వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదృష్టమంటే సంజీవన్‌దే: ఉద్యోగం పోయి డీల పడ్డ క్షణంలోనే.. మిలియన్ డాలర్లు గెలుచుకున్నాడు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అదృష్టవంతులనేవారు కొందరుంటారు. అందులో కేరళ రాష్ట్రానికి చెందిన నవనీత్ సంజీవన్ కూడా ఉన్నారు. దుబాయ్‌లో ఉంటున్న అతని ఉద్యోగం పోయింది. ఎట్ల బతకడంరా దేవుడా? అనుకుంటున్న తరుణంలోనే.. ఆయనకు ఏకంగా మిలియన్ డాలర్ల లక్కీ డ్రా తగిలింది. దీంతో ఆయన ఆనందోత్సాహాలకు అవధులు లేకుండా పోయాయి.

మీషా ఘోషల్ ట్రెడిషినల్ లుక్ ట్రెండింగ్.. అందంగా ముద్దు ముద్దుగా...

కేరళలోని కాసర్‌గొడ్‌కు చెందిన నవనీత్ సంజీవన్ ఉపాధి కోసం అబూదాబికి వెళ్లారు. గత నాలుగేళ్లుగా అబూదాబీలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నారు. కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా అతడు పనిచేస్తున్న కంపెనీ నవంబర్ నెలలో కొంత మంది ఉద్యోగులను తొలగించింది. వారిలో నవనీత్ కూడా ఉన్నారు.

Lost job due to Corona, Indian expat living in Abu Dhabi wins $ 1 million in Dubai raffle

ప్రస్తుతం నవనీత్ సంజీవన్ నోటీస్ పీరియడ్‌పై విధులు నిర్వహిస్తున్నాడు. అయితే, నవంబర్ 22న నవనీత్.. దుబాయ్ డ్యూటీ ప్రీ మిలీనియం మిలియనీర్ డ్రా కోసం ఆన్‌లైన్‌లో లాటరీ టికెట్ కొన్నాడు. గత ఆదివారం ఈ డ్రా తీశారు. ఈ డ్రాలో నవనీత్ విజేతగా నిలిచాడు. దీనిలో ఒక మిలియన్ డాలర్ల నగదు బహుమతి గెలుచుకున్నారు.

అంజు కురియన్ క్యూట్ గ్యాలరీ.. వైరల్ అవుతున్న లవ్లీ పిక్

ఇంత భారీ మొత్తంలో నగదు బహుమతి దక్కడంతో నవనీత్ సంజీవన్ ఆనందం వ్యక్తం చేశారు. తాను ఇంత భారీ నగదు వస్తుందని ఊహించలేదన్నారు. తన సంతోషాన్ని స్నేహితులు, తోటి ఉద్యోగులతో పంచుకోవాలనుకుంటున్నానని తెలిపాడు. నవనీత్ సంజీవన్‌కు భార్య, ఒక బాబు ఉన్నారు.

ప్రస్తుతం వచ్చిన డబ్బుతో తనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, కొంతమేర ఉన్న అప్పులను కూడా తీర్చేస్తానని చెప్పారు. తాను కొత్త ఉద్యోగం చూసుకుంటానని తెలిపారు.

English summary
Life after the novel coronavirus was looking bleak for Navaneeth Sajeevan, a 30-year-old Indian expat from Kerala. Employed in an Abu Dhabi-based company, Sajeevan was among those asked to leave due to a post-Covid financial crunch.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X