విగ్రహానికి ఖాకీ నెక్కరు వేసి, దానిపై తెలుపు రంగు చొక్కా.. తలకి నల్లని క్యాప్‌.. నల్ల బూట్లు వేసి ఉంచారు. అంతేకాకుండా ఈ విగ్రహం ఒక చేతిలో జాతీయ జెండా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో పలువురు విమర్శలు చేస్తున్నారు.

దీనిపై ఆలయ నిర్వహణాధికారి మాట్లాడుతూ.. కొన్ని రోజుల క్రితం ఓ భక్తుడు ఈ దుస్తులను ఆలయానికి కానుకగా సమర్పించారని తెలిపారు. దేవుడ్ని వివిధ రూపాల్లో అలంకరించడం సాధారణమేనని, అందులో భాగంగానే ఆర్‌ఎస్‌ఎస్‌ యూనిఫాంను వేశామని, ఇందులో ఎటువంటి ఎజెండా లేదని ఆయన స్పష్టం చేశారు.

Lord Swaminarayan idol dressed in RSS uniform in Gujrat sparks row

ఇది వివాదాస్పదంగా మారుతుందన్న ఆలోచన తమకు రాలేదని ఆలయ నిర్వాహకుడు విశ్వప్రకాశ్‌జీ వెల్లడించారు. దీనిపై సీనియర్‌ కాంగ్రెస్‌ నేత శంకర్‌ సింహ్‌ వాఘేలా తీవ్రంగా విరుచుకుపడ్డారు. దేవుడి విగ్రహానికి ఖాకీ నిక్కరు వేసి ఏం నిరూపించాలనుకుంటున్నారు? ప్రశ్నించారు.

ఈరోజు దేవుడికి ఆర్‌ఎస్‌ఎస్‌ యూనిఫాం వేశారు.. రేపు బిజెపి యూనిఫాం వేస్తారా? అని మండిపడ్డారు. ఇది మంచి పద్ధతి కాదు అని అన్నారు. దీనిపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు విజయ్‌ రుపానీ మాట్లాడుతూ.. విషయం తెలిసి తానూ ఆశ్చర్యపోయానని, అలా జరిగివుండకూడదని అన్నారు. ఇలాంటి వాటిని తాను అంగీకరించనని చెప్పారు.

English summary
A controversy erupted on Tuesday after authorities of a Surat-based Swaminarayan temple dressed up the idol of Lord Swaminarayan in the RSS uniform.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X