• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Lovers: కూతురి లవ్ స్టోరీలో తండ్రి విలన్, మామతోనే మందుకొట్టి, ఫినిష్, స్టోరీ చెప్పాడు !

|

చెన్నై/ బెంగళూరు/ హోసూరు: వ్యాపారం చేసుకుంటున్న తండ్రి ముగ్గురు కుమార్తెలను సంతోషంగా చూసుకుంటున్నాడు. రెండో కూతురు ప్రేమ వ్యవహారం తండ్రికి తెలిసిపోయింది. కూతురిని, ఆమె ప్రియుడిని విడగొట్టడానికి తండ్రి అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే ప్రేమికులు మాత్రం వాళ్ల పంతం వదల్లేదు. ఇక లాభం లేదని నిర్ణయించిన తండ్రి కూతురిని బంధువుల ఇంటికి పంపించాడు. నీకు పెళ్లి చేస్తాను అంటూ కూతురి బాయ్ ఫ్రెండ్ ను నమ్మించి తీసుకెళ్లి అడ్డంగా లేపేశాడు. ఏదో ఘనకార్యం చేశానని భావించిన తండ్రి పోలీస్ స్టేషన్ చేరుకుని నా కూతురి లవ్ స్టోరీలో నేనే విలన్ అంటూ జరిగిన క్రైమ్ అండ్ థ్రిల్లర్ సినిమా స్టోరీ మొత్తం చెప్పేశాడు.

Illegal affair: భర్త ఫ్రెండ్ తో బెడ్ రూమ్ లో లేడీ టీచర్, డ్రాయింగ్ టీచర్ బొమ్మ రివర్స్!

నారాయణకు ముగ్గురు కూతుర్లు

నారాయణకు ముగ్గురు కూతుర్లు

తమిళనాడులోని హోసూరు (కర్ణాటక సరిహద్దు)లోని బ్యారికే సమీపంలోని కంద్రాంపల్లికి చెందిన నారాయణ (50) అనే వ్యక్తి 35 ఏళ్ల క్రితమే బెంగళూరు చేరుకున్నాడు. నారాయణకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఫ్యామిలీతో కలిసి బెంగళూరులో నివాసం ఉంటున్న నారాయణ జేపీ నగర్ లో కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు.

రెండో కూతురి లవ్ స్టోరీ

రెండో కూతురి లవ్ స్టోరీ

నారాయణ రెండో కూతురు సౌమ్య కూడా అప్పుడప్పుడు తండ్రి నిర్వహిస్తున్న కూరగాయల దుకాణానికి వెళ్లేది. నారాయణ నిర్వహిస్తున్న కురగాయల దుకాణం పక్కనే వసంత్ (25) అనే యువకుడు కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. గత మూడు సంవత్సరాల నుంచి వసంత్, నారాయణ రెండో కూతురు సౌమ్య ప్రేమించుకుంటున్నారు.

చచ్చినా ఒప్పుకోను.... అంతే

చచ్చినా ఒప్పుకోను.... అంతే

సౌమ్య ప్రేమ వ్యవహారం ఆమె తండ్రి నారాయణకు తెలిసిపోయింది. నాతో కలిసి వసంత్ మద్యం తాగుతాడని, వాడితో నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీళ్లేదని నారాయణ కుమార్తె సౌమ్యకు తేల్చి చెప్పాడు. తండ్రి మాటలు లెక్కచెయ్యని సౌమ్య ప్రియుడు వసంత్ ను కలుస్తూనే ఉండేది. ఈ విషయం తెలుసుకున్న నారాయణ రగిలిపోయాడు.

బంధువుల ఇంట్లో కూతురు.....కారులో ప్రియుడు

బంధువుల ఇంట్లో కూతురు.....కారులో ప్రియుడు

కొన్ని రోజుల క్రితం సౌమ్యను హోసూరు సమీపంలోని బ్యారికేలో ఉంటున్న బంధువుల ఇంటికి పంపించేశారు. తరువాత వసంత్ కు మాయమాటలు చెప్పిన నారాయణ తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తానని నమ్మించి కారులో అతన్ని హోసూరు పిలుచుకుని వెళ్లాడు. మోసూరు- బ్యారికే మార్గం మధ్యలో నారాయణ ఇద్దరు స్నేహితులను పిలిపించుకుని వసంత్ తో కలిసి పీకలదాక మద్యం సేవించారు.

రేయ్.... నా కూతురు కావాలా ?

రేయ్.... నా కూతురు కావాలా ?

పీకలదాక మద్యం సేవించిన తరువాత నారాయణ అతని అసలు స్వరూపం చూపించాడు. నువ్వు ఎంత, నీ బతుకెంత రా, నీ ముఖానికి నా కూతురు కావాలా అంటూ వసంత్ ను పట్టుకుని చితకబాదేశాడు. అదే సమయంలో కారులో ఉన్న రోలింగ్ రాడ్ తీసుకు వచ్చి వసంత్ మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేశారు. తలకు తీవ్రగాయాలు కావడంతో వసంత్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

నా కూతురి లవ్ స్టోరీలో నేనే విలన్

నా కూతురి లవ్ స్టోరీలో నేనే విలన్

కూతురు సౌమ్య ప్రియుడు వసంత్ చనిపోయాడని నిర్దారించుకున్న నారాయణ కిక్కు దిగిపోయే వరకు శవం పక్కనే ఉన్నాడు. తరువాత నేరుగా బ్యారికే పోలీస్ స్టేషన్ చేరుకున్న నారాయణ సార్ నా కూతురి లవ్ స్టోరీలో నేనే విలన్, కాభోయే అల్లుడిని చంపేశాను అంటూ పోలీసులకు చెప్పడంతో కలకలం రేపింది.

పెళ్లి కోసం వెళ్లి పాడె ఎక్కాడు

పెళ్లి కోసం వెళ్లి పాడె ఎక్కాడు

పెళ్లి చేసుకోవాలని ఆశతో ప్రియురాలి తండ్రితో వెళ్లిన యువకుడు వసంత్ అతని చేతిలోనే హత్యకు గురి కావడంతో అందరూ షాక్ అయ్యారు. హోసూరు ప్రభుత్వ ఆసుపత్రికి వసంత్ శవాన్ని తరలించారు. తెలిసిన వ్యక్తి నారాయణ వెంట వెళ్లిన వసంత్ అతని చేతిలోనే హత్యకు గురైనాడని తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు హడలిపోయారు.

English summary
Lovers: Father of young girl murdered youth who loved his daughter in Hosur near Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X