వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ మనోహరమైన నది.. తనలో కలుపుకుంటోంది.. వివాహిత భావోద్వేగ వీడియో.. చిరునవ్వుతోనే..

|
Google Oneindia TeluguNews

జీవితం.. ఎవరికీ పూలబాట కాదు. కష్టంతోపాటు సుఖం ఉంటోంది. సంసారం అన్నాక గొడవలు సహజమే. కానీ వాటిని సరిదిద్దుకొని వెళ్లదీయాలి. ఈ కాలంలో కోపతాపాలు ఎక్కువే.. ఇక ఓపిక అంటారా అదీ ఇసుమంతయిన ఉండటం లేదు. దీంతో జీవితం అర్థాంతరంగా ముగిసిపోతున్నాయి. క్షణకాలంలో తీసుకునే నిర్ణయం రెండు జీవితాలను.. ఇరు కుటుంబాలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గుజరాత్‌లో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్నారు.

సూసైడ్‌కు ముందు నదీలో సెల్పీ వీడియో తీసి మరీ పోస్ట్ చేశారు. అందులో ఆమె నవ్వుతూ కనిపించి.. నదీ గొప్పతననాన్ని చెప్పారు. అలాగే తన చావుకు ఎవరూ కారణం కారు అని చెప్పి తన గొప్ప మనసును చాటారు. కానీ కన్నవారికి తీరని శోకాన్ని మిగిల్చారు.

అయేషా ఆరీఫ్ ఖానీ వీడియో..

అయేషా ఆరీఫ్ ఖానీ వీడియో..

వీడియోలో కనిపించే వివాహిత పేరు అయేషా ఆరీఫ్ ఖాన్.. వీరిది గుజరాత్ కాగా.. 2018లో జూలైలో రాజస్తాన్‌కు చెందిన ఆరీఫ్‌తో వివాహమైంది. తర్వాత ఏం జరిగిందో కానీ.. కొన్నాళ్ల నుంచి అయేషా ఇంటి వద్దే ఉంటోంది. కానీ తన భర్త గురించి వీడియోలో పల్లెత్తు మాట కూడా అనలేదు. సబర్మతి నదీ మధ్యలో వీడియో తీసి.. పోస్ట్ చేశారు.

అందులో తన గురించి తాను చెప్పుకున్నారు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని.. తన మరణానికి ఎవరూ కారణం కాదని చెప్పారు. ఈ మనోహరమైన నది.. నన్ను చేర్చుకోవాలని ఆశిస్తున్నాను, ఈ అందమైన అలలు అంటే తనకెంటో ఇష్టం అని.. అందులో తాను కొట్టుకుపోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. సాధారణంగా సూసైడ్ చేసుకునే సమయంలో వీడియో తీయడం రేర్.. అలాంటిదీ ఆమె వీడియోలో కూడా చిరునవ్వుతో చేశారు.

ఇష్టపూర్వకంగానేనని.. చెరగని చిరునవ్వుతో

ఇష్టపూర్వకంగానేనని.. చెరగని చిరునవ్వుతో

ఏదైతే చేస్తున్నాను ఇష్టపూర్వకంగా చేస్తున్నాను.. ఇందులో ఎవరి బలవంతం లేదు అని చెప్పారు. తనను ఎవరూ ఒత్తిడి చేయలేదని స్పస్టంచేశారు. తనకు ఈ జీవితం ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు చెబుతున్నానని పేర్కొన్నారు. తన భర్తపై పెట్టిన కేసును విత్ డ్రా చేసుకోవాలని కూడా కోరారు. అయేషా ఎవరితో యుద్దం చేయదు.. ఇప్పటికీ ఆరీఫ్ అంటే తనకు ఇష్టం అని చెప్పారు.

అయినా మనం ఎందుకు బాధపడాలి అని ప్రశ్నించారు. అతనికి ఫ్రీడమ్ కావాలెమో.. వదిలేద్దాం అంటూ కామెంట్స్ చేశారు. చివరికీ తన జీవితం ముగుస్తోందని.. అయినా తనకు సంతోషం ఉందని చెప్పారు. తాను అల్లాను కలుస్తానని.. తాను చేసిన తప్పెంటో అతనినే అడుగుతానని తెలియజేశారు. తన తప్పును తెలుసుకునే ప్రయత్నం చేస్తానని.. చనిపోతున్నా భర్త, ఇతరులపై ఒక్క మాట అనకుండా తనువు చాలించారు.

ఫోన్ చేసినా మాట్లాడటం లేదు.. బాధ భరించలేకే

అయేషా మృతదేహన్ని నదీ పశ్చిమ తీరంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేశారు. అయితే అయేషా తండ్రి లికాయత్ అలీ మాత్రం ఆమె చావుకు కారణం భర్త అని చెబుతున్నారు. తన కూతురికి వివాహం జరిగిన కొన్నాళ్లు మాత్రమే బాగుందని చెప్పారు. తర్వాత వరకట్న వేధింపులు ప్రారంభం అయ్యాయని చెప్పారు. అయినప్పటికీ తాను కొంత డబ్బును ఇచ్చానని చెప్పారు.

కానీ వారి కోరిక తీరలేదని.. అందుకే కొన్ని నెలల క్రితం తన కూతురిని పుట్టింటికీ పంపించారని తెలియజేశారు. అయేషాతో గొడవపడి పంపించారని తెలిపారు. తర్వాత కూతురుతో ఫోన్‌లో కూడా మాట్లాడలేదని చెప్పారు. ఆ బాధను అయేషా భరించలేదని వివరించారు. అందుకు ఎక్స్ ట్రీమ్ స్టెప్ తీసుకుందని పేర్కొన్నారు. తనలా మరొ తండ్రి బాధపడకూడదని చెప్పారు. ఆరీఫ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

English summary
Ayesha ended her life by jumping into the Sabarmati river at the Riverfront side in Ahmedabad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X