• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

love marriage: ఆంటీకి 51, అబ్బాయికి 26, గ్రాండ్‌గా పెళ్లి, ఆంటీ ఆస్తులు అదుర్స్, గుర్రం ఎక్కాడు, అంతే !

|

చెన్నై/ కన్యాకుమారి: అనారోగ్యంగా ఉన్న తల్లిని చూసుకోవాలని ఆలోచించిన మహిళ 51 ఏళ్లు దాటిపోయినా పెళ్లి చేసుకోలేదు, కోట్ల రూపాయల ఆస్తులతో పాటు బ్యూటీపార్లల్ లో బాగా డబ్బులు సంపాధిస్తున్న ఆంటీ, ఆమె ఆస్తులు చూసి ఎలాగైనా పెళ్లి చేసుకోని గుర్రం ఎక్కాలని 26 ఏళ్ల యువకుడు స్కెచ్ వేశాడు. రెండు నెలల క్రితం గ్రాండ్ గా ఆంటీ, అబ్బాయి పెళ్లి జరిగింది. ఇదే సమయంలో సంతోషంలో ఉన్న ఆంటీ, అబ్బాయి వారి పెళ్లి ఫోటోలను ఫేస్ బుక్ లో పోస్టు చెయ్యడంతో అక్కడ అసలు కథ మొదలైయ్యింది.

Super wife: క్యాషియర్ భర్త, నా భార్యను చూస్తే మూడ్ రాదు, మెరుపుతీగ అమ్మాయిలు, కంతిరీగ ఆంటీలతో జల్సా!

 తల్లి ముఖ్యం.... పెళ్లి కాదు !

తల్లి ముఖ్యం.... పెళ్లి కాదు !

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కలియక్కవిలై ప్రాంతంలోని కారయక్కంలో సారా అలియాస్ సాగా (51) అనే మహిళ నివాసం ఉంటున్నారు. సారా తండ్రి చనిపోయాడు. సారా తల్లి తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో అనేక ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. తీవ్ర అనారోగ్యానికి గురైన సారా తల్లి ప్రస్తుతం ఇంట్లోని మంచానికే పరిమితం అయ్యింది. తల్లి ఆలనాపాలనా చూసుకోవడానికి ఇంత వరకు సారా పెళ్లి చేసుకోలేదు.

 ఆంటీ ఆస్తులు అదుర్స్

ఆంటీ ఆస్తులు అదుర్స్

సారాకు 51 ఏళ్లు పూర్తి అయినా పెళ్లి గురించి ఆలోచించలేదు. తనతో పాటు అనారోగ్యంగా ఉన్న తన తల్లిని చూసుకోవడానికి ఇల్లరికం వచ్చే అల్లుడ కావాలని ఇంత కాలం ఎదురు చూసిన సారాకు 51 ఏళ్లు దాటిపోయాయి. సారాకు కన్యాకుమారిలో 10 ఎకరాల వ్యవసాయం పోలం ఉంది. అంతే కాకుండా బ్యూటీపార్లల్ నిర్వహిస్తున్న సారా ప్రతిరోజు కొన్ని వేల రూపాయల డబ్బులు సంపాధిస్తోంది.

 ఆంటీ జర్సీ ఆవులా ఉందని మోజు

ఆంటీ జర్సీ ఆవులా ఉందని మోజు

కేరళలోని నదీ తీరప్రాంతం అయిన నయ్యార్ కు చెందిన అరుణ్ కుమార్ అలియాస్ అరుణ్ (26) కన్యాకుమారి చేరుకుని ప్రముఖ ఆసుపత్రిలో రిసెప్షనిస్టుగా ఉద్యోగం చేస్తున్నాడు. తల్లిని పిలుచుకుని ఆసుపత్రికి వెళ్లి వస్తున్న సారాకు అరుణ్ పరిచయం అయ్యాడు. ఇదే సమయంలో సారా, అరుణ్ దగ్గర అయ్యారు. సారా మంచి జర్సీ ఆవులా ఉందని, ఎలాగైనా గుర్రం ఎక్కాలని అరుణ్ సారా మీద మోజు పెంచుకున్నాడు.

