• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రేమించి , సహజీవనం చేసి కాదన్నాడని .. ప్రియుడిపై ప్రియురాలి యాసిడ్ దాడి : ఆగ్రాలో సీన్ రివర్స్

|

ఇప్పటివరకు ప్రేమను కాదందని యువతులపై ప్రేమ పేరుతో పురుషులు చేసిన యాసిడ్ దాడుల గురించి విన్నాం . కానీ తాజాగా ఆగ్రాలో విస్మయం కలిగించే సంఘటన చోటు చేసుకుంది. ఒక యువకుడిపై తన ప్రేమను కాదన్నాడని ప్రియురాలు యాసిడ్ దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనలో తీవ్ర గాయాలపాలైన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఘటనలో గాయపడిన యువతి సైతం ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

విశాఖలో దారుణం ... భార్యపై అనుమానంతో భర్త యాసిడ్‌ దాడివిశాఖలో దారుణం ... భార్యపై అనుమానంతో భర్త యాసిడ్‌ దాడి

 ప్రేమించి , సహజీవనం చేసి కాదన్నాడని యువతి ఘాతుకం

ప్రేమించి , సహజీవనం చేసి కాదన్నాడని యువతి ఘాతుకం

ఆగ్రాలోని కందరిలో 28 సంవత్సరాల దేవేంద్ర రాజ్ పుత్ ఓ ప్రైవేట్ పాథాలజీ ల్యాబ్లో , సోనమ్ అనే యువతి ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా ఒకేచోట ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారు . ఈ క్రమంలో వారిద్దరూ ప్రేమలో పడ్డారు. అంతేకాదు గత కొద్ది కాలంగా ఓ గదిని అద్దెకు తీసుకొని ఇద్దరూ సహ జీవనం సైతం కొనసాగిస్తున్నారు . ఈ క్రమంలో దేవేంద్ర కు అతని కుటుంబ సభ్యులు పెళ్లి చేయాలని నిశ్చయించి సంబంధం చూశారు. దేవేంద్ర సైతం తల్లిదండ్రుల కోరికను కాదనలేక, వారు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది.

ఇంటికి పిలిచి యాసిడ్ తో దాడి చేసిన ప్రియురాలు .. ప్రియుడు మృతి

ఇంటికి పిలిచి యాసిడ్ తో దాడి చేసిన ప్రియురాలు .. ప్రియుడు మృతి

దేవేంద్ర , సోనమ్ ను పెళ్లి చేసుకోనని, తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని చేసుకుంటాం అని తేల్చి చెప్పాడు. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న సోనమ్ సీలింగ్ ఫ్యాన్ రిపేర్ పేరుతో ప్రియుడు దేవేంద్ర ను ఇంటికి పిలిచింది. అదును చూసి అతని పై యాసిడ్ కుమ్మరించింది. ఈ ఘటనలో సోనమ్ కు కూడా గాయాలు కాగా ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు . ఇక యాసిడ్ దాడి వల్ల తీవ్ర గాయాల పాలైన దేవేంద్ర ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడి కన్ను మూశాడు .

 బాధితుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు .. గతంలో ఏపీలో కూడా

బాధితుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు .. గతంలో ఏపీలో కూడా

బాధితుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఆగ్రా పోలీసులు సోనమ్ పై కేసు పెట్టారు . ఈ కేసును పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు . యాసిడ్ దాడి ఘటనలు అమ్మాయిలపైన మాత్రమే కాదు , అబ్బాయిలపైనా జరుగుతున్నాయి. ప్రేమించిన అబ్బాయి మోసం చేస్తే దాడి చేస్తున్న వాళ్లు, ఇళ్ల ముందుకు వెళ్ళి ధర్నాలు చేస్తున్న వాళ్ళు, కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్న వాళ్ళు మాత్రమే కాదు యాసిడ్ తో దాడి చేస్తున్న అమ్మాయిలు కూడా ఇప్పుడు పెరిగి పోయారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ నంద్యాల మండలంలో తనను కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో యువతి యాసిడ్ అటాక్ చేసింది .

ప్రేమ పేరుతో ఈ తరహా దాడులకు దిగటం సమాజానికి హానికరం

ప్రేమ పేరుతో ఈ తరహా దాడులకు దిగటం సమాజానికి హానికరం

గతంలో అమ్మాయిలపైన మాత్రమే యాసిడ్ దాడులు జరిగేవి . ఇక మహిళల రక్షణ కోసం మహిళా సంఘాలు ఆందోళనలను సైతం చేపట్టేవి . కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా తెగబడి దాడులకు దిగుతున్నారు . ఇలాంటి చర్యలు అటు అమ్మాయిలూ ,అబ్బాయిలు ఎవరు చేసినా హానికరమే . ప్రమాదమే . ప్రేమ పేరుతో మోసాలకు పాల్పడటం ఎంత తప్పో , ప్రేమించిన వాళ్ళు దక్కలేదని దాడులు చెయ్యటం కూడా అంతే తప్పని చెప్తున్నారు .

English summary
A man died of severe burns after a woman he was in a relationship with allegedly threw acid on him in a fit of rage as he was getting married to someone else, police said. Sonam, a nurse at a private hospital here, and Devendra, an assistant at a pathology lab, knew each other for a long time and were in a relationship. But she was angry with Devendra as he was going to marry another person,she attacked him with acid, the police added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X