• search
 • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Love Marriage: సూర్యకాంతం ఎంట్రీతో ట్విస్ట్, రెండో పెళ్లి ఇష్టం లేక భార్య, విరక్తితో భర్త, నీ కులం!

|

చెన్నై/ తిరునిండ్రవూరు: ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సమయంలో యువకుడికి ఓ యువతి పరిచయం అయ్యింది. ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. పాతసినిమా కథలాగే ఇద్దరి పెళ్లికి వారి కులాలు అడ్డువచ్చాయి. పెద్దలను ఎదిరించి ఇద్దరు ధైర్యంగా ప్రేమపెళ్లి చేసుకుని కాపురం పెట్టారు. ఇదే సమయంలో దంపతులకు పిల్లలు పుట్టకపోవడంతో ఆవేదనకు గురైనారు. బ్లాక్ అండ్ వైట్ సినిమాలో ఫ్యామిలీ విలన్ సూర్యకాంతం లాగా అమ్మాయి తల్లి ఎంట్రీ ఇచ్చింది. కూతురిని పుట్టింటికి తీసుకెళ్లి రెండో పెళ్లి చెయ్యాలని చిత్రహింసలు పెట్టారు. భర్తను వదలి వేరే పెళ్లి చేసుకోలేని ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్య శవాన్ని కూడా తాకనివ్వకుండా, చివరిచూపు చూడటానికి అవకాశం ఇవ్వకపోవడంతో విరక్తి చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.

Lockdown: కోలీవుడ్ నటీమణులతో గెస్ట్ హౌస్ లో బిగ్ షాట్ రొమాన్స్, చేసింది చాలు పదనాయనా, అరెస్టు !

 ప్రేవేట్ కంపెనీలో ఉద్యోగం

ప్రేవేట్ కంపెనీలో ఉద్యోగం

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై సిటీ శివార్లలోని తిరునిండ్రవూర్ ప్రాంతంలోని భట్టప్రమన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న అరవిందన్ (27) ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతను చెన్నైకి చెందిన పవిత్ర (25) అనే యువతిని ప్రేమించాడు. కొంతకాలం తరువాత పవిత్ర కూడా అరవింద్ ను ప్రేమించింది. అరవింద్, పవిత్ర పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు.

పాతసినిమా డైలాగ్

పాతసినిమా డైలాగ్

అరవింద్, పవిత్ర కులాలు వేరే. వీరిద్దరి పెళ్లికి పవిత్ర కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పారు. చచ్చినా ఈ పెళ్లి చెయ్యడానికి మేము అంగీకరించమని పవిత్ర కుటుంబ సభ్యులు తేల్చిచెప్పారు. మీరు చావనవసరం లేదని, మా చావు ఏదో మేమే చస్తాం అంటూ అరవింద్. పవిత్ర ఐదు సంవత్సరాల క్రితం గుడిలో పెళ్లి చేసుకుని వేరుకాపురం పెట్టారు.

లేడీ విలన్ సూర్యకాంతం ఎంట్రీ

లేడీ విలన్ సూర్యకాంతం ఎంట్రీ

నాలుగు సంవత్సరాలు అరవింద్, పవిత్ర దంపతులు హ్యాపీగానే జీవనం సాగించారు. అయితే పిల్లలు పుట్టలేదని అరవింద్, పవిత్ర దంపతులు ఆవేదన చెందుతున్నారు. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న అరవింద్ అతనికి ఉన్నకాడికి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య పవిత్రను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు. 2019లో పవిత్ర తల్లి రమాకాంతం వారి కాపురంలోకి ఎంట్రీ ఇవ్వడంతో కథ కొత్త మలుపు తిరిగింది.

నమ్మించి నట్టేట ముంచేసిన తల్లి

నమ్మించి నట్టేట ముంచేసిన తల్లి

పవిత్రతో అన్యోన్యంగా ఉన్నట్లు నటించిన ఆమె తల్లి రమాకాంతం తరువాత ఆమె అసలు స్వరూపం చూపించడం మొదలుపెట్టింది. పుట్టింటికి తీసుకువెలుతున్నానని అరవింద్ ను నమ్మించిన తల్లి రమాకాంతం కూతురు పవిత్రను ఇంటికి పిలుచుకుని వెళ్లింది. తరువాత కొంతకాలానికి అరవింద్ భార్యను చూడటానికి వెళ్లిన ప్రతిసారి అతన్ని ఇంట్లోకి రానివ్వకుండా గొడవలు చెయ్యడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో పవిత్రకు రెండో పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు తీవ్రప్రయత్నాలు చేశారు.

భర్త బతికుండగానే వేరే పెళ్లి చేస్తారా ?

భర్త బతికుండగానే వేరే పెళ్లి చేస్తారా ?

తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త బతికుండగానే నాకు రెండో పెళ్లి చేస్తారా ? నేను ఒప్పుకోను అంటూ పవిత్ర అడ్డం తిరిగింది. ఇదే సమయంలో పవిత్రకు చిత్రహింసలు పెట్టారని తెలిసింది. భర్త అరవింద్ దూరం కావడం, పుట్టింటి నుంచి బయటకు వెళ్లడానికి అవకాశం లేకపోవడంతో ఆవేదన చెందిన పవిత్ర ఈనెల 15వ తేదీన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పవిత్ర ఆత్మహత్య చేసుకుందని విషయం తెలుసుకున్న అరవింద్ ఆమె ఇంటికి వెళ్లడంతో ఆమె కుటుంబ సభ్యులు అతన్ని అడ్డుకున్నారు.

నువ్వులేని ఈ జీవితం ఎందుకు ?

నువ్వులేని ఈ జీవితం ఎందుకు ?

భార్య పవిత్రను చివరి చూపుకూడా చూడనివ్వకుండా చేసిన ఆమె కుటుంబ సభ్యులపై అరవింద్ రిగిలిపోయాడు. ఇదే సమయంలో అరవింద్ ను కులం పేరుతో ఆమె కుటుంబ సభ్యులు అందరిముందు దూషించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య పవిత్ర ఆత్మహత్య చేసుకోవడంతో ఒంటరిగా తాను జీవించలేనని అరవింద్ నిర్ణయించాడు.

  Love Indian, Chinese People, Want To Keep Peace - Trump || Oneindia Telugu
  ఫేస్ బుక్ లో సూసైడ్ నోట్

  ఫేస్ బుక్ లో సూసైడ్ నోట్

  జరిగిన విషయం మొత్తం సూసైడ్ నోట్ లో రాసి పెట్టి ఫేస్ బుక్ లో పోస్టు చేసిన అరవింద్ అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వారం రోజుల్లోనే దంపతులు అరవింద్, పవిత్ర ఆత్మహత్య చేసుకోవడంతో వారి స్నేహితులు షాక్ కు గురైనారు. ఫేస్ బుక్ లోని సూసైడ్ నోట్ ఆధారంగా స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అరవింద్ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవడంతో పవిత్ర కుటుంబ సభ్యులు పరారైనారు.

  English summary
  Love Marriage: Caste issue, Young man commits suicide near Chennai city in Tamil Nadu.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X