Lovers: రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం రా, బ్యాగ్ తో వెళ్లిన ప్రియురాలు, క్లైమాక్స్ లో ప్రియుడు !
బెంగళూరు/చామరాజనగర్: ప్రముఖ పుణ్యక్షేత్రం సమీపంలోని వేర్వేరు గ్రామాల్లో నివాసం ఉంటున్న యువతి, యువకుడికి జాతరలో పరిచయం అయ్యింది. తరువాత యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు వేరు అని తెలిసినా ఇద్దరూ చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. నీది తక్కువ కులం అయినా పర్వాలేదని, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని, నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటానని ప్రియుడు అతని ప్రియురాలికి సినిమా డైలాగులు చెప్పాడు. ప్రియుడి మాయమాటలు నమ్మిన యువతి పెళ్లికి ముందే అతనికి సర్వం సమర్పించుకుంది. ఇటీవల ప్రియురాలు పెళ్లి చేసుకుందామని ప్రియుడి మీద ఒత్తిడి చేసింది.
రేపు మద్యాహ్నం మనం నిత్యం కలుసుకునే రహస్య ప్రాంతానికి నువ్వు రావాలని, మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని ప్రియుడు అతని ప్రియురాలికి చెప్పాడు. ప్రియుడు చెప్పిన ప్రాంతానికి వెళ్లిన ప్రియురాలు అతని కోసంఎదురు చూసింది. అయితే ప్రియుడు మాత్రం అక్కడికి వెళ్లలేదు. రాత్రి పొద్దుపోయే వరకు ప్రియుడి కోసం అతని ప్రియురాలు ఎదురు చూసింది. ప్రియురాలికి హ్యాండ్ ఇచ్చిన ప్రియుడు మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎస్కేప్ అయ్యాడు. ప్రియుడు మోసం చేశాడని తెలుసుకున్న ప్రియురాలు ఇప్పుడు పోలీసులను ఆశ్రయించింది.
Wife:
డబ్బు
సంపాదనలో
భర్త
బిజీ,
పక్కింటి
ప్రియుడితో
భార్య
బిజీ,
భార్యకు
శుభం
కార్డు,
క్లైమాక్స్
!

పక్కపక్క గ్రామాల్లో ప్రేమికులు
కర్ణాటకలోని చామరాజనగర జిల్లాలోని హానూరు తాలుకాలోని కోణనెకెరెలో వసంతా అనే యువతి నివాసం ఉంటున్నది. కోణనెకెరె సమీపంలోని గ్రామంలో పరమ్ జ్యోతి అలియాస్ పరమ్ (250 అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ప్రముఖ పుణ్యక్షేత్రం మహదేశ్వర బెట్ట సమీపంలోని వేర్వేరు గ్రామాల్లో నివాసం ఉంటున్న వసంతా, పరమ్ జ్యోతికి రెండు సంవత్సరాల క్రితం మహదేశ్వర బెట్ట జాతరలో పరిచయం అయ్యింది.

సినిమా డైలాగులు చెప్పిన ప్రియుడు
కొంతకాలం తరువాత వసంతా, పరమ్ జ్యోతి ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు వేరు అని తెలిసినా ఇద్దరూ చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. నీది తక్కువ కులం అయినా పర్వాలేదని, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని, నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటానని ప్రియుడు పరమ్ జ్యోతి అతని ప్రియురాలు వసంతాకు సినిమా డైలాగులు చెప్పాడు.

పెళ్లికి ముందే అన్నీ ?
ప్రియుడు పరమ్ జ్యోతి మాయమాటలు నమ్మిన వసంతా పెళ్లికి ముందే అతనికి సర్వం సమర్పించుకుంది. ఇటీవల ప్రియురాలు వసంతా మనం పెళ్లి చేసుకుందామని ప్రియుడు పరమ్ జ్యోతి మీద ఒత్తిడి చేసింది. బెంగళూరులో క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్న పరమ్ జ్యోతి పెళ్లి విషయం ఎత్తేసరికి ఈరోజు, రేపు అంటూ కాలం గడపడం మొదలుపెట్టాడు.

ప్రియురాలిని రహస్య ప్రాంతానికి పిలిపించి ?
వసంతా ఎక్కువ ఒత్తిడి చెయ్యడంతో ప్రియుడు పరమ్ జ్యోతి కిలాడీ స్కెచ్ వేశాడు. రేపు మద్యాహ్నం మనం నిత్యం కలుసుకునే రహస్య ప్రాంతానికి నువ్వు రావాలని, మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని ప్రియుడు పరమ్ జ్యోతి అతని ప్రియురాలు వసంతాకు చెప్పాడు. ప్రియుడు పరమ్ జ్యోతి చెప్పిన ప్రాంతానికి వెళ్లిన ప్రియురాలు వసంతా అతని కోసంఎదురు చూసింది.

మోసం చేసిన ప్రియుడు ఎస్కేప్
ప్రియుడు పరమ్ జ్యోతి మాత్రం అతను చెప్పి చోటకు వెళ్లలేదు. రాత్రి పొద్దుపోయే వరకు ప్రియుడు పరమ్ జ్యోతి కోసం అతని ప్రియురాలు వసంతా ఎదురు చూసింది. ప్రియురాలు వసంతాకు హ్యాండ్ ఇచ్చిన ప్రియుడు పరమ్ జ్యోతి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎస్కేప్ అయ్యాడు. ప్రియుడు పరమ్ జ్యోతి మోసం చేశాడని తెలుసుకున్న అతని ప్రియురాలు వసంతా ఇప్పుడు తనకు న్యాయం చెయ్యలని చామరాజనగర జిల్లాలోని మహదేశ్వర బెట్ట పోలీసులను ఆశ్రయించింది.