Lovers: ప్రియురాలికి జ్యూస్ లో డ్రగ్స్ కలిపి, బెడ్ రూమ్ లో వీడియోలు తీసి ఏం చేశాడంటే ?, మైండ్ బ్లాక్ !
బెంగళూరు/ మంగళూరు: యువతి వెంట తిరిగిన యువకుడు ప్రేమిస్తున్నానని ఆమెకు మాయమాటలు చెప్పాడు. కొంతకాలానికి అతని ట్యాలెంట్ తో ఆమెను లొంగదీసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని ఆ యువతిని నమ్మించి వెంట తిప్పుకున్నాడు. కొంతకాలం తరువాత యువతికి జ్యూస్ లో డ్రగ్స్ కలిపి ఇచ్చి ఆమె మత్తులోకి జారుకున్న తరువాత ఆమె మీద అత్యాచారం చేశాడు. విహారయాత్రలకు పిలుచుకుని వెళ్లి అక్కడ డ్రగ్స్ ఇచ్చి ఆమె మీద అత్యాచారం చేశాడు. ప్రియురాలి మీద అత్యాచారం చేసే సమయంలో, ఆమె నగ్నంగా ఉన్న సమయంలో వీడియోలు తీసిన ప్రియుడు ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు.
నీ నగ్న వీడియోలు, నిన్ను రేప్ చేసే సమయంలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించి ఆమె దగ్గర లక్షల రూపాయలు లాక్కొన్నాడు. ప్రియుడు శాడిస్టుగా తయారై విపరీతంగా టార్చర్ పెట్టడంతో రగిలిపోయిన ప్రియురాలు అతని మీద కేసు పెట్టింది. ప్రియురాలి దెబ్బతో కేటుగాడి మీద కేసు నమోదు చేసిన పోలీసులు పాత కేసులు కూడా బయటకులాగడంతో వాడి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది.

అమాయకుడిలా నటించిన కేటుగాడు
కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని ఉళ్లాలలో షాన్ నవాజ్ అలియాస్ నవాజ్ (36) అనే వ్యక్తి నిాసం ఉంటున్నాడు. మూడబిదరిలో నివాసం ఉంటున్న 25 ఏళ్ల ఆయేషా (పేరు మార్చడం జరిగింది) అనే యువతి మీద నవాజ్ కన్ను వేశాడు ఆయేషాను పరిచయం చేసుకోవాలని నవాజ్ అనేక ప్రయత్నాలు చేశాడు.

ప్రేమ, పెళ్లి అంటూ వెంట తిరిగేశాడు
చాలా కాలం నుంచి ఆయేషా వెంట తిరిగిన నవాజ్ నిన్ను ప్రేమిస్తున్నానని, నువ్వు అంటే ప్రాణం అని, నువ్వు లేకపోతే నేను జీవించలేను అంటూ ఆమెకు మాయమాటలు చెప్పాడు. కొంతకాలానికి నవాజ్ ట్యాలెంట్ తో ఆయేషాను లొంగదీసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని ఆయేషాను నమ్మించిన నవాజ్ ఆమెను అతని వెంట తిప్పుకున్నాడు.

శారీరకంగా లొంగదీసుకున్నాడు
కొంతకాలం తరువాత ఆయేషాను రహస్య ప్రాంతానికి పిలుచుకుని వెళ్లి జ్యూస్ లో డ్రగ్స్ కలిపి ఇచ్చాడు. మత్తులోకి జారుకున్న ఆయేషా మీద మీద అత్యాచారం చేశాడు. విహారయాత్రలకు పిలుచుకుని వెళ్లి అక్కడ ఆయేషాకు డ్రగ్స్ ఇచ్చి ఆమె మీద అత్యాచారం చేసి అతని కామం తీర్చుకున్నాడు.

ప్రియురాలిని బ్లాక్ మెయిల్ చేసి రూ. లక్షలు లాగేశాడు
ప్రియురాలు ఆయేషా మీద అత్యాచారం చేసే సమయంలో, ఆమె నగ్నంగా ఉన్న సమయంలో వీడియోలు తీసిన నవాజ్ ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. నీ నగ్న వీడియోలు, నిన్ను రేప్ చేసే సమయంలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించి ఆయేషా నుంచి ఇటీవల రూ. 1.50 లక్షల రూపాయలు లాక్కొన్న నవాజ్ ఎంజాయ్ చేశాడు.

శాడిస్టు టార్చర్ ఎక్కువ కావడంతో ?
గతంలో వేలు వేలు లాక్కొన్న నవాజ్ ఒకేసారి ఆయేషా నుంచి రూ. 1.50 లక్షలు లాక్కొన్నాడు. రానురాను నవాజ్ అతని ప్రియురాలు ఆయేషాను టార్చర్ పెట్టాడు. ప్రియుడు నవాజ్ శాడిస్టుగా తయారై విపరీతంగా టార్చర్ పెట్టడంతో రగిలిపోయిన ప్రియురాలు అతని మీద మంగళూరు సీసీబీ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది.

ప్రియురాలి దెబ్బకు మైండ్ బ్లాక్
ప్రియురాలి దెబ్బతో కేటుగాడు నవాజ్ మీద కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. గతంలో నవాజ్ మీద కొన్ని పాత కేసులు కూడా ఉన్నాయని పోలీసు అధికారులు చెప్పారు. 2019లో, 2020లో మంగళూరులో డగ్స్ విక్రయిస్తూ నవాజ్ అరెస్టు అయ్యాడని, అతను పాత నేరస్తుడే అని పోలీసు అధికారులు చెప్పారు. ప్రియురాలి దెబ్బకు పాత కేసులు బయటకులాగడంతో నవాజ్ దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది.