• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Girlfriend: ఇంట్లో దూరి ప్రియురాలు, ఆంటీ మీద ?, అనుమానంతో లవర్, ఫేస్ బుక్ తో తంటా !

|

పాట్నా/చెన్నై: యువతి, యువకుడికి ఫేస్ బుక్ లో పరిచయం అయ్యింది. సంవత్సరం నుంచి ఇద్దరూ చాలాసార్లు బయట కలుసుకుని తిరిగారు. యువతి, యువకుడు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారని తెలిసింది. ఇంతో ప్రియురాలి మీద ప్రియుడికి అనుమానం మొదలైయ్యింది. ప్రియురాలు కూడా రానురాను ప్రియుడిని దూరం పెడుతూ వచ్చింది. తన ప్రియురాలు దూరం అవుతోందని ప్రియుడు రగిలిపోయాడు. అంతే నేరుగా ప్రియురాలి ఇంటికి వెళ్లి రివాల్వర్ తీసుకుని ప్రియురాలు, ఆమె తల్లి మీద కాల్పులు జరిపాడు. రివాల్వర్ తూటాలకు ప్రియురాలు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అంటీ తప్పించుకుని ప్రాణాలతో బయటపడింది. ఇంట్లో దూరి తల్లి కూతురి మీద కాల్పులు జరిపిన ప్రియుడిని స్థానికులు పట్టుకుని చితకబాదేసి పోలీసులకు అప్పగించారు. అందరూ చూస్తున్న సమయంలో తల్లీ, కూతురిని రివాల్వర్ తో కాల్చడం కలకలం రేపింది.

Illegal affair: భార్య నాటుకోడి, ప్రియుడు పందెంకోడి, పులుసు పెట్టిన భర్త, పెళైన మూడో రోజు ?Illegal affair: భార్య నాటుకోడి, ప్రియుడు పందెంకోడి, పులుసు పెట్టిన భర్త, పెళైన మూడో రోజు ?

 ఫేస్ బుక్ లో పరిచయం

ఫేస్ బుక్ లో పరిచయం

ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ జిల్లాలోని కైలోరా గ్రామంలో నివాసం ఉంటున్న రష్మీ (పేరు మార్చడం జరిగింది), మధురలోని కోసికల్ హాసన్ ప్రాంతంలోని మహాసింగ్ పూర్ లో నివాసం ఉంటున్న నరేంద్ అలియాస్ రింకు అనే యువకుడికి సంవత్సరం క్రితం ఫేస్ బుక్ లో పరిచయం అయ్యింది. తరువాత రష్మీ, నరేంద్ర వారి ఫోన్ నెంబర్లు మార్చుకుని ఫోన్ లో మాట్లాడుకుంటున్నారు.

బైక్ లో ప్రియురాలి ఇంటికి

బైక్ లో ప్రియురాలి ఇంటికి

గురువారం రాత్రి నరేంద్ర అతని స్నేహితుడు బైక్ లో రష్మీ ఊరికి వెళ్లారు. స్నేహితుడు బైక్ మీద బయట ఉండటంతో నరేంద్ర నేరుగా రష్మీ ఇంట్లోకి వెళ్లాడు. ఇంట్లో రష్మీ, బెడ్ రూమ్ లో ఆమె తల్లి మాత్రమే ఉన్నారు. ఆ సమయంలో నరేంద్ర ప్రియురాలు రష్మీతో గొడవపెట్టుకున్నాడు. ఆ సమయంలో ఇద్దరి మద్య మాటామాటా పెరిగిపోవడంతో నరేంద్ర సహనం కల్పోయాడు.

 కాల్పులతో హడల్

కాల్పులతో హడల్

ప్రియురాలితో చాలా సేపు గొడవ పడిన నరేంద్ర జోబులో నుంచి రివాల్వర్ బయటకు తీసి రష్మీ కడుపులో కాల్చేశాడు. అదే సమయంలో రష్మీ తల్లి మీద కాల్పులు జరపడంతో ఆమె తిప్పించుకోవడంతో బుల్లెట్లు పక్కకు దూసుకుపోయి ఆమెకు గాయాలైనాయి. తుపాకి కాల్పులు శభ్దం వినిపించడంతో స్ధానికులు రష్మీ ఇంటి దగ్గరకు పరుగు తీశారు.

 బెండ్ తీసేశారు... ప్రియురాలి ప్రాణం పోయింది

బెండ్ తీసేశారు... ప్రియురాలి ప్రాణం పోయింది

ప్రియురాలిపై కాల్పులు జరిపి పారిపోవడానికి ప్రయత్నించిన నరేంద్ర, అతని స్నేహితుడి వెంటాడి పట్టుకున్న స్థానికులు వారిని చితకబాది పోలీసులకు అప్పగించారు. రక్తపు మడుగులో పడి ఉన్న రష్మీని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సలహామేరకు రష్మీని ఆలీగడ్ ముస్లీం విశ్వవిధ్యాలయం మెడికల్ కాలేజ్ (AMU)కు తరలించారు. చికిత్స విఫలమై రష్మీ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రష్మీ తల్లి చికిత్స పొందుతూ కొలుకుంటోందని పోలీసులు అంటున్నారు.

 ప్రియురాలి మీద అనుమానం ?

ప్రియురాలి మీద అనుమానం ?

గత సంవత్సరం నుంచి నరేంద్ర, రష్మీ చాలాసార్లు బయట కలుసుకుని తిరిగారని, ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారని తెలిసిందని పోలీసు అధికారి సురేంద్ర సింగ్ స్థానిక మీడియాకు చెప్పారు. ఇంతలో ప్రియురాలు రష్మీ మీద ప్రియుడు నరేంద్రకు అనుమానం మొదలైయ్యిందని వెలుగు చూసింది.

  CSK Star Ruturaj Gaikwad Savage Reply To Gossips | Sayali Sanjeev || Oneindia Telugu
   తేడాలు వచ్చాయి... అందుకే హత్య

  తేడాలు వచ్చాయి... అందుకే హత్య

  ప్రియురాలు కూడా రానురాను ప్రియుడిని దూరం పెడుతూ వచ్చిందని సురేంద్ర సింగ్ చెప్పారు. తన ప్రియురాలు రష్మీ ఎక్కడ దూరం అవుతుందో అనే ఆవేశంలో నరేంద్ర ఇంట్లో దూరి రివాల్వర్ తో కాల్చి చంపేశాడని పోలీసు అధికారి సురేంద్ర సింగ్ చెప్పారు. కంట్రీ మేడ్ రివాల్వర్ యువతి హత్యకు ఉపయోగించాడని, నరేంద్ర ఆ రివాల్వర్ ఎక్కడ కొనుగోలు చేశాడో అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు. మొత్తం మీద తుపాకి కాల్పులతో ఉత్తరప్రదేశ్ ప్రజలు మరోసారి హడలిపోయారు.

  English summary
  Lovers: In a shocking incident, a man along with his friend reached his girlfriend's house and shot her dead in front of her mother in Hathras district of Uttar Pradesh.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X