• search
 • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Love marriage: కులం, పరువు, ప్రతిష్ట, పిండాకూడు, నవదంపతులు, ప్రేమికులను మాటలతో చంపేశారు !

|

చెన్నై/ మదురై/ ఈరోడ్: ప్రేమపెళ్లి చేసుకున్న నవదంపతులను, మరోచోట ప్రేమికులను అనేక సమస్యలు వెంటాడాయి. కులం, పరువు, ప్రతిష్ట, పిండాకూడు అంటూ అందరూ సూటిపోటి మాటలతో వారిని కించపరిచారు. పెద్దలను ఎదిరించి మూడు నెలల క్రితం పెళ్లి చేసుకున్న ప్రేమికులు ఈ సమాజంలో బతకడానికి అవకాశం లేదా ? అంటూ వారు అసహనం పెంచుకున్నారు. ఛీ మీరు చీడపురుగులు, మీరు జీవిస్తున్న ఈ సమాజంలో మేము జీవించాలంటే సిగ్గుగా ఉంది అంటూ రగిలిపోయిన ప్రేమికులు ఈ లోకాన్ని వదిలివెళ్లిపోయారు. మరోచోట ప్రియురాలు ఆత్మహత్య చేసుకోవడంతో ఆవేదనతో ప్రియుడు బలవర్మరణాలకు పాల్పడ్డాడు.

Khiladi wife: కొవ్వు కరిగించాలని భార్య జిమ్ కు, జిమ్ మాస్టర్ కు ఫ్రూట్ జ్యూస్, భర్తకు ఖాళీ గ్లాస్!

 ప్రాణానికి ప్రాణం

ప్రాణానికి ప్రాణం

తమిళనాడులోని ఈరోడ్ జిల్లా అందియూరు సమీపంలోని ఒరుచ్చేరికి చెందిన ఇలంగోవన్ (23) అనే యువకుడు, తిరుచంగోడుకు చెందిన రమ్య (23) అనే యువతి కుమారపాళ్యంలో ప్రైవేట్ కాలేజ్ లో చదివే సమయంలో స్నేహితులు అయ్యారు. గత మూడు సంవత్సరాలుగా ఇలంగోవన్, రమ్య ప్రేమించుకున్నారు. ఇలంగోవన్, రమ్యల కులాలు వేరు కావడంతో వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. పెద్దలు కాదన్నా మనం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నామని, ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని ప్రేమికులు ఇలంగోవన్, రమ్య డిసైడ్ అయ్యారు.

 మూడు నెలల క్రితం పెళ్లి

మూడు నెలల క్రితం పెళ్లి

పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో వారిని ఎదిరించిన ఇలంగోవన్, రమ్య మూడు నెలల క్రితం ఇంటిని బయటకు వచ్చి స్నేహితుల సహకారంతో గుడిలో పెళ్లి చేసుకున్నారు. మూడు నెలల నుంచి అందియూర్ ప్రాంతంలో ఇలంగోవన్, రమ్య ప్రత్యేకంగా కాపురం ఉంటున్నారు. ఇలంగోవన్ ఓ టీవీ షోరూమ్ లో ఉద్యోగం చేస్తున్నాడు.

 ఇంటికి వెళ్లి చూస్తే గదిలో భార్య !

ఇంటికి వెళ్లి చూస్తే గదిలో భార్య !

ఉదయం సంతోషంగా ఇలంగోవన్ టీవీ షోరూమ్ లో ఉద్యోగానికి వెళ్లాడు. తరువాత రమ్య మాత్రమే ఇంటిలో ఉంది. రాత్రి పని ముగించుకుని ఇలంగోవన్ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంటిలోని ఓ గదిలో రమ్య సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని వేలాడుతోంది. విషయం గుర్తించిన వెంటనే ఇలంగోవన్ గట్టిగా కేకలు వేశాడు. ఇంట్లో నవదంపతులు ఏదో గొడవ పడుతున్నారని చుట్టుపక్కల వాళ్లు బావించారు. అయితే భార్య రమ్య ఆత్మహత్య చేసుకోవడంతో ఆవేదన చెందిన ఇలంగోవన్ అక్కడే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

 ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో !

ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో !

రమ్య, ఇలంగోవన్ ఆత్మహత్య చేసుకున్న విషయం ఆరోజు బయటకు రాలేదు. అయితే మరుసటి రోజు నవదంపతులు ఇద్దరూ ఇంటి నుంచి ఎంతసేపటికి బయటకురాకపోవడంతో చుట్టుపక్కల వాళ్లకు అనుమానం వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా రమ్య, ఇలంగోవన్ ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది. పెళ్లి జరిగిన తరువాత ఇలంగోవన్, రమ్య దంపతులు సంతోషంగానే ఉన్నారని, అయితే చిన్నచిన్న గొడవలు జరిగేవని, ఏ రోజు ఈ దంపతులు పెద్దగా గొడవ చేసుకోలేదని, పెద్దల సూటిపోటి మాటలు ఎక్కువ అయ్యాయని వారు ఆవేదన చెందేవారని చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 ప్రియురాలు పిలిచింది

ప్రియురాలు పిలిచింది

ఈ రోడ్ తో పాటు చెన్నైలో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నైలోని తండయార్ పేటలో నివాసం ఉంటున్న కుమార్ కుమార్తె దివ్య (21), పాతచాకలి వీదికి చెందిన పెరుమాల్ కుమారుడు అయ్యప్పన్ (22) ప్రేమించుకున్నారు. అయ్యప్పన్, దివ్యల కులాలు వేరు కావడంతో వారి పెళ్లిని పెద్దలు వ్యతిరేకించారు. ప్రియురాలు దివ్య ఫోన్ చేసి రమ్మని చెప్పడంతో అయ్యప్పన్ వెళ్లి ఆమెతో మాట్లాడాడు. ఆ సమయంలో దివ్య కుటుంబ సభ్యులు గుర్తించి ఇద్దిరిని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

  Sushant Singh Rajput Loves Sara Ali Khan More Than Rhea బ్రేకప్ కి రియానే కారణం !
   దివ్య ఆత్యహత్యతో ప్రియుడు ఆత్మహత్య

  దివ్య ఆత్యహత్యతో ప్రియుడు ఆత్మహత్య

  దివ్యను ఆమె కుటుంబ సభ్యులు తీవ్రస్థాయిలో మందలించారు. ప్రియుడికి దూరంగా ఉండలేక, అతన్ని కలవలేక ఆవేదన చెందిన దివ్య అర్దరాత్రి ఇంట్లో ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే దివ్యను కీలంపాక్కం ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై దివ్య మరుసటిరోజు మరణించింది. తన ప్రియురాలు దివ్య ఆత్మహత్య చేసుకుందని తెలుసుకున్న అయ్యప్పన్ ఆవేదనతో ఇంట్లో ఫ్యాన్ కు వేరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దల పంతానికి దివ్య, అయ్యప్పన్ ఆత్మహత్య చేసుకోవడంతో విషాదచాయలు నెలకొన్నాయి.

  English summary
  Love marriage: Young couple committed suicide near Erode in Tamil Nadu.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X