వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Love Jihad: ఫ్రెండ్ భార్యకు స్మార్ట్ ఫోన్ వల, ముస్లీం వ్యక్తి ఎలా అరెస్టు చేస్తారు ?, సాక్షం ఉందా, హైకోర్టు

|
Google Oneindia TeluguNews

లక్నో/ అలహాబాద్: లవ్ జీహాద్ పేరుతో ఉత్తరప్రదేశ్ లో కొనసాగుతున్నన అరెస్టు పర్వానికి అలహాబాద్ హైకోర్టు చిన్న బ్రేక్ వేసింది. లవ్ జీహాద్ పేరుతో 32 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చెయ్యకుండా అలహాబాద్ హైకోర్టు స్టే విధించింది. ముస్లీం యువకుడు ఫ్రెండ్ భార్యకు స్మార్ట్ ఫోన్ తో వల వేసి ఆమెను వివాహం చేసుకుని బలవంతంగా మతమార్పిడి చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడని కొందరు చేసిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే కేసు నమోదు అయ్యింది. హైకోర్టు ఆదేశాలతో ముస్లీం యువకుడితో పాటు అతని కుటుంబ సభ్యులు తాత్కాలికంగా ఊపిరిపీల్చుకున్నారు.

Wife for sale: చెత్తనా కొడుకు, మహాభారతం రిపీట్, పేకాట కోసం భార్య పందెం, జల్సా చేసుకోండి ఫ్రెండ్స్ !Wife for sale: చెత్తనా కొడుకు, మహాభారతం రిపీట్, పేకాట కోసం భార్య పందెం, జల్సా చేసుకోండి ఫ్రెండ్స్ !

 యోగీ ప్రభుత్వం ఆదేశాలు

యోగీ ప్రభుత్వం ఆదేశాలు

ఉత్తరప్రదేశ్ లో లవ్ జీహాద్ పేరుతో ఎవరైన బలవంతంగా మతం మార్చి పెళ్లి చేసుకుంటే అరెస్టులు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం 2020లో కొత్తగా చట్ట అమలు చేసింది. ఉత్తరప్రదేశ్ లో కొత్తచట్టం అమలులోకి వచ్చిన తరువాత ఎవరైనా ముస్లీం యువకులు హిందూ అమ్మాయిలను వివాహం చేసుకుంటే కేసులు నమోదౌతున్నాయి.

 ఫ్రెండ్ భార్యకు ఫ్మార్ట్ ఫోన్ తో వల

ఫ్రెండ్ భార్యకు ఫ్మార్ట్ ఫోన్ తో వల

ముజఫర్ నగర్ లో అక్షయ్ కుమార్ త్యాగీ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతను ఓ ప్రముఖ కాంట్రాక్టర్ దగ్గర లేబర్ కాంట్రాక్టర్ గా పని చేస్తున్నాడు. అక్షయ్ కుమార్ దగ్గర నదీమ్ అనే వ్యక్తి కూలీగా పని చేస్తున్నాడు. పని మీద అక్షయ్ కుమార్ ఇంటికి నదీమ్ వెళ్లేవాడు. ఇదే సమయంలో తన భార్య పరుల్ తో నదీమ్ కు పరిచయం ఎక్కువ అయ్యిందని, తరువాత నదీమ్ తన భార్య పరుల్ కు స్మార్ట్ ఫోన్ లు, ఖరీదైన వస్తువులు గిఫ్ట్ గా ఇచ్చి ఆమెను వలలో వేసుకున్నాడని అక్షయ్ కుమార్ ఆరోపిస్తున్నాడు.

 పెళ్లి చేసుకుంటానని ప్రామిస్

పెళ్లి చేసుకుంటానని ప్రామిస్

తన భార్య పరుల్ ను వలలో వేసుకున్న నదీమ్ ఆమెను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి మా కాపురంలో చిచ్చు రేపాడని అక్షయ్ కుమార్ తో పాటు భజరంగ్ దళ్ కార్యాకర్తలు అలహాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నదీమ్ పై కేసు నమోదు చేసి విచారణ చేశారు. ఇదే సమయంలో తన మీద నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను రద్దు చెయ్యాలని నదీమ్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు.

 మీ దగ్గర సాక్షాలు ఉన్నాయా ?, హైకోర్టు స్టే

మీ దగ్గర సాక్షాలు ఉన్నాయా ?, హైకోర్టు స్టే

నదీమ్ బలవంతంగా పరుల్ ను మతం మార్చి పెళ్లి చేసుకుంటున్నాడని మీ దగ్గర ఏమైనా ప్రాథమిక సాక్షాలు ఉన్నాయా ? అంటూ అలహాబాద్ హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. నదీమ్ మీద మీరు లవ్ జీహాద్ పేరుతో కేసు నమోదు చెయ్యడానికి సరైనా సాక్షాలు లేవని తెలుస్తోంది, అందు వలన అతన్ని అరెస్టు చెయ్యడానికి వీలు లేదని అలహాబాద్ హైకోర్టు చెప్పిందని ఎన్డీటీవీ కథనం వెళ్లడించింది. హైకోర్టు ఆదేశాలతో నదీమ్ తో పాటు అతని కుటుంబ సభ్యులు తాత్కాలికంగా ఊపిరి పీల్చుకున్నారు.

 బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే

బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే

బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే లవ్ జీహాద్ పేరుతో కొత్త చట్టాలు తీసుకువస్తున్నారని హైకోర్టు గుర్తు చేసింది. గత ఫిబ్రవరి నెలలో కేంద్ర ప్రభుత్వం కూడా లవ్ జీహాద్ పేరుతో కొత్త చట్టాలు ఏమీ తీసుకురాలేదని చెప్పిందని హైకోర్టు గుర్తు చేసింది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఎందుకు లవ్ జీహాద్ పేరుతో కొత్త చట్టాలు తీసుకువస్తున్నారు ? అంటూ అలహాబాద్ హైకోర్టు పోలీసులను, ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

English summary
Love Jihad: As the debate over love jihad continues to grow, the Allahabad High Court on Friday stayed the arrest of a 32-year-old Muslim man booked under the Uttar Pradesh government's controversial anti-conversion law.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X