వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Love Jihad: రిజిస్టర్ ఆఫీసులో యువర్ అండర్ అరెస్ట్, పెళ్లి పెద్దలకు షాక్, ఉద్యోగం పేరుతో పెళ్లి, మతమార్పడి!

|
Google Oneindia TeluguNews

లక్నో/ డెహ్రాడున్/ బెంగళూరు: రెండు సంవత్సరాలుగా ప్రేమించుకున్న హిందూ యువతితో ఓ ముస్లీం యువకుడు ఇంటి నుంచి పారిపోయాడు. ఐదు నెలల క్రితం స్నేహితుల సహకారంతో ప్రేమికులు పెళ్లి చేసుకున్నారు. ఐదు నెలల నుంచి చక్కగా కాపురం చేసిన యువతి, యువకుడు చట్టభద్దంగా వివాహం చేసుకోవడానికి సబ్ రిజస్టర్ ఆఫీసు చేరుకున్నారు.

సబ్ రిజిస్టర్ ఆఫీసులో సంతకాలు చేసే సమయంలో ఎంట్రీ ఇచ్చిన పోలీసులు యువర్ అండర్ అరెస్ట్ అంటూ ఆ యువకుడిని పట్టుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లిపోయారు. ఆ సమయంలో సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని సిబ్బంది, పెళ్లి పెద్దలు షాక్ కు గురై అసలు ఏం జరిగింది ?, ఎవరు సమాచారం ఇచ్చారు అంటూ ఆరా తీశారు.

Sadist: పెళ్లి కొడుక్కి బెంజ్ కారు, 5 కేజీ బంగారు, ఫస్ట్ నైట్ భరత్ రెడ్డి ఏం చేశాడంటే ? శోభనం చెట్టెక్కింది, కథ!Sadist: పెళ్లి కొడుక్కి బెంజ్ కారు, 5 కేజీ బంగారు, ఫస్ట్ నైట్ భరత్ రెడ్డి ఏం చేశాడంటే ? శోభనం చెట్టెక్కింది, కథ!

రెండేళ్లు ప్రేమ ప్రయాణం

రెండేళ్లు ప్రేమ ప్రయాణం

ఉత్తరప్రదేశ్ లోని మోరాదాబాద్ లో నివాసం ఉంటున్న రసూల్ (పేరు మార్చడం జరిగింది), అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న కోకిల (పేరు మార్చడం జరిగింది) అనే యువతికి మూడు సంవత్సరాల క్రితం పరిచయం అయ్యింది. రెండు సంవత్సరాల నుంచి రసూల్, కోకిల ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి మతాలు వేరు కావడంతో మన పెళ్లికి పెద్దలు అంగీకరించరని రసూల్, కోకిల డిసైడ్ అయ్యారు.

ఇంటి నుంచి ఎస్కేప్

ఇంటి నుంచి ఎస్కేప్

రెండు సంవత్సరాలు ప్రేమ ప్రయాణం చేసిన రసూల్, కోకిల ఐదు నెలల క్రితం ఇంటి నుంచి పారిపోయారు. రసూల్ అతనికి తెలిసిన మతపెద్దలతో ముస్లీం సాంప్రధాయం ప్రకారం జులై 24వ తేదీన డెహ్రాడున్ లో కోకిలను వివాహం చేసుకున్నాడు. తరువాత రసూల్, కోకిల స్నేహితుల ఆర్థిక సహాయంతో కాంత్ ప్రాంతంలో కొత్త కాపురం పెట్టారు.

ఏదో అనుకుంటే ఏదో జరిగింది

ఏదో అనుకుంటే ఏదో జరిగింది

ఐదు నెలల క్రితం ముస్లీం సాంప్రధాయం ప్రకారం ప్రియురాలు కోకిలను పెళ్లి చేసుకున్న రసూల్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించాడు. స్నేహితుల సహాయంతో మోరాదాబాద్ లోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పెళ్లి చేసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నాడు. కోకిలను పిలుచుకుని రహస్యంగా మోరాదాబాద్ లోని సబ్ రిజిస్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అధికారుల ముందు సంతకాలు చెయ్యడానికి సిద్దం అయిన రసూల్ కు ఊహించని షాక్ తగిలింది.

 యువర్ అండర్ అరెస్ట్

యువర్ అండర్ అరెస్ట్

సబ్ రిజిస్టర్ కార్యాలయానికి చేరుకున్న పోలీసులు యువర్ అండర్ అరెస్టు అంటూ రసూల్ ను అదుపులోకి తీసుకున్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తమ్ముడి పెళ్లి చెయ్యడానికి వెళ్లిన రసూల్ అన్నను పోలీసులు అరెస్టు చేశారు. కోకిలను బలవంతంగా మతం మార్చి పెళ్లి చేసుకుంటున్నారని ఆమె తల్లి నాలుగు నెలల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

లవ్ జీహాద్ కు చెక్

లవ్ జీహాద్ కు చెక్

తమ కుమార్తె కోకిలకు ఉద్యోగం ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి మతం మార్చి రసూల్ పెళ్లి చేసుకున్నాడని, మాకు న్యాయం చెయ్యాలని, మా కుమార్తెను మాకు అప్పగించాలని ఇప్పటికే కోకిల తల్లి కేసు పెట్టారని, ఆ కేసు ఆధారంగా రసూల్, అతని సోదరుడిని అరెస్టు చేశామని పోలీసులు అన్నారు. రసూల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో హిందూ యువతి కోకిలను బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసిందని, అందుకే పోలీసులకు సమాచారం ఇచ్చి అతన్ని అరెస్టు చేయించామని, ఇక ముందు లవ్ జీహాద్ కు చెక్ పెడుతామని స్థానిక భజరంగ్ దళ్ నాయకుడు రాకేష్ కుమార్ మీడియాకు చెప్పారు.

Recommended Video

Bengaluru : బిర్యానీ పిచ్చి.. ప్రాణాల కంటే బిర్యానే ఎక్కువా? || Oneindia Telugu
యూపీ ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్

యూపీ ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్

ఉత్తరప్రదేశ్ లో లవ్ జీహాద్ కు అడ్డుకట్ట వేయడానికి ప్రత్యేకంగా 2020లో ప్రత్యేక చట్టం తీసుకు వచ్చింది. ఉత్తరప్రదేశ్ లో బలవంతంగా మతమార్పిడులకు పాల్పడి పెళ్లి చేసుకున్న వారి మీద, పెళ్లి చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తరప్రదేశ్ లోని యోగి అదిత్యనాథ్ ప్రభుత్వం ఇటీవల హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్ లో నమోదైన ఐదవ కేసులో లవ్ జీహాద్ పేరిట పెళ్లి చేసుకుని అరెస్టు అయిన ఐదవ వ్యక్తి ఈ రసూల్.

English summary
Love Jihad: Fifth case has been registered under unlawful conversion of religion ordinance in Moradabad of uttara pradesh. Moradabad police arrested him while he came to register his marriage with hindu girl.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X