వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Girlfriend: ప్రియుడి కోసం యువతిని కిడ్నాప్ చేసి చంపేసింది, థ్రిల్లర్ సినిమా ట్విస్ట్ లు !

|
Google Oneindia TeluguNews

నోయిడా/న్యూఢిల్లీ: యువతి, యువకుడు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఆర్థిక సమస్యల కారణంగా ప్రియురాలి తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రియురాలికి వేరే అబ్బాయితో పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు. ఇదే సందర్బంలో ఓ యువతి శవమై కనిపించింది. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని యువతి శవం పక్కన డెత్ నోట్ చిక్కింది. ఆత్మహత్య చేసుకుంది ప్రియురాలు అని, ఆమె శరీరం మీద ఉన్న నగలు, బట్టలు ఆమెవే అని కుటుంబ సభ్యులు గుర్తించారు. ప్రియురాలి శవానికి ఆమె బంధువులు అంత్యక్రియలు జరిపించారు. ఇదే సమయంలో మరో యువవతి మాయం కావడం, ఆత్మహత్య చేసుకుందని అనుకున్న ప్రియురాలు ఆమె ప్రియుడితో పెళ్లి చేసుకుని షికార్లు తిరుగుతుందని వెలుగు చూడటంతో పోలీసులు సైతం బిత్తరపోయారు. థ్రిల్లర్ సినిమాను తలతన్నే ప్రియురాలి స్కెచ్, ఆమె అసలు మ్యాటర్ బయటకువచ్చింది.

Wife: భార్య పేరుతో రూ. 2 కోట్లకు ఇన్సూరెన్స్, కంత్రి మొగుడు ఏం చేశాడంటే ?, థ్రిల్లర్ సినిమా స్క్రిప్ట్ !Wife: భార్య పేరుతో రూ. 2 కోట్లకు ఇన్సూరెన్స్, కంత్రి మొగుడు ఏం చేశాడంటే ?, థ్రిల్లర్ సినిమా స్క్రిప్ట్ !

 ఫేస్ బుక్ లవర్స్

ఫేస్ బుక్ లవర్స్

నోయిడా సిటీ సమీపంలోని బద్ పుర ప్రాంతంలో పాయిల్ భట్ అలియాస్ పాయల్ అనే యువతి నివాసం ఉంటున్నది. మూడు సంవత్సరాల క్రితం ఫేస్ బుక్ లో పరిచయం అయిన అజయ్ అనే యువకుడితో పరిచయం పెంచుకుంది. కొంతకాలం తరువాత అజయ్, పాయల్ ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.

 ఆత్మహత్య చేసుకున్న తల్లిదండ్రులు

ఆత్మహత్య చేసుకున్న తల్లిదండ్రులు

పాయల్ తండ్రి వ్యాపారం చేసేవాడు. వ్యాపారంలో నష్టం రావడంతో పాయల్ తండ్రి సతమతం అయ్యాడు. ఆర్థిక సమస్యల కారణంగా ఆరు నెలల క్రితం పాయల్ తల్లిదండ్రులు ఇంటిలో ఆత్మహత్య చేసుకున్నారు. తరువాత పాయల్ బాగోగులు ఆమె బంధువులు చూసుకుంటున్నారు. పాయల్ కు వేరే అబ్బాయితో పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు అనుకున్నారు.

 ప్రియుడి కోసం కన్నింగ్ స్కెచ్

ప్రియుడి కోసం కన్నింగ్ స్కెచ్

తన బంధువులు, కుటుంబ సభ్యులు అజయ్ ని తాను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించరని పాయల్ తెలుసుకుంది. తన ప్రియుడు అజయ్ తో తాను సంతోషంగా ఉండాలంటే తాను చనిపోయానని అందరిని నమ్మించాలని పాయల్ అనుకుంది. ఇదే విషయంలో ప్రియుడు అజయ్ సహాయం తీసుకున్న పాయల్ థ్రిల్లర్ సినిమా స్కెచ్ వేసింది.

 యువతిని కిడ్నాప్ చేసి చంపేసిన ప్రేమికులు

యువతిని కిడ్నాప్ చేసి చంపేసిన ప్రేమికులు

నోయిడా వెస్ట్ ప్రాంతంలోని గౌర్ సిటీ మాల్ లో హేమా చౌధరి అనే యువతి ఉద్యోగం చేస్తోంది. చూడటానికి, వయసులో హేమా చౌధరి, పాయల్ దాదాపుగా ఒక్కటిగానే ఉంటారు. పాయల్, ఆమె ప్రియుడు హేమా చౌధరిని కిడ్నాప్ చేసి గొంతు నులిమి చంపేశారు. హేమా వేసుకున్న బట్టలు తీసేసి పాయల్ వేసుకునే బట్టలు, పాయల్ వేసుకున్న నగలు హేమాకు వేశారు.

 అంత్యక్రియులు జరిగిపోయాయి

అంత్యక్రియులు జరిగిపోయాయి

హేమా ముఖం మీద వేడి నూనె పోయడంతో ఆమె ముఖం గుర్తుపట్టలేని విదంగా తయారైయ్యింది. పాయల్ ఓ డెత్ నోట్ రాసింది, నా ముఖం మీద కొందరు నూనె పోశారని, ఇలాంటి ముఖం పెట్టుకుని జీవించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని డెత్ నోట్ రాసింది. పాయల్ కుటుంబ సభ్యులు కూడా హేమా శవాన్ని చూసి మోసపోయి ఆమె పాయల్ అని నమ్మి గత నెలలో అంత్యక్రియలు జరిపించేశారు.

 మిస్సింగ్ కేసుతో రివర్స్

మిస్సింగ్ కేసుతో రివర్స్

మా సోదరి హేమా చౌదరి ఉద్యోగానికి వెళ్లి తరువాత ఇంటికి రాలేదని ఆమె అన్న నోయిడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. హేమా కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసుకు అనుమానం వచ్చి పాయల్ గురించి మరోసారి ఆరా తీశారు. పాయల్, అజయ్ ఫోన్ కాల్ డేటా బయటకు లాగారు. హేమా మాయం అయిన రోజు పాయల్, అజయ్, హేమాల ఫోన్లు ఒకే లోకేషన్ లో ఉన్నాయని వెలుగు చూసింది.

 థ్రిల్లర్ సినిమా స్కెచ్ వేసిన ప్రియురాలు

థ్రిల్లర్ సినిమా స్కెచ్ వేసిన ప్రియురాలు

నవంబర్ 19వ తేదీన పాయల్ ఆమె ప్రియుడు అజయ్ తో ఆర్యసమాజ్ వివాహం చేసుకుని హ్యాపీగా తిరుగుతోందని పోలీసులు గుర్తించారు. ప్రియుడు అజయ్ ని పెళ్లి చేసుకోవాని హేమా అనే యువతిని హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించి అందరిని మోసం చేసిన పాయల్ ను నోయిడా పోలీసులు పట్టుకున్నారు. ప్రియురాలు పాయల్ కు సహకరించి హేమాను హత్య చేసిన అజయ్ ని పోలీసులు అరెస్టు చేశారు.

English summary
Lovers: Girlfriend hatched a conspiracy along with her lover killed another girl in Noida.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X