వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'అమృత్‌సర్' ట్రెండింగ్: భారీ శబ్ధాలు.. ఏం జరిగిందంటే?

|
Google Oneindia TeluguNews

అమృత్‌సర్: సోషల్ మీడియా 'అమృత్‍‌సర్' టాప్ ట్రెండ్స్‌లో కనిపించింది. అందుకు ఓ ప్రచారమే కారణం. అర్ధరాత్రి ఒకటి గంట ప్రాంతంలో అమృత్‌సర్‌లో ఆకాశంలో పెద్ద శబ్దం వినిపించిందని, ఒకసారి కాదు ఆ పెద్ద శబ్దం రెండుసార్లు వినిపించిందని, దీంతో నిద్రలో ఉన్న అమృత్‌సర్ జనాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారని తెలిసి.. అసలు ఏం జరిగిందా అని ఆరా తీస్తూ, ట్విట్టర్‌లో అమృత్‌సర్ హాష్‌టాగ్‌ను ట్రెండింగ్ చేశారు.

ఆ హాష్‌టాగ్‌తో ఆ పెద్ద శబ్దం ఏమిటి, ఎందుకు అంత అర్ధరాత్రి వినిపించింది, ఇది ఎవరి పని.. అని ప్రశ్నించడం ప్రారంభించారు. దీంతో శుక్రవారం ఉదయం అమృత్‌సర్ ట్విట్టర్ టాప్ ట్రెండింగ్‌లో కనిపించింది.

ఇది మిత్రులుగా మార్చే చాయ్!: పాకిస్తాన్‌లో టీ దుకాణం ముందు అభినందన్ ఫోటోతో బ్యానర్ఇది మిత్రులుగా మార్చే చాయ్!: పాకిస్తాన్‌లో టీ దుకాణం ముందు అభినందన్ ఫోటోతో బ్యానర్

Loud bangs heard in Amritsar, police say it was IAF jets at supersonic speed

కొందరు నెటిజన్ల అభిప్రాయం ప్రకారం ఆకాశంలో రెండు ఎయిర్ ఫోర్స్ జెట్స్ నుంచి సోనిక్ బూమ్స్ సౌండ్స్ వినిపించాయట. సోనిక్ బూమ్ అంటే సాధారణ స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్ వెళ్లినప్పుడు జెట్ నుంచి వచ్చే శబ్దం. అది వాటి శబ్దమేనని కొందరు ట్వీట్ చేశారు.

ఈ ఘటనపై అమృత్‌సర్ ఏడీసీపీ జగ్జిత్ సింగ్ వాలియా మాట్లాడుతూ... సోషల్ మీడియాలో వచ్చే ప్రచారం నమ్మవద్దని, అమృత్‌సర్‌కు ఎటువంటి హానీ లేదనిన్నారు. పుకార్లు వద్దన్నారు. సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (రూరల్) పరంపాల్ సింగ్ మాట్లాడుతూ... ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన సోనిక్ బూమ్ (జెట్ నుంచి వచ్చే శబ్దం) అని చెప్పారు.

English summary
Twitter was abuzz in the early hours of Friday after users in Amritsar said they heard "two loud sounds". #Amritsar was trending on the micro-blogging website, with users sharing theories what the sounds could be. The police have tried to calm the nerves of the local users, saying everything was okay in the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X