Lovers: కాలేజ్ లవర్స్, ఒకే కంపెనీలో ఉద్యోగం, అక్కడే పెళ్లి, అబార్షన్ చేయించి సీక్రేట్ మొగుడు ఎస్కేప్ !
చెన్నై/దిండుగల్: కాలేజ్ లో చదువుతున్న సమయంలో యువతి, యువకుడికి పరిచయం అయ్యింది. కాలేజ్ లో చదువుతున్న సమయంలో ప్రేమించుకుని చెట్టాపట్టాలు వేసుకుని తిరిగేశారు. కాలేజ్ పూర్తి అయిన తరువాత ఒకేసారి సిటీ చేరుకున్న ప్రేమికులు ఇద్దరూ ఒకే చోట ఉద్యోగంలో చేరారు. ఇంట్లో కుటుంబ సభ్యులకు తెలీకుండా వివాహం చేసుకున్న ప్రేమికులు సిటీలో అద్దె ఇల్లు తీసుకుని కాపురం పెట్టారు. అమ్మాయి, అబ్బాయి కుటుంబ సభ్యులు వేరే ఊరిలో ఉండటంతో ఈ విషయం అంత త్వరగా బయటపడలేదు. ఇదే సమయంలో భార్య గర్బవతి అయ్యింది. భార్యను ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లిన భర్త ఆమెకు తెలీకుండా డాక్టర్ ను మేనేజ్ చేసి ఆమెకు అబార్షన్ చేయించాడు. భార్యను ఇంట్లో వదిలిన భర్త ఆమెకు చెప్పాపెట్టకుండా అక్కడి నుంచి చెక్కేశాడు. నా భర్త నాకు కావాలని, మీరే న్యాయం చెయ్యాలని భార్య జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు ధర్నా చెయ్యడం కలకలం రేపింది.

ఒకే కాలేజ్ లో అమ్మాయి, అబ్బాయి
తమిళనాడులోని దిండుగల్ జిల్లాలోని వీరాలిపట్టి గ్రామంలో పెరుమాల్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. పెరుమాల్ కుమార్తె కౌసల్యా దిండుగల్ లోని ఐటీఐ కాలేజ్ లో చేరింది, కన్ననూరై ప్రాంతంలో నివాసం ఉంటున్న మురడేశ్వరన్ అనే యువకుడు దిండుగల్ ఐటీఐ కాలేజ్ లోనే చేరి అక్కడే చదువుకోవడం మొదలు పెట్టాడు.

కాలేజ్ లో లవర్స్
ఒకే కాలేజ్ లో చదువుకుంటున్న కౌసల్యా, మురడేశ్వరన్ స్నేహితులు అయ్యారు. తరువాత కౌసల్యా, మురడేశ్వరన్ కలిసి తిరుగుతూ ప్రేమలో పడ్డారు. కాలేజ్ లో చదువుతున్న సమయంలో ప్రేమించుకున్న కౌసల్యా, మురడేశ్వరన్ చెట్టాపట్టాలు వేసుకుని తిరిగేశారు. కౌసల్యా, ముడేశ్వరన్ ప్రేమించుకన్న విషయం కాలేజ్ లో అందరికి తెలిసిపోయింది.

చెన్నైలో ఉద్యోగం..... సీక్రేట్ గా పెళ్లి
కాలేజ్ లో చదువు పూర్తి అయిన తరువాత ఒకేసారి చెన్నై సిటీ చేరుకున్న ప్రేమికులు కౌసల్యా, మురడేశ్వరన్ ఇద్దరూ ఒకే చోట ఉద్యోగంలో చేరారు. ఇంట్లో కుటుంబ సభ్యులకు తెలీకుండా కౌసల్యా, మురడేశ్వరన్ సీక్రేట్ గా వివాహం చేసుకున్న ప్రేమికులు సిటీలో అద్దె ఇల్లు తీసుకుని కాపురం పెట్టారు. కౌసల్యా, మురడేశ్వరన్ కుటుంబ సభ్యులు వేరే ఊరిలో ఉండటంతో ఈ విషయం అంత త్వరగా బయటపడలేదు.

అబార్షన్ చేయించి భర్త ఎస్కేప్
కొన్ని నెలల తరువాత కౌసల్యా గర్బవతి అయ్యింది. భార్య కౌసల్యాను ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లిన మురడేశ్వరన్ ఆమెకు తెలీకుండా డాక్టర్ ను మేనేజ్ చేసి ఆమెకు అబార్షన్ చేయించాడు. భార్య కౌసల్యాను ఇంట్లో వదిలిన భర్త ఆమెకు చెప్పాపెట్టకుండా అక్కడి నుంచి చెక్కేశాడు. మురడేశ్వరన్ ను అతని భార్య కౌసల్యా సంప్రధించింది. నీ కులం వేరు, మా కులం వేరు, పెళ్లికి మా ఇంట్లో ఒప్పుకోవడం లేదని చెప్పి చేతులు దులుపుకున్నాడు.

ఎస్పీ ఆఫీసులో ధర్నా చేసిన భార్య
భర్త మురడేశ్వరన్ మీద స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినా పోలీసులు పట్టించుకోలేదని కౌసల్యా ఆరోపించింది. నా భర్త నాకు కావాలని, మీరే న్యాయం చెయ్యాలని కౌసల్యా దిండుగల్ జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు ధర్నా చెయ్యడం కలకలం రేపింది. కౌసల్యా నుంచి పూర్తి సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.