• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Love story: ప్రేమికులు ఎస్కేప్, తక్కువ కులం, చంపేసి కరోనా వచ్చిందని కాల్చేసి, షాక్ !

|

బెంగళూరు: కులాలు వేరు అయిన యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉండాలని ప్రేమికులు నిర్ణయించారు. విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు ప్రియుడికి అనేకసార్లు వార్నింగ్ ఇచ్చారు. అమ్మాయికి ఇంట్లో టార్చర్ ఎక్కువ కావడంతో ఆమె ప్రియుడితో కలిసి ఇంటి నుంచిపారిపోయింది. ప్రియుడితో కలిసి సంతోషంగా ఉంటున్న అమ్మాయిని ఆమె కుటుంబ సభ్యులు బలవంతంగా ఇంటికి పిలుచుకుని వెళ్లారు. ప్రియురాలి ఫ్యామిలీ దెబ్బతో ప్రియుడు జిల్లానే వదిలిపారిపోయారు. అంతే అక్కడ సీన్ కట్ చేస్తే తమ కుమార్తెకు కరోనా వచ్చి చచ్చిపోయిందని ప్రచారం చేసి ఆమెను కాల్చి బూడిద చెయ్యడం కలకలం రేపింది.

Illegal affair: భర్తకు నైట్ డ్యూటీ, భార్య ఫుల్ బిజీ, గొడదూకిన ప్రియుడు, ఫ్రెండ్స్ చూసి ?Illegal affair: భర్తకు నైట్ డ్యూటీ, భార్య ఫుల్ బిజీ, గొడదూకిన ప్రియుడు, ఫ్రెండ్స్ చూసి ?

పెద్దింటి అమ్మాయి

పెద్దింటి అమ్మాయి

కర్ణాటకలోని దావణగెరె జిల్లాలోని పరప్పనహళ్ళి తాలుకా యడిహళ్ళి గ్రామంలో 18 ఏళ్ల రజింత, సూరజ్ (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) అనే యువతి, యువకుడు నివాసం ఉంటున్నారు. చిన్నప్పటి నుంచి ఒకే ఊరిలో పుట్టి పెరిగిన రంజిత, సూరజ్ కులాలు వేరు. సూరజ్ కంటే కులంలో, ఆస్తి అంతస్తుల్లో ఎక్కువ అయిన రంజిత కుటుంబ సభ్యులు ఆ ఊర్లో పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

లవ్ లో పడ్డారు.... సీక్రెట్ గా !

లవ్ లో పడ్డారు.... సీక్రెట్ గా !

రంజిత, సూరజ్ రెండు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. అసలే గ్రామంలో కులాల విషయంలో, ఆస్తులు, అంతస్తుల విషయంలే పట్టింపులు ఎక్కువగా ఉన్నాయి. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరని ముందుగానే రంజిత, సూరజ్ లకు తెలుసు. పెద్దలను ఎదరించి అయినా సరే పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉండాలని రంజిత, సూరజ్ డిసైడ్ అయ్యారు.

నీకు బతకాలని లేదారా ?

నీకు బతకాలని లేదారా ?

రంజిత, సూరజ్ లు వారి ప్రేమ వ్యవహారం చాలా సీక్రెట్ గా పెట్టాలని అనేక ప్రయత్నాలు చేశారు. చివరి రంజిత లవ్ మ్యాటర్ ఆమె ఇంట్లో వాళ్లకు తెలిసిపోయింది. నువ్వు కులం తక్కువవాడివిరా. మర్యాదగా నీదారి నువ్వు చేసుకో, లేదంటే లేపేస్తాం అంటూ రంజిత కుటుంబ సభ్యులు అనేకసార్లు సూరజ్ కు వార్నింగ్ లు ఇచ్చారని తెలిసింది.

 ప్రియుడితో పారిపోయింది

ప్రియుడితో పారిపోయింది

రంజితకు ఇంట్లో టార్చర్ ఎక్కువ అయ్యింది. రంజితకు మొబైల్ ఫోన్ చిక్కకుండా ఇంట్లో జాగ్రత్తలు తీసుకున్నారు. రంజిత ఇంటి నుంచి బయటకు వెళ్లి సూరజ్ ను కలవకుండా చేశారు. ఇంట్లో టార్చర్ ఎక్కువ కావడంతో ఇటీవల రంజిత ఇంటి నుంచి తప్పించుకుని బయటపడి ప్రియుడు సూరజ్ తో కలిసి దావణగెరె జిల్లాను దాటి పారిపోయింది.

 ప్రియుడిని బహిష్కరించిన పెద్దలు

ప్రియుడిని బహిష్కరించిన పెద్దలు


రంజిత, సూరజ్ వేరే ఊరిలో సంతోషంగా కొన్ని రోజులు గడిపారు. పలుకుబడి ఉపయోగించిన రంజిత కుటుంబ సభ్యులు వాళ్ల ఆచూకి తెలుసుకుని వాళ్లను పట్టుకుని సొంత గ్రామానికి తీసుకువచ్చారు. ఊర్లో పంచాయితీ చేసిన పెద్దలు సూరజ్ ను గ్రామం వదిలిపారిపోవాలని ఆదేశించారు. పెద్దలకు భయపడిన ప్రియుడు సూరజ్ తనను చంపేస్తారనే భయంతో ఊరు వదిలి జిల్లానే వదిలి పారిపోయాడు.

చంపేసి కరోనా అని ప్రచారం ?

చంపేసి కరోనా అని ప్రచారం ?


రంజిత మీద ఆమె కుటుంబ సభ్యులు రగిలిపోయారు. కులం తక్కువ ప్రియుడితో పారిపోయి మా పరువు తీశావని రంజితను పట్టుకుని చితకబాదేశారు. తరువాత రంజితకు ఆమె కుటుంబ సభ్యులు బలవంతంగా విషం తాగించి చంపేశారని తెలిసింది. అనంతరం రంజిత శవాన్ని ఊరిబయటకు తీసుకెళ్లి కాల్చి బూడిద చేసేశారు. మా అమ్మాయి రంజితకు కరోనా వచ్చి చనిపోయిందని, అందుకే అంత్యక్రియలు చేసేశామని ఊరి ప్రజలను నమ్మించడానికి ప్రయత్నించారు.

ఫ్యామిలీ మొత్తం అందర్

ఫ్యామిలీ మొత్తం అందర్

రంజిత విషయం లీక్ కావడంతో గురువారం పోలీసులు రంజిత కుటుంబ సభ్యులు 7 మందిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ప్రేమించిన రంజితను ఆమె కుటుం సభ్యులు పరువు హత్య చేశారని వెలుగు చూడటంతో కలకలం రేపింది. రంజిత శవం పూర్తిగా కాలిపోయి బూడిద కావడంతో పోలీసులు తలల పట్టుకున్నారు. కేసు విచారణలో ఉందని దావణగెరె పోలీసులు అంటున్నారు.

English summary
Love story: 18-year-old girl killed by family members near Davanagere in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X