వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేము ప్రేమిస్తాం...మోడీ ద్వేషిస్తాడు...రాహుల్ గాంధి

|
Google Oneindia TeluguNews

ఏఐసిసీ అధ్యక్షుడు రాహుల్ గాంధి ఆరవ విడత జరుగుతున్న పోలీంగ్ లో ఓ సాధరణ ఓటరు అయ్యాడు. తన మంది మార్బాలం హంగులను వదిలిపెట్టి నడుచుకుంటూ వచ్చి న్యూఢిల్లిలోని ఔరంగజేబ్ లేన్ లో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. దీంతో అయన వెంట సెక్యూరిటి సిబ్బంది, మీడియా వ్యక్తులు పరుగులు పెట్టాల్సి వచ్చింది.

న్యూఢిల్లిలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటి చేస్తున్నఅజయ్ మాకిన్ రాహుల్ గాంధితో పాటు కలిసి ఓటు వేశాడు. ప్రస్థతం న్యూఢిల్లి నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ అభ్యర్థి మీనాక్షీ లేఖీ మరియు అజయ్ మాకెన్ మధ్య హోరాహోరి పోరు జరుగుతుంది. కాగా అమ్ ఆద్మీ పార్టీ నుండి బ్రిజేష్ గోయల్ బరిలో ఉన్నారు.

love will triumph :Rahul Gandhi

ఈనేపథ్యంలోనే ప్రధాని నరేంద్రమోడీ ద్వేషంతో మా ప్రేమను ఉపయోగించుకున్నాడని ,అయితే ఆ ప్రేమే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని భావిస్తున్నని ఆయన స్పష్టం చేశారు. ఏది ఏమైన ప్రజలే మా బాసులు, వాళ్లు ఏది నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. కాగా మంచి వాతవరణంలో ఎన్నికలు పోరు జరుగుతుందని రాహుల్ గాంధి అన్నారు.

పార్లమెంట్ నిండు సభలో ప్రధాని నరేంద్రమోడీని తన సీటు వద్దకు వెళ్లి రాహుల్ గాంధి హత్తుకున్న విషయం తెలిసిందే..దీంతోపాటు ఇద్దరి ఇటివల రాజకీయ విమర్శలతోపాటు మాజీ ప్రధాని రాజీవ్ గాంధిపై ప్రధాని మోడీ అవినీతీ వ్యాఖ్యలు చేయడంతో ఇద్దరి మధ్య మాటల యుద్దం చెలరేగుతోంది. ఇక రాహుల్ గాంధి ఉత్తరప్రదేశ్ లోని అమేఠీతోపాటు, దక్షిణాది రాష్ట్ర్రమైన కేరళాలోని వయనాడ్ లో పోటి చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఆరవ విడత ఎన్నికల్లో బాగంగా మొత్తం ఏడు రాష్ట్రాల్లో 59 లోక్ సభ స్థానాలకు నేడు ఎన్నికలు జరుగున్నాయి. ఇందులో బాగంగానే మరో విడత మే 19 మిగిలి ఉండగా ,మే 23న రాజకీయ నాయకుల భవిత్యం తేలనుంది.

English summary
Rahul Gandhi ditched his high-security vehicle and instead, chose to walk down from his home in central Delhi to the polling booth to cast his vote in the sixth round of the national election. The Congress president is a voter in the high-profile New Delhi parliamentary seat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X