బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

facebook: నగ్నంగా వీడియో కాల్, సొంగ కార్చుకుని విశ్వరూపం చూపించాడు, అమ్మాయి బ్లాక్ మెయిల్, రివర్స్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఫేస్ బుక్ లో పరిచయం అయిన అమ్మాయిని చూసి సొంగ కార్చుకున్న అబ్బాయి ఆమె ఆడినట్లు ఆడాడు. కొతకాలం సోషల్ మీడియాలో చాటింగ్ చేసిన యువకుడు యువతి మాయలో పడిపోయాడు. ఓ సారి అమ్మాయి నగ్నంగా అబ్బాయికి వీడియో కాల్ చేసింది. ఇక అంతే వీడియో కాల్ తో స్వర్గం కనపడింది అని ఆ యువకుడు అమ్మాయి చెప్పినట్లు నగ్నంగా అతని విశ్వరూపం చూపించి చెయ్యరాని పని చేశాడు. అంతే అమ్మాయి చేతికి బ్రహ్మాస్త్రం చిక్కడంతో గురుడి పని అయిపోయింది. పదేపదే అమ్మాయి నగ్న వీడియోలతో రివర్స్ గేర్ తో బ్లాక్ మెయిల్ చెయ్యడంతో ఆమె టార్చర్ తట్టుకోలేని అబ్బాయి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

TikTok: పోలీసు అధికారి పోటుగాడు, కరోనా కాలంలో పోయేకాలం, అమ్మాయిలు, ఆంటీలతో రోజుకు 20 సార్లు !TikTok: పోలీసు అధికారి పోటుగాడు, కరోనా కాలంలో పోయేకాలం, అమ్మాయిలు, ఆంటీలతో రోజుకు 20 సార్లు !

 అసలే ఐటీ హబ్

అసలే ఐటీ హబ్

ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని బెంగళూరు నగరం రానురాను సైబర్ క్రైమ్ దందాలకు అడ్డాగా మారిపోతున్నది. చిన్న చాన్స్ చిక్కితే చాలు అమ్మాయకులకు తియ్యటి మాటలు చెప్పి వారిని అనేక రకాలుగా ప్రలోభ పెట్టి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఐటీ సంస్థలకే కాదు సైబర్ నేరాలకు బెంగళూరును అడ్డాగా చేసుకుని కొందరు రెచ్చిపోతున్నారు.

 ఫేస్ బుక్ తో చిన్న టచ్

ఫేస్ బుక్ తో చిన్న టచ్

బెంగళూరు నగరంలోని సుల్తాన్ పాళ్యలో నివాసం ఉంటున్న 30 ఏళ్ల యువకుడు ఫేస్ బుక్ తో పాటు నిత్యం సోషల్ మీడియాలో చురుకుగా ఉంటున్నాడు. ఓసారి ఫేస్ బుక్ లో ఆ యువకుడికి 30 ఏళ్ల అమ్మాయి పరిచయం అయ్యింది. అమ్మాయితో ఆ యువకుడు కొంత కాలం సోషల్ మీడియాలో చాటింగ్ చేశాడు.

 ఇదే నా ఫోన్ నెంబర్, నీ ఫోన్ నెంబర్ ఇవ్వు

ఇదే నా ఫోన్ నెంబర్, నీ ఫోన్ నెంబర్ ఇవ్వు

కొంత కాలం క్రితం అబ్బాయికి తియ్యటి మాటలు చెప్పిన అమ్మాయి ఒక ఫోన్ నెంబర్ ఇచ్చింది. నీకు తీరిక ఉన్న సమయంలో తనకు ఫోన్ చెయ్యాలని, అలాగే నీ ఫోన్ నెంబర్ ఇవ్వాలని చెప్పింది. కొంతకాలంగా ఫేస్ బుక్ లో ఫ్రెండ్ గా ఉన్న యువతికి ఆ యువకుడు ఫోన్ నెంబర్ ఇచ్చి అప్పటి నుంచి నిత్యం ఫోన్ కాల్స్ తో టచ్ లో ఉన్నారు.

 నగ్నంగా వీడియో కాల్ తో వల

నగ్నంగా వీడియో కాల్ తో వల

వారం రోజుల క్రితం మిట్ట మద్యాహ్నం అమ్మాయి అబ్బాయికి వీడియో కాల్ చేసింది. అంతే వీడియో కాల్ లో మాట్లాడుతున్న అబ్బాయి ఒక్కసారిగా షాక్ కు గురైనాడు. వీడియో కాల్ లో మాట్లాడుతున్న సమయంలో ఆ అమ్మాయి ఒంటిమీద ఉన్న బట్టలు మొత్తం విప్పేసి నగ్నంగా తయారు అయ్యింది.

 విశ్వరూపం చూపించాడు

విశ్వరూపం చూపించాడు

వీడియో కాల్ లో నగ్నంగా మాట్లాడుతున్న అమ్మాయి నువ్వుకూడా ఇలాగే నగ్నంగా తయారైతే నేను చూడాలని ఉందని, నా కోరిక తీర్చాలని అబ్బాయికి ఆ అమ్మాయి అబ్బాయి చెప్పింది. అమ్మాయి నగ్నంగా కనపడే సరికి సొంగ కార్చుకున్న అబ్బాయి శరీరం మీద ఉన్న బట్టలు మొత్తం విప్పేసి అతని విశ్వరూపం అమ్మాయికి చూపించాడు. అబ్బాయి నగ్నంగా వీడియో కాల్ లో మాట్లాడుతున్న సమయంలో ఆ యువతి ఆ దృశ్యాలను రికార్డు చేసుకుంది.

 హల్.. ఇస్తావా ?

హల్.. ఇస్తావా ?

ఇద్దరు నగ్నంగా వీడియో కాల్ లో చాలా సేపు మాట్లాడుకున్న తరువాత అమ్మాయి ఆ వీడియో కాల్ కట్ చేసింది. అదే రోజు మళ్లీ అబ్బాయికి ఫోన్ చేసిన అమ్మాయి ఆమె అసలు స్వరూపం చూపించింది. నీ నగ్న వీడియోలు తన దగ్గర ఉన్నాయని, తాను అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని, నీ ఫ్యామిలీలో చిచ్చురేపుతుందని అబ్బాయిని ఆ అమ్మాయి బ్లాక్ మెయిల్ చేసింది.

Recommended Video

Amrutha Pranay కామెంట్స్ పై స్పందించిన Ram Gopal Varma || Oneindia Telugu
 ఒకటో సారి.... రెండో సారి... !

ఒకటో సారి.... రెండో సారి... !

అమ్మాయి బ్లాక్ మెయిల్ చెయ్యడంతో ఆందోళనకు గురైన అబ్బాయి ఆమె చెప్పిన బ్యాంకు అకౌంట్ కు రూ. 10 వేలు పంపించాడు. తరువాత రెండో సారి ఫోన్ చేసి అమ్మాయి భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అమ్మాయి టార్చర్ ఎక్కువ కావడంతో విసిగిపోయిన అబ్బాయి బెంగళూరు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకున్న బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు మాయం అయిన ఆమె కోసం గాలిస్తున్నారు. మొత్తం మీద అమ్మాయిని నగ్నంగా చూసి తట్టుకోలేక విశ్వరూపం చూపించిన అబ్బాయి ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో పడ్డాడు.

English summary
Love: Woman blackmailed facebook friend in Bengaluru in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X