• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

lovers: ఓ వీడియో వీడి జీవితాన్నే మార్చేసింది, ప్రియురాలితో ఆ రోజు, కొంప ముంచిన ఫ్రెండ్స్ !

|

చెన్నై/ మదురై/ నీలగిరి: స్కూల్ అమ్మాయితో తిరిగిన ఓ యువకుడు ఆమెతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు. ఇంతకాలం షికార్లు తిరిగిన ఆ యువకుడు ఆమెను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. అంతే ప్రముఖ ఆలయంలోని అమ్మాయిని రావాలని చెప్పాడు. స్కూల్ కు వెలుతున్న ఆ అమ్మాయి స్కూల్ యూనీఫామ్ లోనే గుడికి వెళ్లింది. అంతే అప్పటికే ఫ్రెండ్స్ అక్కడ ఉన్న ప్రియుడు అమ్మాయి మెడలో తాళి కట్టాడు. ప్రియుడి స్నేహితులు పెళ్లి పెద్దల్లాగా ఇద్దరినీ ఆశీర్వధించారు. అమ్మాయి మెడలో ప్రియుడు తాళి కట్టే సమయంలో స్మార్ట్ ఫోన్ లో వీడియో తీశారు. కొన్ని రోజుల తరువాత లవర్స్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతే ప్రియురాలిని పెళ్లి చేసుకున్న ఆనందంలో ఉన్న ఆ ప్రియుడికి ఆ వీడియో దెబ్బతో పట్టపగలు ఆకాశంలోని అన్ని చక్కలు కనపడటంతో అతని జీవితం ఊహించని మలుపు తిరిగిపోయింది.

Wife: భార్య శోభనం సీన్లు పోర్న్ సైట్లలో, వాట్సాప్ లో టెక్కీ మొగుడు షేర్, మూడో పెళ్లాంతో షార్వా !Wife: భార్య శోభనం సీన్లు పోర్న్ సైట్లలో, వాట్సాప్ లో టెక్కీ మొగుడు షేర్, మూడో పెళ్లాంతో షార్వా !

 వీడియో వైరల్

వీడియో వైరల్

సోషల్ మీడియాలో ఓ వీడియో ఇటీవల వైరల్ అయ్యింది. దేవాలయంలో స్కూల్ యూనీఫామ్ లో ఉన్న అమ్మాయి మెడలో ఓ యువకుడు తాళి కడుతున్న సమయంలో ఆ వీడియో తీశారు. దేవాలయంలో ప్రేమికులు పెళ్లి చేసుకోవడం, పక్కనే ఉన్న కొందరు యువకులు ఆ ప్రేమ జంటను ఆశీర్వదిస్తున్న విషయం ఆ వీడియోలో స్పష్టంగా కనపడుతోంది.

 స్కూల్ యూనీఫామ్ లో పెళ్లి చేసుకుందా ?

స్కూల్ యూనీఫామ్ లో పెళ్లి చేసుకుందా ?

పెళ్లి కూతురు స్కూల్ యూనీఫామ్ లో ఉండటంతో ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టింది. ఆ వీడియో సామాజిక కార్యకర్త సెల్వరాజ్ కంట్లో పడింది. అంతే వీడియో క్లిప్పింగ్ చేతిలో పట్టుకున్న సామాజిక కార్యకర్త సెల్వరాజ్ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసి ఆ వీడియోన అధికారులకు అప్పగించారు. స్కూల్ యూనిఫామ్ లో ఉన్న పెళ్లి కూతురు మైనర్ అని, మీరు వీళ్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆ సామాజిక కార్యకర్త పోలీసులకు మనవి చేశాడు.

గౌతమ్ ఫ్రమ్ నీలగిరి

గౌతమ్ ఫ్రమ్ నీలగిరి

పోలీసుల విచారణలో తమిళనాడులోని నీలగిరి సమీపంలోని కూనూరులోని ప్రముఖ ఆలయం అని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అమ్మాయి మెడలో తాళి కట్టింది నీలగిరి సమీపంలోని కుట్టాన్ ప్రాంతానికి చెందిన గౌతమ్ అనే యువకుడు అని పోలీసులు గుర్తించారు. గౌతమ్ తో తాళి కట్టించుకుంటున్న సమయంలో అమ్మాయి నవ్వుతూ సంతోషంగా తాళి కట్టించుకుందని ఆ వీడియోను చూస్తే అర్థం అవుతోంది.

రా... నాయనా... బాబు బంగారం

రా... నాయనా... బాబు బంగారం

పోలీసులు గౌతమ్ అడ్రస్ కనుక్కుని అతన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. తాను ప్రేమించిన అమ్మాయితో తాను రహస్యంగా గుడిలో పెళ్లి చేసుకున్నానని, ఒకవేళ అమ్మాయి కుటుంబ సభ్యులు మా పెళ్లికి నిరాకరిస్తే అప్పుడు ఈ వీడియో చూపించి మాకు ముందే పెళ్లి జరిగిపోయిందని పెద్దలను బ్లాక్ మెయిల్ చెయ్యాలని ముందు జాగ్రత్తగా మా ఫ్రెండ్స్ తో వీడియో తీపించానని గౌతమ్ పోలీసులకు చెప్పాడు.

పెళ్లికొడుక్కి తెలీకుండా అప్ లోడ్

పెళ్లికొడుక్కి తెలీకుండా అప్ లోడ్

అమ్మాయి చదువు పూర్తి అయిన తరువాత తనకు ఇచ్చి పెళ్లి చెయ్యడానికి ఆమె తల్లిదండ్రులు నిరాకరిస్తే అప్పుడు ఈ వీడియో బయటపెట్టాలని ముందు జాగ్రత్తగా వీడియో తీపించామని. అయితే ఆ వీడియో ఎవరు అప్ లోడ్ చేశారో తనకు తెలీదని గౌతమ్ అంటున్నాడు. ఆ వీడియో గౌతమ్ సోషల్ మీడియాలో అప్ లోడ్ చెయ్యలేదని తెలిసింది. అయితే ఆ వీడియో ఎవరు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు ? అనే విషయం అంతు చిక్కక గౌతమ్ మైండ్ బ్లాక్ అయ్యింది.

మైనర్ ను పెళ్లి చేసుకుంటావా ?

మైనర్ ను పెళ్లి చేసుకుంటావా ?


గౌతమ్ పెళ్లి చేసుకున్న అమ్మాయి మైనర్ అని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మైనర్ అయినా ఆ అమ్మాయి ఇష్టంతో నే గౌతమ్ ఆమె మెడలో తాళి కట్టాడని వెలుగు చూసింది. అయితే మైనర్ ను పెళ్లి చేసుకోవడం నేరం కావడంతో గౌతమ్ మీద పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపించారు.

జీవితంలో ఊహించి ఉండడు

జీవితంలో ఊహించి ఉండడు

ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునే సమయంలో ఫ్రెండ్స్ తీసిన ఓ వీడియో తన జీవితం తల్లకిందులు చేస్తుందని, ఆ వీడియోనే తన కొంపముంచి జైలుకు వెళ్లడానికి కారణం అవుతోంది గౌతమ్ అస్సలు ఊహించి ఉండడని పోలీసులు అంటున్నారు. గౌతమ్ స్నేహితులే కావాలని ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

English summary
lovers: Youth marries School girl in Nilgiris arrested by Tamil Nadu police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X