• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

love marriage: మాల్ లో ఉద్యోగం, భార్యకు కరోనా, రోడ్లో వదిలేసి భర్త ఎస్కేప్, నరకం చూసిన భార్య !

|

బెంగళూరు/ న్యూఢిల్లీ: ప్రేమించి జీవితాంతం తోడు ఉంటానని నమ్మించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఆమెతో రెండేళ్లు హ్యాపీగా కాపురం చేశాడు. మహమ్మారి వ్యాధి కరోనా వైరస్ (COVID 19) దెబ్బతో వారి జీవితం అర్దాంతరంగా ముగిసిపోయింది. షాపింగ్ మాల్ లో ఉద్యోగం చేస్తున్న భార్యకు కరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే భర్త మాయం అయ్యాడు. సహాయం చేసే దిక్కులేక, ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేసే వారు కరువు కావడంతో కరోనా కాటుతో ఇంట్లోనే నరకం అనుభవించిన భర్యా మరణించింది. భార్య మరణించిదని తెలిసిన వెంటనే మొబైల్ స్వీచ్ ఆఫ్ చేసుకున్న భర్త ఎవ్వరికీ చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఆరోగ్యశ్రీ పరిధిలో కరోనావైరస్‌కు చికిత్స అందించే హాస్పిటల్స్ ఇవే..!

Horror murder: బెడ్ రూమ్ లో సెక్స్ పాఠాలు చెప్పాలని భర్త టార్చర్, మర్మాంగం కొరికేసిన భార్య!

 షాపింగ్ మాల్ లో ఉద్యోగం

షాపింగ్ మాల్ లో ఉద్యోగం

కర్ణాటకలోని విజయపురకు చెందిన గౌరి (27) అనే యువతి బెంగళూరు చేరుకుని ప్రముఖ మాల్ లో సేల్స్ గర్ల్ గా ఉద్యోగం చేస్తున్నది. విజయపురకు చెందిన మంజునాథ్ అనే యువకుడు బెంగళూరు చేరుకుని కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఒకే ప్రాంతం వారు కావడంతో మంజునాథ్, గౌరికి పరిచయం కావడంతో ఇద్దరూ దగ్గర అయ్యారు.

 పేరుకు లవ్ మ్యారేజ్

పేరుకు లవ్ మ్యారేజ్

మంజునాథ్, గౌరి కొన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవడానికి పెద్దలు నిరాకరించడంతో మంజునాథ్, గౌరి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుని బెంగళూరులోని మహాలక్ష్మి లేఔట్ లోని శంకరమఠ వార్డులో ప్రత్యేకంగా కాపురం పెట్టారు. పెళ్లి జరిగిన రెండేళ్లపాటు మంజునాథ్, గౌరి దంపతులు సంతోషంగా గడిపారు.

 భార్యకు కరోనా పాజిటివ్

భార్యకు కరోనా పాజిటివ్

గత శుక్రవారం భార్య గౌరి తీవ్ర అనారోగ్యానికి గురైయ్యింది. భర్త మంజునాథ్ భార్య గౌరిని పిలుచుకుని ఆదిచుంచనగిరి ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యపరీక్షలు చేయించాడు. నీ భార్య గౌరికి కరోనా పాజిటివ్ వచ్చిందని, వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని వైద్యులు చెప్పారు. భార్య గౌరికి కరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే భర్త మంజునాథ్ షాక్ కు గురైనాడు. నువ్వు ఇంటికి వెళ్లు, నేను వెంటనే వస్తాను అని భార్య గౌరికి చెప్పిన మంజునాథ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

 నీళ్లు ఇచ్చే దిక్కులేక నరం అనుభవించిన భార్య

నీళ్లు ఇచ్చే దిక్కులేక నరం అనుభవించిన భార్య

భర్త ఇంటికి వస్తాడని భ్రమతో నేరుగా ఇంటికి వెళ్లిన గౌరి అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనింది. అయితే ఆసుపత్రి దగ్గరే మాయం అయిన భర్త మంజునాథ్ ఎక్కడ తనకు కూడా కరోనా వస్తుందో, నా ప్రాణాలు ఎక్కడ పోతాయో అనేభయంతో అతను మాయం అయిపోయాడు. ఇంట్లో నీళ్లు ఇచ్చే దిక్కులేక గౌరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనింది. ఇదే సమయంలో అనారోగ్యంతో ఉన్న గౌరికి సహాయం చెయ్యడానికి చుట్టుపక్కల వాళ్లు ధైర్యం చెయ్యలేకపోయారు. ఇంట్లో నరకం అనుభవించిన గౌరి మంచం మీద ప్రాణాలు విడించింది. ఇంటి యజమాని గౌరి ఎందుకు బయటకు రావడం లేదని కిటికిలో నుంచి చూడగా ఆమె ప్రాణం పోయిన విషయం వెలుగు చూసింది.

స్విచ్ ఆఫ్... భార్య అంత్యక్రియలకు రాని భర్త

స్విచ్ ఆఫ్... భార్య అంత్యక్రియలకు రాని భర్త

కరోనా పాజిటివ్ తో గౌరి మరణించిదని చుట్టు పక్కల వాళ్లు ఆమె భర్త మంజునాథ్ కు సమాచారం ఇవ్వడానికి ప్రయత్నించారు. అయితే మొబైల్ స్వీచ్ ఆఫ్ చేసుకున్న మంజునాథ్ అడ్రస్ లేకుండా పోయాడు. చుట్టుపక్కల వాళ్లు అయ్యో పాపం అంటూ గౌరి అంత్యక్రియలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న మహాలక్ష్మి లేఔట్ పోలీసులు కేసు నమోదు చేసి భార్యను గాలికి వదిలేసి పరారైనా పాపాత్ముడు మంజునాథ్ కోసం గాలిస్తున్నారు.

English summary
Coronavirus: Husband Escapes After His Wife Tests Positive For COVID 19 positive in Bengaluru in karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X