Lovers: పెళ్లైన ఆరు రోజులకే ప్రేమికులు ఫినిష్, తమ్ముడు, బావ పక్కాస్కెచ్, డిన్నర్ కు పిలిచి గడపలోనే !
చెన్నై/ తంజావూర్: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు వేరుకావడంతో వారి పెళ్లికి పెద్దలు అడ్డుపడుతారని ప్రేమికులు ముందుగానే ఊహించారు. యువతిని ఆమె బావకు ఇచ్చి పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు. తన అక్కను మా బావకు ఇచ్చి పెళ్లి చెయ్యాలని యువతి తమ్ముడు అనుకున్నాడు. అయితే యువతి మాత్రం ఆమె ప్రేమించిన యువకుడినినే పెళ్లి చేసుకోవాలని అనుకుంది. అమ్మాయి కుటుంబ సభ్యులు పెళ్లిని వ్యతిరేకించడంతో ప్రేమికులు ఇంటి నుంచి పారిపోయి స్నేహితుల సహాయంతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న అక్క,బావను డిన్నర్ కు రావాలని పెళ్లి కూతురు తమ్ముడు ఆహ్వానించాడు. నవధంపతులు డిన్నర్ కు వెళ్లిన సమయంలో గడపలోనే ఇద్దరిని సినిమా స్టైల్లో దారుణంగా నరికి చంపేయడం కలకలం రేపింది.

ఐదు సంవత్సరాల ప్రేమ
తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో మోహన్ (31) అనే యువకుడు, తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని కుంభకోణం సమీపంలోని తులక్కవేలి ప్రాంతంలో శరణ్య (25) అనే యువతి నివాసం ఉంటున్నది. ఐదు సంవత్సరాల క్రితం మోహన్, శరణ్యకు పరిచయం అయ్యింది. తరువాత శరణ్య, మోహన్ ఇద్దరూ ప్రేమించుకున్నారు.

ఎంజాయ్ చేసిన లవర్స్
ప్రేమించుకున్న తరువాత శరణ్య, మోహన్ కలిసి చాలా సంతోషంగా తిరిగారు. ప్రేమికులు చూడముచ్చటగా ఉన్నారని, పెళ్లి చేసుకుంటే జీవితాంతం సుఖంగా ఉంటారని వాళ్ల స్నేహితులు అనుకున్నారు. ఇద్దరి కులాలు వేరుకావడంతో వారి పెళ్లికి పెద్దలు అడ్డుపడుతారని ప్రేమికులు శరణ్య, మోహన్ ముందుగానే ఊహించారు.

బావతో పెళ్లి చెయ్యాలని డిసైడ్
శరణ్యకు శక్తివేల్ అనే తమ్ముడు ఉన్నాడు. శరణ్యకు. ఆమె భర్త రంజిత్ కు పెళ్లి చెయ్యాలని చాలా సంవత్సరాల క్రితమే ఇరువైపుల కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నారు. శరణ్యను ఆమె బావ రంజిత్ కు ఇచ్చి పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు. తన అక్క శరణ్యను మా బావ రంజిత్ కు ఇచ్చి పెళ్లి చెయ్యాలని యువతి తమ్ముడు శక్తివేల్ డిసైడ్ అయ్యాడు.


పారిపోయి పెళ్లి చేసుకున్న లవర్స్
అయితే శరణ్య మాత్రం ఆమె ప్రేమించిన మోహన్ ను పెళ్లి చేసుకోవాలని అనుకుంది. అమ్మాయి శరణ్య కుటుంబ సభ్యులు పెళ్లిని వ్యతిరేకించడంతో ప్రేమికులు శరణ్య, మోహన్ ఆరు రోజుల క్రితం ఇంటి నుంచి పారిపోయి స్నేహితుల సహాయంతో పెళ్లి చేసుకున్నారు. శరణ్య, మోహన్ దంపతులు చెన్నైలో కొత్తగా ఇంటిని అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. పెళ్లి జరిగి ఆరు రోజులు మాత్రమే కావడంతో శరణ్య, మోహన్ దంపతులు సంతోషంగా జీవించాలని అనుకున్నారు.

పక్కాప్లాన్ తో నరికి చంపేశారు
పెళ్లి చేసుకున్న అక్క,బావ శరణ్య, మోహన్ ను డిన్నర్ కు రావాలని పెళ్లి కూతురు తమ్ముడు శక్తివేల్ తంజావూరుకు ఆహ్వానించాడు. నవధంపతులు శరణ్య, మోహన్ తంజావూర్ లో తమ్ముడు శక్తివేల్ ఏర్పాటు చేసిన డిన్నర్ కు వెళ్లారు. ఆ సందర్బంలో డిన్నర్ కు వెళ్లిన నవందపతులు శరణ్య, మోహన్ ను ఇంటి గడపలోనే తమ్ముడు శరణ్య, బావ రంజిత్ కొడవళ్లతో నరికి అతి దారుణంగా ఇద్దరిని సినిమా స్టైల్లో నరికి చంపేయడం కలకలం రేపింది. నవదంపతులను దారుణంగ హత్య చేసిన శక్తివేల్, అతని బావ రంజిత్ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయారు.