వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లవ్, సెక్స్ ఔర్ ధోకా: జైషే టాప్ కమాండర్ ఖలీద్ ను.. మాజీ ప్రియురాలే పట్టించింది!

జైషే మహ్మద్ కశ్మీర్ చీఫ్ ఉమర్ ఖలీద్ ఎన్‌కౌంటర్ వెనుక పెద్ద కథే నడిచింది. ఖలీద్ ను.. ఇరవై ఏళ్ల వయసున్న అతడి మాజీ ప్రియురాలే పట్టించింది. అతడి చేతిలో మోసపోయిన ఆమె పగతో రగిలిపోయి అతడి మరణశాసనాన్ని

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: భారత భద్రతా బలగాలు అనూహ్య విజయాన్ని సాధించాయి. పక్కలో బల్లెంలా మారిన జైషే మహ్మద్ మిలిటెంట్ టాప్ కమాండర్ ఉమర్ ఖలీద్ ను స్థానిక పోలీసులు, సీఆర్పీఎఫ్, ఆర్మీ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌ ద్వారా మట్టుబెట్టాయి.

మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఖలీద్ ఉత్తర కశ్మీర్ లోని బారాముల్లా జిల్లా లడూరా ప్రాంతంలో సోమవారం జరిగిన ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు. ఇతడు ఉత్తరకశ్మీర్‌లో అనేకసార్లు భద్రతా శిబిరాలతోపాటు ప్రత్యేకంగా పోలీసులను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడేవాడు.

Love, Sex Aur Dhokha: Story Behind Killing of Top Jaish-e-Mohammad Commander Umer Khalid in Baramulla

పాకిస్తాన్ జాతీయుడైన ఖలీద్.. రెండు మూడేళ్లుగా జమ్మూకశ్మీర్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఉగ్రవాద నియామకాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఖలీద్ ఏ-ప్లస్ ప్లస్ క్యాటగిరీ ర్యాంక్ ఉన్న ఉగ్రవాది. అతడి తలపై రూ.7 లక్షల రివార్డు కూడా ఉంది.

ప్రియురాలే పట్టించింది...

అయితే జైషే మహ్మద్ కశ్మీర్ చీఫ్ ఉమర్ ఖలీద్ ఎన్‌కౌంటర్ వెనుక పెద్ద కథే నడిచింది. ఖలీద్ ను.. ఇరవై ఏళ్ల వయసున్న అతడి మాజీ ప్రియురాలే పట్టించింది. అతడి చేతిలో మోసపోయిన ఆమె పగతో రగిలిపోయి అతడి మరణశాసనాన్ని లిఖించింది.

ఖలీద్ కారణంగా ఆమె గర్భం దాల్చగా.. ఆ బిడ్డకు తనకు ఎలాంటి సంబంధమూ లేదని ఖలీద్ నిష్కర్షగా చెప్పడంతో ఆమె కంగుతింది. చివరకు ఆమె అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చింది. దీంతో ఖలీద్‌పై ప్రతీకారంతో ఆమె రగిలిపోయింది.

గత ఏడాది ఒకరోజు ఆమె జమ్మూ కశ్మీర్ లోని ఫోలీసు అధికారి ఒకరికి ఫోన్ చేసింది. ''అతడి చావే నాకు కావాల్సింది. అతడి కదలికను ఎప్పటికప్పుడు మీకు చేరవేస్తాను. మిగిలిన పని మీరు చక్కబెట్టాలి..'' అని కోరింది.

సోమవారం ఆమె ఇచ్చిన పక్కా సమాచారంతో ఖలీద్‌ను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. శృంగార పురుషుడిగా పేరొందిన ఖలీద్ చివరకు తాను హతమయ్యే సమయంలోనూ ముగ్గురు, నలుగురు యువతులతో ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

English summary
Top Jaish-e-Mohammed (JeM) commander Umer Khalid was gunned down by a joint team of security forces in Ladoora area of north Kashmir’s Baramulla town today. Khalid was a top ranked militant who carried a cash reward of nearly Rs 7 lakh on his head.Director General of Jammu and Kashmir Police SP Vaid said it was a major breakthrough for the security forces as the militant was involved in many attacks on security camps in north Kashmir as well as targeting policemen in particular.According to reports, Khalid’s girlfriend helped the security forces nab the dreaded terrorist.Some time last year, a woman walked into the office of a top Jammu and Kashmir Police officer’s office. The woman claimed she was in a relationship with JeM commander Mohammad Khalid but wanted him dead as he has cheated her. “I will lead you to his tracks, you do the rest (in killing him). I want him dead,” a report in India Today quoted the Kashmiri woman, in her early 20s, telling the police officer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X