Love marriage: నవ వధువు గర్బిణి, లాక్ డౌన్ లో పక్కాప్లాన్: కారులో కిడ్నాప్, వీళ్లేనా ? మన కులం !
చెన్నై/ తిరుచ్చి: పెద్దలను ఎదిరించిన యువతి ఆమె ప్రేమించిన యువకుడిని ధైర్యంగా వివాహం చేసుకుంది. కుటుంబ సభ్యులకు దూరంగా నవదంపతులు కాపురం పెట్టారు. తమను ఎదిరించి పెళ్లి చేసుకున్న కుమార్తెకు ఎలాగైనా బుద్ది చెప్పాలని ఆమె తల్లిదండ్రులు రగిలిపోయారు. ప్రస్తుతం నవవివాహిత గర్బిణి. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిని కొందరు కారులో కిడ్నాప్ చేశారు. ఇంటికి వచ్చిన భర్త విషయం తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు సీసీకెమెరాలు పరిశీలించగా అసలు విషయం బయటపడటంతో అందరూ షాక్ కు గురైనారు.
అత్త కూతురితో పెళ్లి: ఫస్ట్ నైట్ బెడ్ రూంలో అరుపులు, కేకలు, సరసాలు కాదు, గడ్డపారతో మానవ మృగం !

మూడు సంవత్సరాలు లవ్
తమిళనాడులోని తిరుచ్చిలోని ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న హరిహరన్ (24), గీతా చోప్రా (20) అనే యువతి మూడు సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని జీవితాంతం ఇద్దరు సుఖంగా ఉండాలని హరిహరన్, గీతా చోప్రా నిర్ణయించారు. తన ప్రేమ విషయాన్ని గీతా చోప్రా ఇంటిలో చెప్పింది.

మన కులం కాదు
హరిహరన్ మనకులం వాడు కాదు, అతన్ని పెళ్లి చేసుకోవడానికి మేము అంగీకరించమని ఆమె కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. పెద్దలను ఎదిరించి వివాహం చేసుకోవాలని హరిహరన్, గీతా చోప్రా నిర్ణయించుకున్నారు. మంచి సమయం చూసి పెళ్లి చేసుకోవాలని కొంత కాలం హరిహరన్, గీతా చోప్రా ఎదురు చూశారు.

స్నేహితులే పెళ్లి పెద్దలు
హరిహరన్ ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించిన గీతా చోప్రా జనవరిలో ఇంటి నుంచి పారిపోయింది. తమిళనాడులోని సమయపురంలోని మారియమ్మాన్ ఆలయంలో జనవరి నెలలో హరిహరన్, గీతా చోప్రా పెళ్లి చేసుకున్నారు. స్నేహితులే హరిహరన్, గీతా చోప్రాకు పెళ్లి పెద్దలు అయ్యారు. పెళ్లి చేసుకున్న హరిహరన్, గీతా చోప్రా లాల్గుడి మహిళా పోలీసులను ఆశ్రయించి మాకు రక్షణ కల్పించాలని మనవి చేశారు.

నవవధువు గర్బిణి
పోలీసులు రక్షణ కల్పిస్తామని హామీ ఇవ్వడంతో వారి సూచన మేరకు లాల్గుడి ప్రాంతంలో హరిహరన్, గీతా చోప్రా కాపురం పెట్టారు. ప్రస్తుతం గీతా చోప్రా మూడు నెలల గర్బవతి. తన భార్య తల్లికాబోతుందని తెలుసుకున్న ఆమె భర్త హరిహరన్ చాలాచాలా సంతోషంగా ఉన్నాడు. గురువారం సాయంత్రం ఇంట్లోకి చోరబడిన ఆరు మంది ఇంట్లో ఒంటరిగా ఉన్న గీతా చోప్రాను కత్తులతో బెదిరించి కారులో కిడ్నాప్ చేశారు.

చెక్ పోస్టులో చిక్కారు
ఇంటికి వచ్చిన హరిహరన్ తన భార్య కిడ్నాప్ అయ్యిందని తెలుసుకుని లల్గూడి పోలీసులను ఆశ్రయించారు. వెంటనే పోలీసులు తమిళనాడు పోలీసులు అందర్ని అలర్ట్ చేశారు. కిడ్నాపర్ల కారు తురానుంగురిచ్చి చెక్ పోస్ట దాటడానికి ప్రయత్నించిన సమయంలో గస్తీ తిరుగుతున్న పోలీసులు ఆ కారును అడ్డుకున్నారు. కారులో గీతా చోప్రా ఉన్న విషయం తెలుసుకుని ఆమెను పోలీసులు రక్షించారు.

కిడ్నాపర్లు వీళ్లేనా !
గర్బిణి అయిన గీతా చోప్రాను కిడ్నాప్ చేసింది ఆమె తల్లిదండ్రులు అని తెలుసుకున్న పోలీసులు షాక్ కు గురైనారు. గీతా చోప్రా తండ్రి మరిరాజన్ (56), తల్లి విజయకుమారి (45), వీరి బంధువులు కుమారనన్ (23) కార్తీక్ (21), కారు డ్రైవర్ దినేష్ (26), ఉదయన్ స్వామి (48) అనే ఆరు మందిని తిరుచ్చి పోలీసులు అరెస్టు చేశారు. కిడ్నాప్ కు గురైన గీతా చోప్రాను రక్షించిన పోలీసులు ఆమెను భర్త హరిహరన్ కు అప్పగించారు. గర్బిణి గీతా చోప్రా కిడ్నాప్ కేసులో ఆమె తల్లిదండ్రులతో పాటు వారికి సహకరించిన ఆరు మందిని అరెస్టు చేసి తిరుచ్చి జైలుకు పంపించామని పోలీసులు తెలిపారు .