 ఆంటీ, ఆస్తులు కలిసి వచ్చాయని పెళ్లి

ఆంటీ, ఆస్తులు కలిసి వచ్చాయని పెళ్లి

సారాకు పెళ్లి కాలేదని, కోట్ల రూపాయల విలువ చేసే 10 ఎకరాల వ్యవసాయం పొలం ఉందని, బ్యూటీపార్లల్ లో ప్రతిరోజు ఆమె కొన్ని వేల రూపాయల డబ్బులు సంపాధిస్తుందని, ఆమెను పెళ్లి చేసుకుంటే లైఫ్ లో సెటిల్ అయిపోవవచ్చి అరుణ్ బావించాడు. అరుణ్ కంటే సారాకు 25 ఏళ్ల వయసు ఎక్కువ. సారాను పెళ్లి చేసుకోవడానికి అరుణ్ కుటుంబ సభ్యులు అందరూ తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. కుటుంబ సభ్యులను ఎదిరించిన అరుణ్ రెండు నెలల క్రితం చర్చిలో క్రిస్టియన్ సాంప్రధాయం ప్రకారం సారాను పెళ్లి చేసుకున్నాడు.

 ఆస్తి కోసం గొడవలు

ఆస్తి కోసం గొడవలు

పెళ్లి జరిగినప్పటి నుంచి సారా ఇంటిలోనే అరుణ్ ఆమెతో కాపురం చేస్తున్నాడు. పెళ్లి జరిగినప్పటి నుంచి తన పేరు మీద ఆస్తులు రాయించాలని అరుణ్ భార్య సారా మీద ఒత్తిడి తీసుకు వచ్చాడు. ఆస్తులు అరుణ్ పేరు మీద రాయడానికి సారాతో పాటు ఆమె తల్లి నిరాకరించింది. అక్కడ నుంచి సారా, అరుణ్ ల మద్య గొడవలు మొదలైనాయి.

 ఫేస్ బుక్ లో పెళ్లి ఫోటోలు పోస్టు చేస్తే

ఫేస్ బుక్ లో పెళ్లి ఫోటోలు పోస్టు చేస్తే

సారా, అరుణ్ ల పెళ్లి ఫోటోలతో గొడవ ఇంకా పెద్దది అయ్యింది. వారం రోజుల క్రితం సారా పెళ్లి ఫోటోలను ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. తరువాత తన స్వీట్ హార్ట్ అంటూ పెళ్లి ఫోటోలను అరుణ్ కూడా సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. నీకు పెళ్లి చేసుకోవడానికి ఆంటీలు, బామ్మలు తప్పా ఇంకా ఎవ్వరూ చిక్కలేదా అంటూ అరుణ్ ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేసి అత

 పక్కాప్లాన్ తో భార్య ఫినిష్

పక్కాప్లాన్ తో భార్య ఫినిష్

ఫ్రెండ్స్ కామెంట్లతో అరుణ్ ఇంకా సహనం కోల్పోయాడు. క్రిసమస్ రోజు సారా ఇంటిలో క్రిమస్ మస్ చెట్టు ఏర్పాటు చేసి విద్యుత్ లైట్లు తగిలించారు. విద్యుత్ లైన్ కట్ చేసిన అరుణ్ ఆ వైర్లు తీసుకెళ్లి సారా మీద పడేటట్లు చేశాడు. విద్యుత్ షాక్ తో తీవ్రగాయాలైన సారా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. విద్యుత్ షాక్ తో సారా మరణించిందని అందర్ని నమ్మించడానికి అరుణ్ ప్రయత్నించాడు. సారా ఇంటిలో ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాల్లో అరుణ్ చేసిన పని రికార్డు కావడంతో అతన్ని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. సారా ఆస్తి, డబ్బు కోసం పెళ్లి చేసుకుని రెండు నెలల్లో భార్యను చంపేసిన అరుణ్ కు పోలీసులు బెండ్ తీస్తున్నారు.

English summary
love marriage: 51 year old wife murder case in Kanniyakumari in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X